
ఆల్టిబాక్స్ నార్వే చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్‌కు తొలి ఓటమి ఎదురైంది.నార్వేలోని స్టావెంజర్ నగరం వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీ ఎనిమిదో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 50 ఎత్తుల్లో ఫాబియానో కరువానా (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. తర్వాతి గేమ్‌లో కర్జాకిన్ సెర్గీ (రష్యా)తో ఆనంద్ తలపడతాడు. ఈ ఓటమి అనంతరం మొత్తం 3.5 పాయింట్లతో పాయింట్లతో ఆనంద్ ర్యాంకు
ఐదోస్థానానికి పడిపోయింది. ఆనంద్ తన చివరి రౌండ్‌లో డింగ్ లిరెన్ (చైనా)తో తలపడతాడు.