నకిలీ తల్లిదండ్రులతో వైద్యుల వివాహయత్నం | Love marriage at tirumala with fake documents | Sakshi
Sakshi News home page

నకిలీ తల్లిదండ్రులతో వైద్యుల వివాహయత్నం

Published Fri, May 8 2015 8:03 AM | Last Updated on Sun, Sep 3 2017 1:40 AM

నకిలీ తల్లిదండ్రులతో వైద్యుల వివాహయత్నం

నకిలీ తల్లిదండ్రులతో వైద్యుల వివాహయత్నం

చిత్తూరు: తిరుమల కొండ మీద శుక్రవారం ఉదయం మరికాసేపట్లో జరగాల్సిన పెళ్లి పీటల మీద ఆగిపోయింది. వివరాల్లోకెళ్తే.. కర్ణాటక రాష్ట్రంలోని కోలార్‌కు చెందిన అనిల్(34), కవిత(28) వైద్యులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో ఏడుకొండల స్వామి సాక్షిగా వీరిద్దరు ఏడడుగులు నడవాలనుకున్నారు.

శుక్రవారం మంచి ముహుర్తం ఉండటంతో టీటీడీ పౌరోహిత సంఘంలో వివాహం కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీటీడీ నిబంధనల ప్రకారం తిరుమలలో వివాహం చేసుకోవాలంటే తల్లిదండ్రుల అంగీకార పత్రాలు తప్పనిసరి. కాగా.. వధువు కవిత తరపున పెద్దలు ఈ పెళ్లికి నిరాకరించడంతో నకిలీ పత్రాలు సృష్టించి దొంగ తల్లిదండ్రులతో పెళ్లి తతంగాన్ని ముగించాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ విషయం బయటకు పోక్కడంతో  కవిత తల్లిదండ్రులతో పాటు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. దాంతో పెళ్లి పంచాయతీ పోలీస్ స్టేషన్కు చేరింది. కాగా.. గతంలో కవితకు వేరే వ్యక్తితో వివాహం అయినట్లు తెలుస్తోంది.
.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement