సాక్షి ప్రతినిధి, తిరుపతి : సత్యవేడు మండలం మాదనపాళెంలో హీరో మోటార్స్ వాహనాల తయారీ పరి శ్రమ, ఎస్‌ఆర్‌పురం మండలం కొక్కిరాలకొండలో డీఆర్‌డీవో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థల యాజమాన్యంతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం.. ఆ సంస్థ యాజమాన్యాలు ఎంవోయూపై సంతకాలు చేశాయి. ఆ రెండు పరిశ్రమలు ఏర్పాటైతే నాలుగువేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే..దేశ రక్షణ వ్యవస్థ అమ్ములపొదిలో తిరుగులేని ఆకాశ్, త్రిశూల్, అగ్ని వంటి అస్త్రాలను రూపొందిం చిన డీఆర్‌డీవో(రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ) పరిశ్రమను జిల్లాలో ఏర్పాటుచేయడానికి 2008లో ఆ సంస్థ ప్రతిపాదించింది. డీఆర్డీవో ప్రతిపాదన మేరకు ఎస్‌ఆర్‌పురం మండలం కొక్కిరాలకొండ, చిన్నతయ్యూరు గ్రామాల పరిధిలోని 1102.30 ఎకరాల భూ మిని అప్పటి కలెక్టర్ శేషాద్రి గుర్తించి, ప్రభుత్వానికి నివేదించారు. ఎస్‌ఆర్‌పురం మండలం కొక్కిరాలకొం డలో సర్వే నెంబర్ 285/1లో 502.30 ఎకరాలు, చిన్నతయ్యూర్‌లో సర్వే నెంబర్ 285/2లో ఆరు వందల ఎకరాలు మొత్తం 1102.30 ఎకరాలను డీఆర్‌డీవోకు కేటాయిస్తూ ఆగస్టు 13న రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ ఉత్తర్వులు జారీచేశారు.
ఎకరానికి రూ.1.25 లక్షల చొప్పున డీఆర్‌డీవోకు ఆ భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ ప్రాంతంలో రూ.600 కోట్లతో క్షిపణుల తయారీ పరిశ్రమ, రక్షణ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేయడానికి డీఆర్‌డీవో యాజమాన్యంతో మంగళవారం ప్రభుత్వం ఎంవోయూ కుదుర్చుకుంది. సత్యవేడు మండలం మాదనపాళెంలో మో టారు వాహనాల తయారీ సంస్థను ఏర్పాటుచేయడానికి హీరో మోటార్స్ సంస్థ ముందుకొచ్చిన విషయం విదితమే.
ఆ సంస్థకు 600 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. రూ.1600 కోట్ల వ్యయంతో ఏడాదికి ఎనిమిది మిలియన్ల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రతినిధులతో ప్రభుత్వం మంగళవారం ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ పరిశ్రమ ద్వారా మూడు వేల మందికి ఉపాధి దొరుకుతుందని ప్రభుత్వం పేర్కొంది. ఎస్‌ఆర్‌పురంలో ఏర్పాటుచేసే డీఆర్‌డీవో పరిశ్రమ ద్వారా వెయ్యి మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పదేళ్లపాటు వ్యాట్(విలువ ఆధారిత) పన్ను, సీఎస్‌టీ(సెంట్రల్ సేల్స్ ట్యాక్స్) నుంచి మినహాయింపు, విద్యుత్ చార్జీలు, స్టాంప్ డ్యూటీ, భూమి ధరల్లో రాయితీ ఇస్తేనే మోటారు వాహనాల సంస్థను ఏర్పాటుచేస్తామని హీరో మోటార్స్ మెలిక పెట్టింది. కేంద్రం ప్రకటించే ప్రత్యేక ప్యాకేజీపై ఆశలు పెంచుకున్న ప్రభుత్వం ఆ మేరకు హీరో మెటార్స్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నట్లు పేర్కొనడం గమనార్హం.
హీరో.. డీఆర్‌డీవో మనకే!
Published Wed, Sep 17 2014 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM
Advertisement
Advertisement