ఆబ్కారీ మంత్రి పద్మారావు
సాక్షి, హైదరాబాద్: కల్లు దుకాణాల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు స్పష్టంచేశారు. సోమవారం ఆయన సచివాలయంలోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ విధానాన్ని కొనసాగించాలా లేదా అన్న విషయంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ నెలాఖరు వరకు పాత పాలసీ అమలులో ఉంటుందని.. తర్వాత ఎటువంటి పాలసీ అనుసరించాలనేది పరిశీలిస్తామన్నారు.