సెమీఫైనల్లో ఆకాశ్ | Akash enters semi finals in Estar Minds AP State-ranking tennis tournament | Sakshi
Sakshi News home page

సెమీఫైనల్లో ఆకాశ్

Published Mon, Feb 3 2014 11:45 PM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

Akash enters semi finals in Estar Minds AP State-ranking tennis tournament

జింఖానా, న్యూస్‌లైన్: ఏస్టర్ మైండ్స్ ఏపీ స్టేట్ ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ అండర్-14 బాలుర విభాగంలో ఆకాశ్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. తారిఖ్ స్పోర్ట్స్ అకాడమీ నిర్వహిస్తున్న ఈ టోర్నీలో సోమవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఆకాశ్ 6-2తో హంజా పాషాపై గెలిచాడు. అదే విధంగా మరో మ్యాచ్‌లో సుహిత్ రెడ్డి 6-3తో రాహుల్‌పై నెగ్గగా, శశిప్రీతమ్ 6-5తో సలీల్ దాండ్రియాల్‌పై గెలుపొందాడు. తనిష్క్ 6-3తో రిషిల్ గుప్తాను ఓడించాడు.
 ఇతర ఫలితాలు
     అండర్-10 బాలికల క్వార్టర్స్: సంజన 6-2తో తనుషితపై, చాహన జయ్ 6-3తో అభయపై, అదితి 6-3తో అపూర్వపై, వేద వర్షిత 6-2తో స్టీష బుద్దాలపై నెగ్గారు.
     బాలుర క్వార్టర్స్: యశ్వంత్ 6-3తో అమోఘ్ రెడ్డిపై, వర్షిత్ కుమార్ రెడ్డి 6-0తో యశ్వంత్ చౌదరిపై, రుషికేశ్ 6-5తో అయుష్ పవన్‌పై, ముకుంద్ 6-4తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలిచారు.
     అండర్-12 బాలికల క్వార్టర్స్: శ్రీహ ర్షిత 6-3తో సంజన సిరిమల్లపై, రాయర్ల సంజన 6-1తో అంకితా దేవ్‌పై, ప్రాచి 6-0తో ఖుషి అగర్వాల్‌పై, సంస్కృతి 6-2తో వేదపై గెలుపొందారు.
     బాలుర క్వార్టర్స్: ఆకాశ్ 6-4తో యశ్ అగర్వాల్‌పై, సాయి అనికేత్ 6-2తో సాయి కార్తీక్‌పై, తన్మయ్ 6-2తో ముకుంద్ రెడ్డిపై, శశిధర్ 6-0తో యశ్వంత్‌పై విజయం సాధించారు.
     అండర్-14 బాలికల క్వార్టర్స్: రాయల సృజన 6-0తో ఇషికని, శ్రీజా రెడ్డి 6-0తో నేహశ్రీ రెడ్డిని, సంజన 6-2తో అంజనా రెడ్డిని, శ్రీహ ర్షిత 6-1తో యుక్త బోడిపూరిని ఓడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement