8 మంది ‘నిషా’చరుల లైసెన్స్ రద్దు
వీరికి కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేసి హాజరుపరిచారు. మొత్తం 71 మందికి జైలు శిక్షలు విధిం చిన కోర్టులు.. 8 మంది డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశాయి. వాహనచోదకుల్లో ఎవరైనా సస్పెండ్ అయిన డ్రైవింగ్ లైసెన్స్‌ను వినియోగించి వాహనం నడుపుతుంటే ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసే పోలీసులు పీడీఏ మిషన్ల/ట్యాబ్స్ ద్వారా తేలిగ్గా గుర్తిస్తారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటూ కోర్టులో హాజరుపరుస్తారు. ఇలాంటి ఉల్లం«ఘనకు పాల్పడిన వారికి గరిష్టంగా మూడు నెలల వరకు జైలు శిక్షపడే ఆస్కారం ఉందని అధికారులు చెబుతున్నారు. కాగా పట్టుబడిన మొత్తం ‘నిషా’చరులకు కోర్టులు రూ.12.20 లక్షల జరిమానా విధించింది.