కర్ణాటక: భర్త, అతని కుటుంబసభ్యులు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఓ మహిళ బెంగళూరు కొడిగేహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్త ఆషామాషా వ్యక్తి కాదు, ఓ ఐఏఎస్ అధికారి. అప్పట్లో సివిల్స్‌లో దేశంలో వంద లోపు ర్యాంకు తెచ్చుకుని మీడియాలో ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ ఏం లాభం.. భార్యను వేధించి అపఖ్యాతిని మూటగట్టుకున్నాడు. కొడగు జడ్పీ సీఈఓగా పనిచేస్తున్న ఆకాశ్ శంకర్‌పై ఆయన భార్య డాక్టర్ వందన ఈ ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.
ఘనంగా పెళ్లి చేసినా..
రిటైర్డు ఐపీఎస్ టీఆర్ సురేశ్ కుమార్తె డాక్టర్ వందనకు గత ఏడాది జూన్‌లో ఆకాశ్ శంకర్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. ఆ సమయంలో బాగా కట్న కానుకలు సమర్పించారు. కానీ మళ్లీ డబ్బు బంగారం , విలువైన కానుకలు తేవాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నట్లు వందన గత మార్చిలో ఆరోపించారు. అప్పటినుంచి దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు.
హేళనగా ప్రచారం
ఇటీవల ఆకాశ్ శంకర్ సోదరుడు వికాస్ శంకర్, ఆతని భార్య చేతన, ఐసిరి శివకుమార్ అనేవారు వందన గురించి హేళనగా మాట్లాడి ఆ వీడియోలను ఆమె స్నేహితులకు పంపారు. ట్రాఫికింగ్ ఆఫ్ ఖాకీస్ డాటర్, ట్రాఫికర్ డాక్టర్ వందన అని తప్పుడు ప్రచారం చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేసింది. వందన కుంటుబం గురించి ఇంటర్నెట్లో అగౌరవంగా రాతలు రాసినట్లు ఆమె వాపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment