'కుమారుడి నిర్వాకంతో సిగ్గుతో తలదించుకున్నా'
బీజీంగ్: తన కుమారుడు జాయ్ సీ చేసిన నిర్వాకం వల్ల సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని హాలీవుడ్ నటుడు, చైనా కుంగుఫూ స్టార్ జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ నివాసంలో ఆయన కుమారుడు డ్రగ్స్ తో ఆగస్టు 14 తేదిన పోలీసులకు చిక్కిన సంగతి తెలిసిందే. చైనాలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా జాకీ చాన్ గతంలో ప్రచారం నిర్వహించారు.
మొదటిసారి ఈ వార్త వినగానే చెప్పలేనంత కోపం వచ్చింది. ఎంతో ప్రజాదరణ కలిగిఉన్న నేను సిగ్గుతో తలవంచుకున్నాను. విషాదంలో మునిగిపోయాను అంటూ ఓ వెబ్ సైట్ కు తెలిపారు. జాయ్ సీ తల్లి దుఖంలో మునిగిపోయారని జాకీ చాన్ అన్నారు. జాకీ చాన్ చేసిన తప్పు తెలుసుకుని యువతరం మంచి మార్గంలో నడుస్తుందని ఆశిస్తున్నానని జాకీ చాన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.