mla chintamaneni prabhakar
-
ఎమ్మెల్యే చింతమనేనికి మూడేళ్ల జైలుశిక్ష
-
చింతమనేని మరోసారి తిట్ల దండకం
-
అమరావతి భూములు.. చింతమనేని గేదెలు
సాక్షి, అమరావతి : ప్రపంచ స్థాయి రాజధాని నగర నిర్మాణం అన్నారు.. రైతులకు మాయమాటలు చెప్పి పంట భూములను లాక్కున్నారు. పచ్చని పైర్లతో కళకళలాడే భూములు.. ఏడాదికి మూడు పంటలను ఇచ్చిన భూములు... ఇప్పుడు పశువులను మేపుకునే పచ్చి గడ్డి మైదానాలుగా మారిపోయాయి. వెరసి ఇంతకాలం అన్నం పెట్టిన తమ భూములకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందా అని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి చుట్టు పక్కల వేల ఎకరాల పంట భూముల ప్రస్తుత పరిస్థితి ఇది. ఇంతకీ ఇక్కడ ఠీవీగా మేస్తూ కనిపిస్తున్న గేదెలు ఎవరివో కాదు.. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు చెందినవి. అమరావతికి వెళ్లే క్రమంలో ఆయన పనిలో పనిగా ఏలూరులో తన పశువుల కొట్టంలోని 118 గేదెలను వెంటపెట్టేసుకొచ్చేశారు. రెండు నెలలుగా ఇక్కడ ఈ తంతు కొనసాగుతోంది. ఇందుకోసం ప్రత్యేకంగా పనివాళ్లను.. దొడ్డిని నిర్మించటం విశేషం. చింతమనేని ఆదేశాల మేరకే తాము దగ్గరుండి వాటిని చూసుకుంటామని పనివాళ్లు చెప్పటం గమనించదగ్గ అంశం. చంద్రబాబు ఆధునిక నగర నిర్మాణ గొప్పల సంగతి తెలియదు కానీ... ప్రస్తుతం పశుగ్రాసానికి మాత్రం అమరావతి భూములు కేరాఫ్ అడ్రస్‌గా మాత్రం మారాయి. అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే పనిలో పనిగా, రైతుల భూముల్లో నెమరు వేస్తున్న తన పశువులను చూసుకుని తెగ సంబరపడుతున్నారు. ఇది కూడా చంద్రబాబు ఘనతేనా? సాక్షి, విజయవాడ : రాజధాని నిర్మాణం కోసం సేకరించిన భూముల్లో ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితులను కూడా చంద్రబాబు ఘనతే అని టీడీపీ నేతలు చెప్పుకోవటం విడ్డూరంగా ఉందని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుధాకర్ బాబు అంటున్నారు. సింగపూర్ ను తలదన్నెలా రాజధాని నిర్మాణమని ఘనంగా ప్రకటించుకుని.. ఇప్పుడు ఆ భూములను గడ్డి మైదానాలుగా మార్చేసిన ఘనత మాత్రం నిజంగా చంద్రబాబుదేనని ఆయన ఎద్దేవా చేశారు. అమరావతిలో గడ్డి పుష్కలంగా దొరుకుతుందని స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని చెబుతున్నారని.. చివరకు త్యాగం చేసి రైతులు ఇచ్చిన భూములు పశువుల మేతకు నిలయంగా మారే దుస్థితి పట్టిందని సుధాకర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. -
దోపిడీకి కొత్త ఎత్తుగడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు : చెరువు ఏర్పాటవుతుందో లేదో తెలియదు. ఆ చెరువులోకి నీరు వస్తుందో, రాదో స్పష్టత లేదు. ఇందుకు సంబంధించి అనుమతులు లేవు. కనీసం రాతపూర్వక ప్రతిపాదనలు కూడా లేవు. కానీ 40 ఎకరాల్లో చెరువును తవ్వించి అందులో నీటిని నింపి భవిష్యత్తులో పొలాలకు నీరు అందిస్తామంటున్న ఓ ప్రజాప్రతినిధి మాటలకు అక్కడి అధికారులు తందాన తాన అన్నారు. ఇంకేముంది పేద రైతులకు చెందిన భూములను నామమాత్రపు ధరకు తీసేసుకుని, చెరువు తవ్వకం పేరిట గ్రావెల్, మట్టిని పెద్ద ఎత్తున అమ్మేసుకుంటున్నారు. పది కోట్ల రూపాయలకు పైగా కొల్లగొట్టే పథకాన్ని అమలుపరుస్తున్న అ«ధికార పార్టీ నేతలను ఇదేంటని మాటమాత్రంగానైనా ప్రశ్నించే సాహసం చేయలేకపోతున్నారు సంబంధిత అధికారులు. వివరాల్లోకి వెళితే... దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం సూర్యారావుపేట గ్రామం పక్క నుంచి చింతలపూడి ఎత్తిపోతల పథకం కాల్వ వెళ్తోంది. అక్కడికి దగ్గరలో చుట్టుపక్కల నాలుగు గ్రామాలకు మధ్యలో ఓ కంకరగుట్ట ఉంది. గుట్టను తవ్వి చెరువుగా తయారుచేసి నీరు నిలబెడితే చుట్టుపక్కల భూగర్భజలాలు పెరుగుతాయని, అవసర సమయాల్లో చెరువు నీటిని సాగు కోసం వినియోగించుకోవచ్చని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రతిపాదించారు. తొలుత ఆ ప్రాంత వాసులు ఒప్పుకోకపోయినా ఎమ్మెల్యే జిల్లా కలెక్టరు కాటంనేని భాస్కర్‌ను, జలవనరుల శాఖ అధికారులను వెంట పెట్టుకుని వెళ్లారు. పోలవరం కుడి కాలువ నుంచి గాని, చింతలపూడి కాల్వ నుంచి ఎత్తిపోతల ద్వారా పైపులు వేసి చెరువును నింపుతామని నమ్మబలికారు. ఏదైనా చెరువుకు నీరు తరలించాలంటే ఆ చెరువు విస్తీర్ణం కనీసం వంద ఎకరాలైనా ఉండాలి. అలా ఉంటేనే కాల్వ నుంచి అధికారికంగా లిఫ్ట్ ద్వారా నీటిని తరలించడానికి వీలవుతుందని కలెక్టర్ తేల్చి చెప్పారు. ఆ తర్వాత సమావేశం నిర్వహించి చెరువు తవ్వడానికి గ్రామస్తులను చింతమనేని ఒప్పించారు. ప్రతిపాదనలు లేకున్నా... కంకరగుట్టతో పాటు అక్కడి భూములు తీసుకుంటేనే వంద ఎకరాలకు పైగా చెరువు రూపుదిద్దుకుంటుంది. ఇందుకు ఎలాంటి ప్రతిపాదనలు లేవు. కానీ చెరువు పేరిట సుమారు నలభై ఎకరాలను రైతుల నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించారు. గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్థానికులైన పేదలకు డీ–ఫారం పట్టాలుగా ఇచ్చిన వాటిని చెరువు తవ్వకానికి ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యే గట్టిగా చెప్పడంతో రైతులు సమ్మతించక తప్పలేదు. ఎకరానికి రూ.ఆరు లక్షల చొప్పున ధర నిర్ణయించి తన అనుచరుడైన కిషోర్ ద్వారా ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున అడ్వాన్స్‌గా చింతమనేని చెల్లింపజేశారు. తక్కిన మొత్తాన్ని తర్వాత ఇప్పిస్తానని నమ్మబలికారు. రైతుల నుంచి తీసుకున్న భూముల్లో చెరువు తవ్వకం పనులు రెండు వారాలుగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఐదు ఎకరాల విస్తీర్ణంలో గ్రావెల్, మట్టి తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. రూ.10 కోట్లకు పైగా టార్గెట్... ఒక్కో టిప్పర్‌కు దూరాన్ని బట్టి రూ.2,500, ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నారు. రోజుకు వంద నుంచి 120 వరకూ టిప్పర్లు, ట్రాక్టర్లతో మట్టి తోలుతున్నారు. ఈ వ్యవహారాన్ని చింతమనేని అనుచరుడు కిషోర్ చేతుల మీదుగా నిర్వహిస్తున్నారు. పనులు మొదలైన తరువాత ఎమ్మెల్యే ఆ ప్రాంతం వైపు కూడా కన్నెత్తి చూడలేదు. రైతుల నుంచి తీసుకున్న 40 ఎకరాలలోని గ్రావెల్, మట్టి అమ్మకాల ద్వారానే పది కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుందని స్థానికులు అంచనాగా చెబుతున్నారు. తమ భూమికి నామమాత్రపు ధర చెల్లిస్తున్నారని పేద రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అనుమతులు ఇవ్వలేదు : ఈ చెరువు తవ్వకానికి ఎటువంటి అనుమతులు లేవు. కనీసం ప్రతిపాదనలు కూడా లేవు. పెదవేగి తహíసీల్దార్‌తో ‘సాక్షి’ మాట్లాడగా అక్కడ ఎత్తిపోతల నుంచి లిఫ్ట్ ద్వారా చెరువుకు నీరు నింపే పనులు జరుగుతున్నాయని, ఇరిగేషన్ వారిని అడిగితే సమాచారం తెలుస్తుందని దాటవేశారు. ఎవరో పొలంలో చెరువు తవ్వుకుంటే తామేం చేయగలమని ఇరిగేషన్ అధికారులు ప్రశ్నించారు. తమ శాఖ నుంచి ఎటువంటి అనుమతులు లేవని, పైపులైన్ ద్వారా చెరువు నింపడానికి కూడా ప్రతిపాదనలు లేవన్నారు. ఈ భూమిని ఇరిగేషన్ శాఖ తీసుకుని చెరువు తవ్వే ప్రతిపాదనలు కూడా రాలేదని, భవిష్యత్‌లో కూడా చేయడానికి నిబంధనలు అంగీకరించబోవని వివరించారు. అయితే చెరువు తవ్వకానికి తమను సంప్రదించిన మాట వాస్తవమే అయినప్పటికీ ఎటువంటి ప్రతిపాదనలు సిద్ధం కాలేదన్నారు. ఈ ప్రశ్నలకు బదులేది? చెరువుకు పోలవరం, చింతలపూడి ఎత్తిపోతల ప్రధాన కాల్వల నుంచి నీటిని తరలించాలంటే వంద ఎకరాల విస్తీర్ణం ఉండాలని కలెక్టరే స్వయంగా చెప్పారు. అసలు చెరువే లేకుండా, కంకర గుట్టను, చుట్టుపక్కల పొలాలను తవ్వి చెరువుగా రూపుదిద్దడమంటే పెద్ద ప్రహసనమే. ప్రతిపాదనలే లేకుండా చెరువు తవ్వుతామని చెప్పడమంటేనే గ్రావెల్, మట్టి కొల్లగొట్టడానికే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. రైతులకు పూర్తిగా డబ్బు చెల్లించకుండా తవ్వకం పనులు చేపట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తులో డబ్బులు చెల్లించడానికి ఎవరు బాధ్యత తీసుకుంటారని వాపోతున్నారు. -
చింతమనేని దాష్టీకం
ఏలూరు రూరల్ : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి తన దాష్టీకాన్ని ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లోకి చొరబడి విద్యుత్ వైర్లు కట్ చేయించారు. ఇదేమని ప్రశ్నించిన మహిళలను ఆయన అనుచరులు నోటికొచ్చినట్టు దూషించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఏలూరు మండలం దెందులూరు నియోజకవర్గంలోని మల్కాపురంలో చింతమనేని ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ వీధుల్లో తన అనుచరులతో తిరుగుతూ ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అ«ధ్యక్షుడు తూతా నిరంజన్ ఇంటికి చేరుకున్నారు. నిరంజన్ ఇంటి వెనుక భాగంలో ప్రహరీగోడకు పశువులను కట్టేందుకు ఏర్పాటు చేసుకున్న ఇనుప కొంకాలను పీకించారు. వెనువెంటనే ప్రభాకర్ వెనక భాగం గేటు తెరుచుకుని లోపలికి ప్రవేశించారు. ఇదే సమయంలో ఆయన అనుచరులు ముగ్గురు మూసి ఉన్న ప్రధానద్వారం తలుపులు కొట్టి కేకలు పెడుతూ ఇంటిలో ఉన్న నిరంజన్ భార్యను పిలిచారు. ఆమె తలుపు తీయగానే తీవ్రస్థాయిలో దుర్భాషలాడుతూ ఇల్లంతా తిరిగారు. ఆఖరికి వెనకభాగంలో ఉన్న పంచాయతీ కుళాయిని ప్రభాకర్ గుర్తించారు. తక్షణం కుళాయికి ఏర్పాటు చేసిన మోటార్ విద్యుత్ వైర్లను కట్ చేయమంటూ విద్యుత్ శాఖ సిబ్బందిని ఆదేశించారు. దీంతో వారు వైర్లు కట్ చేశారు. రోడ్డు పక్క పశువులు కట్టి, కుళాయికి మోటార్ బిగిస్తే చర్యలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులను ఆదేశిస్తూ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇదంతా చూసిన స్థానికులు ఖిన్నులయ్యారు. గ్రామంలో 90 శాతం కుళాయిలకు మోటార్లు బిగించి ఉన్నాయని, వాటినన్నీ వదిలేసి వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిలోని మోటార్ వైర్లు తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. వీధి చివర్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫ్లెక్సీ ఏర్పాటు చేయడం వల్లే చింతమనేని కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారని పలువురు తెలిపారు. కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదు అధికార బలంతో వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ దెందులూరు నియోజకవర్గం కన్వీనర్ కొఠారు రామచంద్రరావు చింతమనేని ప్రభాకర్‌ను హెచ్చరించారు. సోమవారం మల్కాపురంలో నిరంజన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. -
ఎమ్మెల్యే చింతమనేని చిందులు
లింగారావుగూడెం (ఏలూరు రూరల్) : దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి చిందులు తొక్కారు. కాలనీలో డ్రెయినేజీ, రోడ్డు లేక అవస్థలు పడుతున్నామని అడిగిన పాపానికి వారికి చెందిన బడ్డీకొట్టును వెంటనే పంచాయతీకి తరలించాలని అధికారులను ఆదేశించారు. తననే ప్రశ్నిస్తారా.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలూరు మండలం మాదేపల్లి శివారు గ్రామమైన లింగారావుగూడెంలో చింతమనేని ప్రభాకర్ మంగళవారం ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం చేపట్టారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కాలనీలో పర్యటించారు. గూడెంలోని టీడీపీ మాజీ నాయకుడు, మాజీ సర్పంచ్ కొరపాటి తిరుపతిస్వామి ఇంటి వరకూ చేరుకున్నారు. ఆ సమయంలో తిరుపతిస్వామి భార్య మారతమ్మ, ఆమె కుమారుడు కాలనీలో డ్రైయినేజీ వ్యవస్థ సరిగా లేదని, రోడ్డు నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. ఎంతో కాలంగా వేడుకుంటున్నా పట్టించుకోలేదన్నారు. దీంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో వారి ఇంటి గోడపై వైఎస్సార్ కుటుంబం స్టిక్కర్ అంటించి ఉండడంతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వచ్చి మీ కాలనీ అభివృద్ధి చేస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదే అక్కసుతో తిరుపతిస్వామి ఇంటి ముందు ఉన్న బడ్డీకొట్టును చూశారు. రోడ్డు, డ్రెయినేజీకి అడ్డుగా ఉందంటూ వెంటనే బడ్డీకొట్టును తొలగించాలని అధికారులను ఆదేశిం చారు. దీంతో గ్రామకార్యదర్శి అనిల్‌తో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ తమ సిబ్బందితో బడ్డికొట్టును గునపాలతో పెకలించి ఆఘమేఘాల మీద తొలిగించారు. ట్రాక్టర్‌పై ఎక్కించి హుటాహుటిన పంచాయతీ కార్యాలయానికి తరలించారు. 