పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు షాక్ ఇచ్చింది. మూడు వేర్వేరు కేసుల్లో ఆయనకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. వివరాల్లోకి వెళ్తే.. 2011లో అప్పటి మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై చింతమనేని ప్రభాకర్ చేయి చేసుకున్నారు. అంతే కాకుండా వట్టి వసంత్ కుమార్ గన్‌మెన్‌పై చేయిచేసుకున్న కేసులో దోషిగా నిర్ణయిస్తూ భీమడోలు మెజిస్ట్రేట్ కోర్టు తీర్పు వెలువరించింది.