
కల్లుగీత విధానం రూపొందించాలి
రాష్ట్రంలో కల్లుగీత విధానాన్ని రూపొందిం చాలని ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్‌కు గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ విన్నవించింది.
ప్రతి సభ్యుడికి 30 చెట్లు ఉండాలనే నిబంధనలు తొలగించాలని డిమాండ్ చేశారు. మరణించిన, శాశ్వత అంగవైకల్యం పొందిన గీత కార్మికుల భాగస్వాములకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలన్నారు. గౌడ భవన నిర్మాణానికి 10 ఎకరాలు కేటాయించి, రూ.10 కోట్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వృత్తిదారుల ఫెడరేషన్ ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్లు కేటాయించాలని కోరారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారిక కార్యక్రమంగా నిర్వహించాలని, అదే విధంగా పాపన్న విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయడంతో పాటు హైస్కూల్ స్థాయిలో పాఠ్యాంశంగా చేర్చాలని పేర్కొన్నారు.