హైదరాబాద్: 'ఆంధ్రాపోరి' సినిమా టైటిల్ మార్చాలన్న పిటిషన్ని గురువారం హైకోర్టు తిరస్కరించింది. దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన 'ఆంధ్రాపోరి' సినిమా టైటిల్ పై ఆంధ్రా సెటిలర్స్ ఫోరం హైకోర్టుకెక్కింది. 'ఆంధ్రాపోరి' సినిమా పేరు తమ ప్రాంతం వారి మనోభావాలను కించపరిచేలా ఉందని పిటిషన్ లో పేర్కొంది. మహిళలను అభ్యంతకరంగా చూపించే విధంగా సినిమా టైటిల్ ఉందని తెలిపింది. తెలంగాణ ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ అయిన ఈ సినిమా టైటిల్ మార్చాలని కోరిన విషయం తెలిసిందే.
ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.రమేశ్‌ప్రసాద్ నిర్మిస్తున్న 'ఆంధ్రాపోరి'లో ఆకాశ్ పూరి సరసన ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటించింది. రాజ్ మాదిరాజు దర్శకుడు. జోశ్యభట్ల సంగీతం అందించారు.
'ఆంధ్రాపోరి' టైటిల్కు తొలగిన చిక్కులు
Published Thu, Jun 4 2015 3:25 PM | Last Updated on Sun, Sep 3 2017 3:13 AM
Advertisement
Advertisement