కోర్టు వివాదాల వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు తెలిపారు.
కోర్టు వివాదాల వల్లే జీహెచ్ఎంసీ ఎన్నికలు ఆలస్యం అవుతున్నాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పద్మారావు తెలిపారు. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని ఆయన చెప్పారు.
ఈనెల 24వ తేదీన హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు జరుగుతాయని పద్మారావు వెల్లడించారు. ఇందులో ప్రభుత్వానికి, పార్టీకి సంబంధించిన కీలక అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగిస్తారని కూడా ఆయన తెలిపారు.