30 ఏళ్లుగా టీడీపీకి సేవలు మాజీ సర్పంచ్ తిరుపతిస్వామి ముప్పై ఏళ్లుగా టీడీపీలో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ సభ్యుడుగా కూడా సేవలందించారు. 2001 నుంచి 2006 వరకూ సర్పంచ్‌గా పనిచేసి టీడీపీ బలోపేతానికి కృషి చేశారు. చింతమనేని వ్యవహారశైలి నచ్చక కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల వైఎస్సార్ కుటుంబం కార్యక్రమంలో పాల్గొని పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న చింతమనేని ఆయనపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారని స్థానిక నాయకులు తెలిపారు. టీడీపీకి ఎంతో సేవ చేశారని స్థానిక నేతలు చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఆయనకు చెందిన బడ్డీకొట్టును తీయించారు. -
అలక పాన్పుపైనే..
♦ ఇద్దరు గన్మెన్లను వెనక్కి పంపిన చింతమనేని ♦ ప్రభుత్వ ఆదేశాల అనంతరమే నిర్ణయమన్న ఎస్పీ సాక్షి ప్రతినిధి, ఏలూరు : మంత్రి పదవి ఇవ్వలేదని అలకపాన్పు ఎక్కిన ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇంకా దిగిరాలేదు. తనకు ఇద్దరు గన్మెన్లు చాలంటూ.. ఇద్దర్ని వెనక్కి పంపడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం చింతమనేనికి 2+2 పద్ధతిలో నలుగురు గన్మెన్లు భద్రతగా ఉన్నారు. వీరిలో ఇద్దరు విధుల్లో ఉంటే.. ఇద్దరు విశ్రాంతిలో ఉంటారు. తనకు ఇద్దరు గన్మెన్లు చాలని, మిగిలిన ఇద్దరిని వెనక్కి పంపించారు. ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేనందున ఆ ఇద్దరిని కూడా విధులు నిర్వహించాలంటూ జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ తిరిగి చింతమనేని వద్దకు తిప్పి పంపారు. ప్రభుత్వం నుంచి అదేశాల కోసం ఎదురుచూస్తున్నామని, ఆదేశాలు వచ్చిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. మంత్రి పదవి రాకపోవడంతో తొలుత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన చింతమనేని నేరుగా అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ పంపించిన విషయం విదితమే. ఆ తర్వాత ముఖ్యమంత్రిని కలిసిన ఆయన పార్టీకి కట్టుబడి ఉంటానని, నిబద్ధతతో పనిచేస్తానంటూ పత్రికలకు ప్రకటన విడుదల చేశారు. ఇది జరిగిన 24 గంటలకే తనకు కల్పించిన భద్రతను సగానికి తగ్గించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతా సద్దుమణిగిందనుకుంటున్న తరుణంలో ఆయన మరో పరిణామానికి తెరతీయడంతో వ్యవహారం మొదటికొచ్చినట్టయ్యింది. అసలు చింతమనేని ఏం చేయాలనుకుంటున్నారు, తన రాజకీయ భవిష్యత్తుపై ఆయన ఏవిధంగా ముందుకు వెళతారనే అంశాలపై చిక్కుముడి వీడటం లేదు. ఇద్దరు గన్మెన్లను ఉపసంహరించుకోవడంపై చింతమనేని ప్రభాకర్ స్పందిస్తూ తనకు ప్రజలే రక్షణగా ఉంటారని, గన్మెన్లు అవసరం లేదని నిశ్చయించుకున్నట్టు వ్యాఖ్యానించారు. -
చింతమనేనిపై మంత్రి సుజాత ఫైర్
► చింతమనేని తేల్చుకుందాం.. రా : మంత్రి పీతల ► నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏమిటంటూ నిలదీత ► వాడీవేడిగా టీడీపీ జిల్లా సమన్వయకమిటీ సమావేశం సాక్షి ప్రతినిధి, ఏలూరు : ‘నాకు తెలియకుండా నా నియోజకవర్గంలోకి వస్తావా.. రా తేల్చుకుందాం. అయినా నా నియోజకవర్గంలో నీ జోక్యం ఏంటి’ అంటూ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌పై ఫైర్ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఏలూరులో నిర్వహించిన తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇటీవల చింతలపూడి నియోజకవర్గంలో ఒక సినిమా థియేటర్ ప్రారంభానికి స్థానిక ఎమ్మెల్యే అయిన పీతల సుజాతను పిలవకుండా, విప్ చింతమనేని ప్రభాకర్‌ను పిలిచారు. దీనికి చింతమనేని హాజరయ్యారు. ఈ విషయం టీడీపీ సమావేశంలో చర్చకు వచ్చింది. తనను ఆహ్వానించటంతో వెళ్లానని, దీనికి మంత్రి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఏంటని చింతమనేని ప్రశ్నించినట్టు తెలిసింది. తనకు ఆహ్వానం లేనిచోట మరొకరు వచ్చి పాల్గొనడం ఎంతవరకూ సమంజసమని పీతల సుజాత ప్రశ్నించగా.. చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదని, తనను పిలిస్తే ఎక్కడికైనా వెళ్తానని చింతమనేని సమాధానం చెప్పినట్టు భోగట్టా. దీంతో మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ‘రా తేల్చుకుందాం. ఎస్సీ నియోజకవర్గం అని మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు’ అని సీరియస్‌గా చెప్పడంతో వాతావరణం వేడెక్కింది. ఇన్చార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యేకు కనీస సమాచారం లేకుండా వేరే నియోజకవర్గ కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదని హితవు పలికినట్టు తెలిసింది. మంత్రి సుజాత మాట్లాడుతూ తానూ పార్టీలో సీనియర్‌నని, పార్టీ కోసం కష్టపడ్డానని, పార్టీని అంటిపెట్టుకుని ఉన్న తనకు విలువ ఇవ్వకుండా ఇలా చేయడం వల్ల పార్టీకి నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తే.. చూస్తూ ఊరుకోనని స్పష్టం చేసినట్టు సమాచారం. మంత్రి అయ్యన్నపాత్రుడు ఇరువురికి నచ్చజెప్పడంతో పార్టీ సమన్వయ కమిటీ సమావేశం కొనసాగింది. -
ఆర్ఐ, వీఆర్వోపై టీడీపీ నేత వీరంగం
కంతేరు (ఇరగవరం) : కృష్ణా జిల్లా ముసునూరు మండల తహసిల్దార్‌పై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడిన ఘటన మరిచిపోకముందే ఇరగవరం మండలం కంతేరులో అదే తరహా ఘటన ఆదివారం చోటుచేసుకుంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు అక్రమంగా మట్టిని తవ్వుకుని విక్రయిస్తూ అడ్డొచ్చిన అధికారులనూ బెదిరిస్తున్నారు. అక్రమ తవ్వకాలను ఆపాలని కోరిన ఆర్ఐ, వీఆర్వోలపై మండలానికి చెందిన టీడీపీ నాయకుడు గల్లి వెంకటేశ్వరరావు వీరంగం చేశారు. తన అక్రమాలకు అడ్డొస్తే చంపేస్తానని బెదిరించారు. వివరాలు ఇలా ఉన్నారుు. కంతేరు నుంచి కాకిలేరు వెళ్లే రోడ్డు పక్కనే అక్రమంగా చెరువు తవ్వుతున్నారనే సమాచారంతో గ్రామ రెవెన్యూ అధికారి వి.సురేష్ ఘటనాస్థలానికి వెళ్లి తక్షణమే పనులు ఆపాలని కోరారు. దీంతో అక్కడకు వచ్చిన ఎంపీటీసీ సభ్యులు గల్లి సీతమ్మ భర్త గల్లి వెంకటేశ్వరరావు వీఆర్వోను, అక్కడ ఉన్న విలేకరులను తీవ్ర దుర్భాషలాడారు. ఈ విషయూన్ని వీఆర్వో తహసిల్దార్ మమ్మి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ జయలక్ష్మిలకు తెలియజేశారు. పుష్కర విధుల్లో ఉన్న తహసిల్దార్ మమ్మి ఆర్ఐ జయలక్ష్మిని ఘటనా స్థలానికి పంపారు. ఆమె అక్కడికి చేరుకుని వెంటనే పనులు నిలిపివేయూలని, మట్టి తవ్వకాలకు అనుమతులు తీసుకోవాలని చెప్పారు. దీంతో టీడీపీ నేత వెంకటేశ్వరరావు మరింత రెచ్చిపోయూరు. రెవెన్యూ అధికారులను తీవ్రపదజాలంతో (బూతులతో) దుర్భాషలాడుతూ తన పనులకు అడ్డు వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని, అధికారులను ఉద్యోగాల నుంచి తీరుుంచేస్తానని బెదిరించారు. విలేకరులను రోడ్లపై తిరగనివ్వబోనని పరుష పదజాలంతో హెచ్చరించారు. -
అధికార జులుంపై నిరసన
♦ టీడీపీ ఎమ్మెల్యేని అరెస్టు చేయండి ♦ రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన ♦ నల్లబ్యాడ్జీలతో విధుల్లో పాల్గొన్న అధికారులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరుకు నిరసనగా జిల్లావ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన బాటపట్టారు. మహిళా తహశీల్దార్‌పై దాడిచేసిన ఎమ్మెల్యేని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం రంగంపేట వద్ద అక్రమంగా ఇసుకను తరలించడాన్ని అడ్డుకున్న తహశీల్దార్ వనజాక్షి, ఆర్ఐపై టీడీపీ ఎమ్మెల్యే విచక్షణారహితంగా దాడికి పాల్పడిన ఘటనపై జిల్లాలోని రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసనగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. తహశీల్దార్‌పై దాడిచేసిన వారిని వెంటనే శిక్షించాలని నెల్లూరు కలెక్టరేట్ వద్ద ఏపీఆర్ఎస్ఏ, ఎస్‌ఆర్‌ఎస్‌ఏ నాయకులు ఆందోళన చేశారు. నెల్లూరు రూరల్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధుల్లో పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో రెవెన్యూ ఉద్యోగులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో కలిగిరి, ఉదయగిరిల్లో రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని రెవెన్యూ ఎంప్లాయీస్ టీడీపీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా ఆందోళన చేశారు. కావలి పరిధిలో రెవెన్యూ కార్యాలయాల్లో ఉద్యోగులు మధ్యాహ్న భోజన సమయంలో ఆర్డీఓ, తహశీల్దార్లు, సిబ్బంది నిరసన తెలిపారు. బుచ్చిరెడ్డిపాళెం, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు మండల రెవెన్యూ ఉద్యోగులు టీడీపీ ఎమ్మెల్యే తీరుకు నిరసనగా నల్లబ్యాడ్జీలు ధరించి ఎమ్మెల్యేని అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలో ఏఎస్‌పేట, మర్రిపాడు, సంగం, చేజర్ల మండల కార్యాలయాల వద్ద రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో డక్కిలిలో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలియజేశారు. గూడూరులో ఆర్డీఓ కార్యాలయం ఎదుట రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు మద్దతుగా పలుచోట్ల వైఎస్సార్సీపీ, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపారు. -
తహశీల్దార్‌పై దాడి అమానుషం
శ్రీకాకుళం పాతబస్టాండ్: విధి నిర్వహణలో ఉన్న కృష్ణ జిల్లా ముసునూరు మండల తహశీల్దార్ వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి చేయడాన్ని ఏపీ రెవెన్యూ సర్వీసుల సంఘం జిల్లా శాఖ తీవ్రంగా ఖండించింది. మహిళ అని కూడా చూడకుండా తన అనుచరులతో కలిసి దాడి చేయడం అమానుషమని సంఘ ప్రతినిధులు అన్నారు. శ్రీకాకుళంలోని రెవెన్యూ సర్వీసుల సంఘ కార్యాలయంలో గురువారం సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా శాఖ అధ్యక్షుడు ఎం.కాళీప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి జె.రామారావు తదితరులు మాట్లాడుతూ ఇటీవల కాలంలో రెవెన్యూ ఉద్యోగులపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందన్నారు. అధికార పార్టీకి చెందిన నాయకులు వారి కార్యకర్తలు, అనుచరుల అక్రమాలను కాపాడేందుకు, తప్పులు కప్పి పుచ్చుకునేందుకు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇసుక నిర్వహణపై ప్రభుత్వం చట్టం చేసి, కమిటీలను వేసిందని, అయితే ప్రభుత్వంలో కీలక భాధ్యతలు వహిస్తున్న వారే ఇటువంటి దాడులు చేయడం విచారకరమన్నారు. ఈ దాడులు ముఖ్యమంత్రికి తెలిసే జరిగితే..అతను కూడా దాడులను ప్రోత్సహిస్తున్నట్టే భావించాల్సి ఉంటుందన్నారు. వీఆర్ఏ నుంచి ఎస్డీసీ వరకు అన్నిస్థాయిల రెవెన్యూ ఉద్యోగులు ఎకతాటిపై దాడికి నిరసనగా పోరాడాలని పిలుపునిచ్చారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని, దాడులు పునరావృత్తం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కలుగజేసుకొని దాడికి పాల్పడినవారిపై తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రస్థాయిలో ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు బి.శాంతి, వేణుగోపాల్, చంద్రశేఖర్, పి.రాంబాబు, పి.సంఘమేశ్వరరావు పాల్గొన్నారు. చింతమనేనిని అనర్హుడిని చేయాలి శ్రీకాకుళం: దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ను ఆ పదవికి అనర్హుడిని చేయాలని పంచాయతీరాజ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిలారి నారాయణరావు డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ వనజాక్షిపై దాడి చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. అధికారులపైన, తోటి ప్రజాప్రతినిధులపైన దురుసుగా ప్రవర్తించడం చింతమనేనికి పరిపాటి అయిందని, ఇతనికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. -
ఎమ్మార్వోపై దాడి: సుమోటోగా కేసు స్వీకరించిన హెచ్చార్సీ
కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడి కేసును మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఇసుక క్వారీలోకి అక్రమంగా ప్రవేశించడమే కాక.. అక్కడి అక్రమాలను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసి ఆమెను ఇసుకలో ఈడ్చేసిన విషయాన్ని మానవ హక్కుల సంఘం తీవ్రంగా పరిగణించింది. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు ఇచ్చింది. జూలై 13 లోగా దీనిపై నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీచేసింది. ఎమ్మెల్యే దాడి విషయంలో ఎలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టారు, ఏ చర్యలు తీసుకున్నారనే అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇదే ఘటనలో సాక్షి విలేకరి నవీన్‌పై కూడా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. దీన్ని హెచ్చార్సీ సీరియస్‌గా తీసుకుంది. ఈ ఘటనను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా పరిగణించారు. రేపటినుంచి అన్ని రెవెన్యూ కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు. దీన్ని కూడా హెచ్చార్సీ గమనించింది. ఈ నేపథ్యంలోనే సీఎస్, కలెక్టర్, ఎస్పీలకు నోటీసులు జారీచేసింది. -
'నాపట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారు'
విజయవాడ : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ....ఓ మహిళను కించపరిచేలా ప్రయ్నతించటం దారుణమని ఎమ్మార్వో వనజాక్షి కన్నీటిపర్యంతమయ్యారు. ఇలా అయితే మహిళా ఉద్యోగులు ఎవ్వరూ బతకలేరని, ఆత్మహత్యలు చేసుకోవాల్సిందేనని ఆమె అన్నారు. విజయవాడ కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవిన్యూ ఉద్యోగులు గురువారం ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో వనజాక్షి మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని ప్రెస్‌మీట్ పెట్టి తన ఫ్యామీలి గురించి చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారని కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎమ్మెల్యేకి తన పర్సనల్ విషయాల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తే.. ఎలాంటి రక్షణ కూడా ఉండదని, వ్యవస్థ ఇలా ఉంటే...మేం బతకలేమని, మహిళ ఉద్యోగులంతా ఆందోళనకు దిగుతామని ఆమె తెలిపారు. -
'కౌంటర్ కేసు డ్రామాకు తెర తీశారు'
ఏలూరు : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వర్గం కౌంటర్ కేసు డ్రామాకు తెర తీసింది. కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షి తనపై దాడి చేశారంటూ డ్వాక్రా మహిళలు ఎదురు కేసు పెట్టారు. ఎమ్మార్వో వనజాక్షితో పాటు అధికారులు తమపై దాడి చేశారని డ్వాక్రా మహిళలు మీసాల కుమారి, నాగలక్ష్మి పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం చికిత్స కోసం వారు ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేశారు. మహిళల ఫిర్యాదుతో ఎమ్మార్వోతో పాటు అధికారులపై పెదవేగి పోలీసులు మెడికల్ లీగల్ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. మరోవైపు అధికార దౌర్జన్యాలపై అధికారులు ఆగ్రహంతో వున్నారు. గోదావరి పుష్కరాల విధులను బహిష్కరించాలనే యోచనలో ఉన్నారు. కాగా ఆదాయం కోసం అక్రమ మార్గాలు పట్టిన టిడిపి నేతల దాష్టీకానికి ఈ దాడి వ్యవహారమే నిదర్శనం. సాక్షాత్తు ప్రభుత్వాధికారిపైనే దాడికి దిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా ముసునూరు మండలం రంగంపేట ఇసుక రీచ్‌లో అక్రమ తవ్వకాలను అడ్డుకున్న అక్రమంగా ఇసుక తవ్వుకుపోతున్నారంటూ అడ్డుకున్న కృష్ణా జిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షిపై విచక్షణారహితంగా దాడికి దిగారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, అతని 50 మంది అనుచరులు తనపై దాడి చేశారని, మహిళ అని కూడా చూడకుండా ఈడ్చేపారేశారంటూ ఎమ్మార్వో కన్నీళ్లపర్యంతమయ్యారు. ఎమ్మెల్యే చింతమనేని సెక్యూరిటీ సిబ్బంది తన ఫోన్‌ను కూడా లాగేసుకున్నారని, తనను కొట్టి 25 ట్రాక్టర్ల ఇసుకను తరలించుకుపోయారని ఆమె ఆరోపించారు. జరిగిన సంఘటనపై కలెక్టర్‌తోపాటు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని చెప్పారు. -
మరోసారి రోడ్డెక్కిన చెరువు వివాదం
-
విప్ గారి గొప్ప!
ఏలూరు (టూటౌన్) :ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలాకాలో భోగి నుంచి ముక్కనుమ వరకూ పండగ నాలుగు రోజులూ కోడిపందాలు యధేచ్ఛగా సాగాయి. పెదవేగి మండంల కొప్పాక గ్రామంలోని సపోటా తోటలో నిరాటంకంగా కోట్ల రూపాయల్లో పందాలు జరిగాయి. జిల్లాలో సంక్రాంతి సందర్భంగా మూడురోజుల పాటు కోడిపందాలు, పేకాట, గుండాట, కోతాట విచ్చలవిడిగా జరిగాయి. ఈ మూడురోజులు పోలీసులు అటువైపు కన్నెతి కూడా చూడలేదు. అయితే పోలీసులు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకే జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ పందాలు నిలిపివేసినప్పటికీ దెందులూరు నియోజకవర్గంలో మాత్రం యధేఛ్చగా శనివారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచే పందాలు జరగడంతో నియోజకవర్గానికి చెందిన పందెంరాయుళ్లే కాకుండా జిల్లా నలుమూలల నుంచి పెద్దఎత్తున దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం కొప్పాక గ్రామానికి చేరుకున్నారు. జిల్లా పోలీసులు, అధికార యంత్రాంగం ఒకపక్క ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన ఏర్పాట్లలో బిజీగా ఉన్న నేపథ్యంలో చింతమనేని తన హవా కొనసాగించారు. ఆయన దగ్గర ఉండి మరీ పందాలు వేయిం చారు. దీనికి ఏలూరు పార్లమెంటు సభ్యులు మాగంటి బాబు కూడా మద్దతు ఇచ్చినట్టు ప్రచారం సాగింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో రాత్రి 11-00 గంటల వరకూ పందాలు యధావిధిగా జరిగాయి. ఈ విషయం జిల్లా అధికారులకు తెలిసినప్పటికీ కన్నెతి చూడలేదు. కొంతమంది పోలీసులు సాహసం చేసి కొప్పాక వెళ్లినప్పటికి వారిని చింతమనేని దూషించి పంపినట్టు సమాచారం. కోడిపందాలతో పాటు పేకాట, గుండాట, కోతాట, మద్యం విక్రయాలు విప్ కనుసన్నల్లో పెద్దఎత్తున జరిగాయి. దీంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల నుంచి కోడిపందాలకు వచ్చిన అ దికార పార్టీ నాయకులు దెందులూరు టైగర్ మాత్రమే పోలీసులను ఎదిరించి ఇలాంటి పనులు చేయగలడని చెప్పుకున్నారు. రూ.కోట్లలో పందాలు సంక్రాంతి సందర్భంగా మూడురోజుల పాటు జిల్లావ్యాప్తంగా కోడి పందాలు, పేకాట, గుండాట, కోతాటల్లో ఎన్ని రూ.కోట్లు చేతులు మారాయో శనివారం ఒక్కరోజే కొప్పాకలో జరిగిన పందాల్లో దాదాపు అంతే మొత్తంలో డబ్బు చేతులు మారిందని పందాలరాయుళ్లు తెలిపారు. చింతమనేని నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో రాత్రి వేళల్లో జరిగిన పందాల్లో విద్యుత్ చౌర్యం భారీగా జరిగినట్టు పలువురు ఆరోపిస్తున్నారు.టోల్గేట్ ఏర్పాటు : నిబంధనలకు విరుద్ధంగా కోడిపందాలు నిర్వహించటం ఒక ఎత్తైతే, పందాలకు వచ్చే వారి వాహనాలకు టోల్గేట్ ఏర్పాటు చేసి మరీ డబ్బు వసూలు చేయటం దారుణంగా ఆరోపిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా చాలా మంది కొప్పాకకు కోడిపందాలు చూడటానికి వచ్చిన నేపథ్యంలో కారుకి రూ.100, మోటార్ సైకిల్‌కు రూ.50 చొప్పున వసూలు చేశారు. -
ఆపన్నులకు అండగా...
ఏలూరు : హుదూద్ తుపాను బీభత్సంతో అన్నపానీయూలు దొరక్క అలమటిస్తున్న ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకునేందుకు ‘పశ్చిమ’ ప్రజలు మేము సైతం అంటూ ముం దుకు వస్తున్నారు. మంగళవారం రాత్రి వరకూ 1.61 లక్షల ఆహార పొట్లాలు, 7.37 లక్షల మంచినీటి ప్యాకెట్లను అధికారుల ద్వారా తుపాను బాధిత ప్రాంతాలకు పంపిం చారు. బుధవారం మరో 1.16 లక్షల ఆహార పొట్లాలు పంపుతున్నట్టు కలెక్టర్ కె.భాస్కర్ తెలిపారు. రాజమండ్రి విమానాశ్రయానికి 41,400, గన్నవరం విమానాశ్రయానికి 2,400, రోడ్డు మార్గం ద్వారా 1,17,470 ఆహార పొట్లాలను పంపించినట్టు వివరించారు. వీటిలో తాడేపల్లిగూడెం నుంచి 12,500, తణుకు నుంచి 4,800, నిడదవోలు నుంచి 5,000, దేవరపల్లి నుంచి 4,000, తాళ్లపూడి నుంచి 5100 ఆహార పొట్లాలు అందాయని తెలిపారు. వీటిని ఆయూ మండలాల తహసిల్దార్ల ఆధ్వర్యంలో సమీకరించినట్టు తెలిపారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో 12,400, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు సహకారంతో 25 వేలు, జిల్లా పంచాయతీ అధికారి ద్వారా 2,400 ఆహార పొట్లాలను రోడ్డు మార్గంలో పంపించామన్నారు. వీటితోపాటు 10 టన్నుల కూరగాయలను కూడా పంపినట్టు పేర్కొన్నారు. నల్లజర్ల, ఏలూరు, తణుకు, పాలకొల్లు ప్రాంతాల నుంచి 7.37 లక్షల వాటర్ ప్యాకెట్లను, నిడదవోలు, ఏలూరు, భీమవరం నుండి 6 మంచినీటి ట్యాంకర్లను, తాడేపల్లిగూడెం, నిడదవోలు, ఏలూరు నుంచి 33 వేల బిస్కెట్ ప్యాకెట్లను పంపించామన్నారు. ఏలూరు, ఆకివీడు, తణుకు నుంచి 16 జనరేటర్లను పంపుతున్నట్టు తెలిపారు. 5 వేల లీటర్ల పాలు తరలింపు ