
లఘు చిత్రాలకు ఇదొక అందమైన వేదిక : బ్రహ్మానందం
‘‘సంప్రదాయ చిత్రాలకు దీటుగా లఘు చిత్రాలు చరిత్ర సృష్టిస్తున్నాయి. అలాంటి చిట్టి చిత్రాలకు వెన్నుదన్నుగా నిలవాలనే సంకల్పంతో ప్రారంభించిన ఈ వెబ్‌సైట్ సృజనకు అందమైన వేదికగా నిలవాలి’’ అని ప్రసిద్ధ హాస్యనటుడు బ్రహ్మానందం ఆకాంక్షించారు. డి. రాజ్‌వికాస్, ఎసీఎస్ శ్రీరామ్, ఎస్. ఆకాశ్ ఏర్పాటు చేసిన noreels.comను హైదరాబాద్‌లో బ్రహ్మానందం ఆవిష్కరించారు. లఘుచిత్రాలు తీసే దర్శక నిర్మాతలకు చేయూతనందించడంతో పాటు, భవిష్యత్తులో మౌలిక సదుపాయాల ఏర్పాటు కూడా చేస్తామని ప్రమోటర్లు తెలిపారు.