
సీనియర్ నటి కన్నుమూత
అలనాటి బాలీవుడ్ కథానాయిక, సీనియర్ నటి సుమితా సన్యాల్ కన్నుమూశారు.
అలనాటి బాలీవుడ్ కథానాయిక, సీనియర్ నటి సుమితా సన్యాల్ కన్నుమూశారు. ఆమె వయస్సు 71 సంవత్సరాలు. కోల్‌కతాలోని తన నివాసంలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపట్ల పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంతాపం ప్రకటించారు. ఆమె కుటుంబసభ్యులకు ట్విట్టర్‌లో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ఎక్కువగా బెంగాల్ సినిమాల్లో నటించిన సుమిత రాజేష్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ హీరోలుగా తెరకెక్కిన 'ఆనంద్' సినిమాలో కథానాయికగా నటించి మెప్పించారు. డార్జిలింగ్‌లో జన్మించిన ఆమె అసలు పేరు మంజుల సన్యాల్. ఆమె 50కిపైగా బెంగాల్ సినిమాల్లో నటించారు. హిందీలో గుడీ, మిలీ, ఆశ్విరాద్, మేరే ఆప్నే తదితర సినిమాలు చేశారు. ఎడిటర్ సుబోధ్ రాయ్‌ను పెళ్లాడిన ఆమెకు ఓ కొడుకు ఉన్నారు.