తైక్వాండో చాంప్స్ ఆకాశ్, అక్షిత | akash, akshit wins taekwondo championship | Sakshi
Sakshi News home page

తైక్వాండో చాంప్స్ ఆకాశ్, అక్షిత

Published Thu, Feb 2 2017 10:39 AM | Last Updated on Tue, Sep 5 2017 2:44 AM

akash, akshit  wins taekwondo championship

సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జిల్లా తైక్వాండో చాంపియన్‌షిప్‌లో ఆకాశ్ (యూటీఏ), అక్షిత (యూటీఏ)లు విజయం సాధించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని బ్రిలియంట్ గ్రామర్ స్కూల్‌లో జరిగిన ఈ టోర్నీ క్యాడెట్ బాలుర అండర్- 49 కేజీ విభాగంలో ఆకాశ్ (యూటీఏ) 3-2తో గౌతమ్ సింగ్ (సీటీసీ)పై గెలుపొందగా... బాలికల అండర్- 47 విభాగంలో ఎం. అక్షిత (యూటీఏ) 7-3తో నిధి (ఎస్‌టీసీ)ని ఓడించింది. ఇతర పోటీల్లో అండర్- 44 కేజీ కేటగిరీలో మనీశ్ (యూటీఏ) 5-3తో అనిత (జీటీఏ)పై, కృతి మలిక్ (మ్యాక్స్) 5-4తో తనుశ్రీ (ఐటీసీ)పై గెలుపొందారు. బాలుర విభాగంలో అండర్-33 కేజీ కేటగిరీలో రోహన్ (యూటీఏ) 5-4తో సౌరిశ్ (ఏఎంఆర్‌ఈఆర్)పై, అండర్-41 కేజీ కేటగిరీలో స్వరూప్ కిరణ్ (యూటీఏ) 7-3తో స్వపన్ (మ్యాక్స్)పై విజయం సాధించారు.

 సబ్ జూనియర్ బాలుర ఫలితాలు: అండర్-18 కేజీలు: 1. కర్మన్ సింగ్ (సీటీసీ), 2. కార్తీక్ (ఏఎంఈఈఆర్).
 అండర్-21 కేజీలు: 1. మానవ్ సింగ్ (సీటీసీ), 2. జశ్వంత్ (ఏఎంఈఈఆర్). అండర్- 23 కేజీ: 1. శివ్ కిరణ్ (సీటీసీ), 2. సంజయ్ నారాయణ (ఐటీసీ). అండర్-32 కేజీలు: 1. శివాన్‌‌ష అగర్వాల్ (మ్యాక్స్), 2. ఆకాశ్


 అండర్-35 కేజీలు: 1. జి. రవిచంద్ర (ఐటీసీ), 2. నంద (ఏఎంఈఈఆర్).

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement