
ఇస్లామాబాద్: దేశద్రోహం కేసులో ఉరిశిక్ష పడ్డ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌కు మద్దతివ్వాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చర్చించేందుకు బుధవారం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ కోర్ కమిటీతో అత్యవసర సమావేశం అయ్యారు. ఆశ్చర్యమేంటంటే ఇమ్రాన్ ఖాన్ ప్రతిపక్షంలో ఉండగా ముషారఫ్ రాజద్రోహం కేసుకు ఇమ్రాన్ ఖాన్ మద్దతు తెలపగా, ఇప్పుడు వ్యతిరేకిస్తున్నారు. కాగా, ముషారఫ్‌కు మద్దతుగా ఆర్మీ కూడా నిలుస్తోంది. మాజీ సైనికాధ్యక్షుడైన ముషారఫ్.. ఎప్పటికీ ద్రోహి కాదని, కోర్టు తీర్పును ఖండిస్తున్నట్లు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment