‘సర్కారు నౌకరి’అందరికి నచ్చుతుంది: మూవీ టీమ్‌ | Sarkaaru Noukari Will Be Well Received By Audience, Movie Team Says | Sakshi
Sakshi News home page

‘సర్కారు నౌకరి’అందరికి నచ్చుతుంది: మూవీ టీమ్‌

Published Sun, Dec 31 2023 10:28 AM | Last Updated on Sun, Dec 31 2023 10:28 AM

Sarkaaru Noukari Will Be Well Received By Audience, Movie Team Says - Sakshi

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయమవుతున్న సినిమా "సర్కారు నౌకరి". ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటించింది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మించారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించిన "సర్కారు నౌకరి" సినిమా న్యూఇయర్ సందర్భంగా జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా కోసం హైదరాబాద్‌లో ఓ ప్రత్యేక షో వేశారు మేకర్స్‌. ప్రదర్శన అనంతరం మూవీ టీమ్ మీడియాతో మాట్లాడారు.

దర్శకుడు గంగనమోని శేఖర్ మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" కంటెంట్ ఓరియెంటెడ్ గా సాగే సినిమా. యదార్థ ఘటనల స్ఫూర్తితో 90వ దశకం నేపథ్యంలో ఈ మూవీని రూపొందించాను. సందేశం, వినోదం రెండు కలిసి సినిమా "సర్కారు నౌకరి". అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాం. అప్పటి గ్రామీణ వాతావరణంలో ఆహ్లాదకరంగా కథా కథనాలు ఉంటాయి. రియలిస్టిక్ అప్రోచ్ తో మూవీ ఆకట్టుకుంటుంది. అన్నారు

హీరోయిన్ భావన మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" లాంటి మంచి సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం కావడం హ్యాపీగా  ఉంది. పర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ గా నా క్యారెక్టర్ ఉంటుంది. "సర్కారు నౌకరి" సినిమా ప్రతి ఆడియెన్ కు నచ్చుతుందనే నమ్మకంతో ఉన్నాం. మనసును తాకే ఎమోషన్, ఎంటర్ టైన్ మెంట్ కథలో ఉన్నాయి. ఇలాంటి మంచి మూవీని మీరంతా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అని చెప్పింది.

హీరో ఆకాష్ మాట్లాడుతూ - "సర్కారు నౌకరి" మూవీ మా కెరీర్ కు ఫస్ట్ స్టెప్. కొత్త ఏడాదిలో మొదటి రోజు మీ ముందుకు వస్తోంది. ఈ మొదటి అడుగులోనే ప్రేక్షకులు విజయాన్ని అందించి బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాం. "సర్కారు నౌకరి"లో ప్రభుత్వ ఉద్యోగి పాత్రలో మీకు కనిపిస్తాను. సొసైటీకి మంచి చేయాలనే తాపత్రయం ఒకవైపు, కుటుంబం, స్నేహితుల నుంచి ఎదుర్కొనే సంఘర్షణ మరోవైపు నా క్యారెక్టర్ కు అన్ని ఎమోషన్స్ తీసుకొస్తాయి. "సర్కారు నౌకరి" సినిమాకు మీరు ఇచ్చే రెస్పాన్స్ కోసం వేచి చూస్తున్నాం.అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement