వేడెక్కిన ‘ఉప’ పోరు | AIADMK fields S. Valarmathi for Srirangam by-poll | Sakshi
Sakshi News home page

వేడెక్కిన ‘ఉప’ పోరు

Published Sat, Jan 17 2015 3:40 AM | Last Updated on Tue, Aug 14 2018 2:50 PM

వేడెక్కిన ‘ఉప’ పోరు - Sakshi

వేడెక్కిన ‘ఉప’ పోరు

శ్రీరంగం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థిగా ఎస్.వలర్మతి పేరు ఖరారైంది. ఆమె పేరును పార్టీ అధినేత్రి జయలలిత శుక్రవారం     అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే డీఎంకే అభ్యర్థిని ప్రకటించింది. మరోవైపు బీజేపీ సైతం ఉప ఎన్నిక పోరుకు సమాయత్తమవుతోంది. మిగిలిన పార్టీలు ఎన్నికలో పోటీపై ఎటూ తేల్చుకోలేకపోతున్నాయి. మొత్తం మీద ఉప ఎన్నిక రాజకీయం వేడెక్కింది.

 చెన్నై, సాక్షి ప్రతినిధి: తిరుచ్చిరాపల్లి జిల్లా శ్రీరంగం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వ హించిన జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శిక్ష కారణంగా సభ్యత్వాన్ని కోల్పోయారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే నెల 13న పోలింగ్ జరగనుంది. ముఖ్యమంత్రి హోదాలో జయలలిత ప్రాతినిధ్యం వహించిన స్థానం కావడంతో శ్రీరంగం నియోజకవర్గానికి ప్రత్యేకత లభించింది. దీంతో ఉప ఎన్నికలో విజయం కోసం అన్ని పార్టీలూ ఆరాటపడుతున్నాయి. డీఎంకే అభ్యర్థిగా ఆనంద్ పేరు ఇప్పటికే ఖరారైంది. తాజాగా అన్నాడీఎంకే సైతం ఎస్.వలర్మతి పేరు ఖరారు చేసింది.

మరోవైపు పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ నెల 18న చెన్నైకి రానున్నారు. బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా శ్రీరంగం స్థానాన్ని చేజిక్కించుకోవాలని అమిత్‌షా ఆశిస్తున్నారు. డీఎంకే నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సినీనటుడు నెపోలియన్ పేరు వినపడుతోంది. ఇదే ఖరారైతే కాంగ్రెస్ అభ్యర్థిగా నటి కుష్బును రంగంలోకి దించాలని తిరుచ్చిలోని ఆ పార్టీ నేతలు పట్టుపడుతున్నారు.

 ఒంటరిగా పోటీ చేయడమా, ఏదైనా పార్టీకి మద్దతు తెలపడమా అనే మీమాంశ నుంచి కాంగ్రె స్ బయటపడలేదు. బీజేపీ కూటమిలో ఉన్న డీఎండీకే సైతం ఊగిసలాట ధోరణినే అవలంబిస్తోంది. శ్రీరంగంలో ఎన్ని పార్టీలు బరిలోకి దిగినా అన్నాడీఎంకే, డీఎంకే మధ్యనే ప్రధానపోటీ ఉంటుంది. ఈ రెండు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో ఉప ఎన్నిక పోరు వేడెక్కనుంది.

 ఓటర్ల జాబితాలో గోల్‌మాల్: కరుణ
 అక్రమ మార్గంలోనైనా అధికారం చేపట్టేలా అన్నాడీఎంకే దిగజారిపోయిందని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి శుక్రవారం వ్యాఖ్యానిం చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఓటర్ల జాబి తాలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపిం చారు. బదిలీపై వెళ్లినవారు, ఇల్లు మారిన వా రు, మరణించిన వారు, కొత్తగా వచ్చిన చేరిన వారి కోసం మూడేళ్లకు ఒకసారి ఓటర్ల జాబితా ను సవరించడం పరిపాటి అని ఆయన అన్నా రు. అయితే అధికార అన్నాడీఎంకే అనేక సార్లు ఓటర్ల జాబితాను తారుమారు చేసిందని ఆరోపించారు.

సేలం జిల్లా లో ప్రధానంగా అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయని చెప్పారు. రాష్ట్రంలో 2009లో 4,16,20,460 మంది ఓట ర్లు ఉన్నారన్నారు. తాజాగా 2014 ఆఖరులో ప్రవేశపెట్టిన జాబితా ప్రకారం 5,37,32,682 మంది ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో 21 శాతం ఓటర్లు పెరిగినట్లు చూపారని అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుని ఇక్కడి జాబి తాను పునఃపరిశీలిస్తే అధికార పార్టీ అక్రమాలు వెలుగు చూస్తాయని కరుణ పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement