పాతబస్తీలో కిడ్నాపైన రెండేళ్ళ ఆకాష్ క్షేమం | Police trace kidnapped Akash, arrest kidnaper in West bengal | Sakshi
Sakshi News home page

పాతబస్తీలో కిడ్నాపైన రెండేళ్ళ ఆకాష్ క్షేమం

Published Sat, Nov 9 2013 10:02 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

Police trace kidnapped Akash, arrest kidnaper in West bengal

హైదరాబాద్ : ఎట్టకేలకు హైదరాబాద్ పాతబస్తీలో వారం క్రితం కిడ్నాపైన రెండేళ్ళ బాలుడు ఆకాష్ ఆచూకీ లభ్యమైంది. పశ్చిమ బెంగాల్లో కిడ్నాపర్ బారి నుంచి బాలుడిని  క్షేమంగా పోలీసులు కాపాడారు. కిడ్నాపర్ రాంప్రసాద్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  ఆకాష్‌ తండ్రి గోపాల్‌ వద్ద కిడ్నాపర్ రాంప్రసాద్ పని చేసేవాడు. బాలుడిని క్షేమంగా వదిలి పెట్టాలంటే మూడు కేజీల బంగారం కావాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

ఆకాశ్ తండ్రి గోపాల్ ఫిర్యాదు మేరకు చార్మినార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  బాలుడి ఆచూకీ కనుగొనేందుకు ఓ ప్రత్యేక బృందం కోల్కతా వెళ్లింది.  ఫోన్ కాల్ ఆధారంగా కిడ్నాపర్ను పట్టుకున్నారు. ఆకాష్ క్షేమ సమాచారాలు తెలుసుకున్న తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement