చెన్నై: భారత చెస్‌లో మరో గ్రాండ్‌మాస్టర్ (జీఎం) అవతరించాడు. తమిళనాడుకు చెందిన 23 ఏళ్ల జి.ఆకాశ్ భారత్ తరఫున 66వ గ్రాండ్‌మాస్టర్‌గా గుర్తింపు పొందాడు. అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) కౌన్సిల్ సమావేశంలో ఆకాశ్‌కు అధికారికంగా జీఎం హోదా ఖరారు చేశారు. 2012లో జాతీయ జూనియర్ చాంపియన్‌గా నిలిచిన ఆకాశ్ 2014లో ఇంజినీరింగ్ విద్య కోసం చెస్ నుంచి నాలుగేళ్లపాటు విరామం తీసుకున్నాడు. 2018లో ఇంజినీరింగ్ పూర్తయ్యాక చెస్‌లో పునరాగమనం చేశాడు. ప్రస్తుతం 2495 ఎలో రేటింగ్ కలిగిన ఆకాశ్ నాలుగు జీఎం నార్మ్‌లను సంపాదించి గ్రాండ్‌మాస్టర్ హోదాను దక్కించుకున్నాడు. ‘భారత్ నుంచి జీఎం జాబితాలో చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. నా జీవితంలో ఇదెంతో ప్రత్యేకం. మున్ముందు మరింత కష్టపడి నా ఎలో రేటింగ్‌ను 2600కు పెంచుకుంటాను’ అని ఆకాశ్ అన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment