
స్టావెంజర్ (నార్వే): ఆల్టిబాక్స్ నార్వే అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. ఈ టోర్నీలో ఆనంద్ వరుసగా ఐదో ‘డ్రా’ నమోదు చేసుకోవడం విశేషం. ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో శనివారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను ఆనంద్ 45 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకున్నాడు.
పది మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య జరుగుతున్న ఈ టోర్నీలో ఐదో రౌండ్ తర్వాత ఆనంద్ ఖాతాలో 2.5 పాయింట్లున్నాయి. ఆదివారం జరిగే ఆరో రౌండ్‌లో మమెదైరోవ్ (అజర్‌బైజాన్)తో ఆనంద్ తలపడతాడు.