తహసీల్దార్‌కు జైలు శిక్ష | tahsildar sent to 2-year jail for bribery case | Sakshi
Sakshi News home page

తహసీల్దార్‌కు జైలు శిక్ష

Published Sat, Dec 16 2017 4:48 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM

tahsildar sent to 2-year jail for bribery case - Sakshi

సాక్షి, భువనేశ్వర్‌: లంచగొండి మహిళా తహసీల్దారు విజయిని విశ్వాల్‌కు న్యాయ స్థానం కారాగార శిక్ష విధించింది. ఆమె ప్రస్తుతం కేంద్రాపడా జిల్లా డిప్యుటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. లోయిసింగి తహసీల్దార్‌గా పని చేసిన రోజుల్లో రూ. 4 వేలు లంచం తీసుకుంటుండగా ఆమె విజిలెన్స్‌ వలకు చిక్కారు. 2013వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రత్యేక విజిలెన్స్‌ కోర్టు విజయిని విశ్వాల్‌కు 2 ఏళ్ల కారాగార శిక్షతో పాటు రూ. 2వేల జరిమాన విధించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement