
ముంబై: తమ పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలిసారిగా అభిమానులతో పంచుకున్నారు బాలీవుడ్ నటి అంగీరా ధర్. దర్శకుడు ఆనంద్ తివారితో రెండేళ్లపాటు ప్రణయ బంధంలో మునిగితేలిన ఆమె.. ఈ ఏడాది ఏప్రిల్ 30న ఆయనను వివాహమాడారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ముంబైలో అత్యంత సన్నిహితుల సమక్షంలో పెళ్లి వేడుకు జరుగగా.. తాజాగా ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారామె. ‘‘30-04-2021.. ఆనంద్.. నేను.. కుటుంబ సభ్యులు, స్నేహితులు.. ఆ దేవుడి సమక్షంలో మా స్నేహబంధాన్ని వివాహ బంధంగా మార్చుకున్నాం. జీవితంలో నెమ్మనెమ్మదిగా మార్పులు వస్తున్నాయి. సంతోషకర క్షణాలను మీతో పంచుకుంటున్నా’’ అంటూ క్యాప్షన్ జతచేశారు.
ఈ క్రమంలో నూతన జంటకు బుల్లితెర, వెండితెర సెలబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా టీవీ నటిగా కెరీర్ ఆరంభించిన అంగీరా ధర్.. 2013లో ‘ఏక్ బురా ఆద్మీ’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అనంతరం పలు వెబ్‌సిరీస్‌లలో నటించిన ఆమె.. ఆనంద్ తివారీ తెరకెక్కించిన లవ్ పర్ స్వ్కేర్ ఫీట్ సినిమాతో హీరోయిన్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విక్కీ కౌశల్ కథానాయకుడిగా కనిపించిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అయ్యింది. ఇక మూవీ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ అంగీరా- ఆనంద్ ఇటీవలే పెళ్లితో ఒక్కటై వైవాహిక బంధంలో అడుగుపెట్టారు.
చదవండి: నా ఆటోబయోగ్రఫీ ఇచ్చాను.. ఆయన భయపడ్డారు: సీనియర్ నటి
Comments
Please login to add a commentAdd a comment