ఆనంద్ చేసిన వంటకాన్ని రుచి చూస్తున్న అతని భార్య అరుణ
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ వరుసగా నాలుగో ‘డ్రా’ నమోదు చేశాడు. సో వెస్లీ (అమెరికా)తో శుక్రవారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో తెల్లపావులతో ఆడిన ఆనంద్ 35 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు. 10 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడుతున్న ఈ టోర్నీలో నాలుగో రౌండ్ తర్వాత ఆనంద్ ఖాతాలో రెండు పాయింట్లు ఉన్నాయి.
శనివారం జరిగే ఐదో రౌండ్‌లో ప్రపంచ చాంపియన్ కార్ల్‌సన్ (నార్వే)తో ఆనంద్ ఆడతాడు. ఈ టోర్నీలో గురువారం విశ్రాంతి రోజు కావ డంతో మొత్తం పది మంది ఆటగాళ్లను ఐదు గ్రూప్‌లుగా విభజించి సరదాగా వంటల పోటీ నిర్వహించారు. ఇందులో ఆనంద్–లిరెన్ డింగ్ (చైనా) జంట చేసిన వంటకానికి ప్రథమ బహుమతి లభించింది.
Comments
Please login to add a commentAdd a comment