నయన్, ఆనంద్ దేవరకొండ, రష్మికా మందన్న, ప్రగతీ శ్రీవాస్తవ
‘‘ఇండస్ట్రీలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం ముఖ్యం. సినిమాల్లోకి వచ్చాక నేను ఈ విషయం తెలుసుకున్నాను. ఆనంద్ నాకు బ్రదర్‌లాంటి వాడు. అతని మీద నేను చాలా ఆధారపడుతుంటాననే విషయం ఆనంద్‌కే తెలియదు. ‘గం..గం..గణేశా’ సక్సెస్ సాధిస్తే ఆనంద్ ముఖంలో నవ్వు ఉంటుంది. ఆ విజయం తాలూకు నవ్వుని నేను చూడాలనుకుంటున్నాను’’ అన్నారు.
హీరోయిన్ రష్మికా మందన్న. ఆనంద్ దేవరకొండ హీరోగా, ప్రగతీ శ్రీవాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం..గం..గణేశా’. ఉదయ్ శెట్టి దర్శకత్వంలో కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 31న విడుదలవుతోంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి రష్మికా మందన్న ముఖ్య అతిథిగా హాజరై, మాట్లాడుతూ– ‘‘గం..గం..గణేశా’ సాంగ్స్‌కు నేను డ్యాన్సులు చేశాను. చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ చాలా బాగుంది.
డైరెక్టర్ ఉదయ్‌కి ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలి. వంశీ, కేదార్, అనురాగ్‌లకు ఈ మూవీ మంచి లాభాలు తీసుకురావాలి’’ అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘క్రైమ్ కామెడీలో ఫ్యామిలీ ఎమోషన్స్ కలిపి వినోదాత్మకంగా తీసిన చిత్రం ‘గం..గం..గణేశా’. నేను ఈ సినిమాలో కనిపించినంత ఎనర్జిటిక్‌గా ఇప్పటివరకూ ఏ సినిమాలోనూ కనిపించలేదు’’ అన్నారు. ‘‘గం..గం..గణేశా’లో ఒక అతిథి పాత్ర ఉంది. ఆ పాత్రను థియేటర్‌లో చూసి షాక్ అయ్యేందుకు రెడీగా ఉండండి’’ అన్నారు ఉదయ్ శెట్టి. దర్శక–నిర్మాత ‘మధుర’ శ్రీధర్ రెడ్డి, నిర్మాత బన్నీ వాసు, సహనిర్మాత అనురాగ్ పర్వతనేని తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment