
సంగారెడ్డి క్రైం: ఎవరైనా జైలు జీవితం అనుభవించాలని కలలో కూడా ఊహించరు. కానీ ఇద్దరు విదేశీయులు మాత్రం జైలు శిక్ష అనుభవించి చూడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారట! అయితే వారి కోరికను సంగారెడ్డి జైలు అధికారులు తీర్చారు. ఇటీవల సంగారెడ్డి జైలు అధికారులు ‘ఫీల్ ద జైల్’అనే కార్యక్రమాన్ని చేపట్టారు. మలేషియాకు చెందిన దంత వైద్యుడు క్వెన్, రెస్టారెంట్ వ్యాపారి కెల్విన్ ఆన్‌లైన్‌లో వీటి గురించి వివరాలు తెలుసుకున్నారు.
ఏకంగా వారు మలేషియా నుంచి ఇక్కడికి వచ్చారు.జైలు సూపరింటెండెంట్ సంతోష్‌రాయ్‌ను సంప్రదించి తమ మనసులోని మాటను చెప్పారు. నిబంధనల ప్రకారం జైలు మ్యూజియంలో రూ.500 చెల్లించి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. ఖైదీల్లా కారాగారంలో అడుగు పెట్టారు. ఆన్‌లైన్‌లో ‘ఫీల్ ద జైల్’గురించి వివరాలు తెలుసుకొని జైలు జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామని క్వెన్, కెల్విన్ తెలిపారు. శిక్ష కాలంలో ఖైదీలకు అందించే ఆహారాన్నే తమకూ వడ్డించాలని వారు అధికారులను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment