
ఆనంద్‌కు మరో డ్రా
నార్వేలో జరుగుతున్న ఆల్టీబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచ మాజీ చాంపియన్, భారత ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్‌కు మరో డ్రా ఎదురైంది. శుక్రవారం లెవోన్ ఆరోనియన్ (ఆర్మేనియా)తో జరిగిన ఏడు రౌండ్ మ్యాచ్‌ను ఆనంద్ డ్రాగా ముగించాడు.
ప్రస్తుతం మూడున్నర పాయింట్లతో ఆనంద్ ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. చివరిదైన ఎనిమిదో రౌండ్‌లో మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో ఆనంద్ తలపడనున్నాడు.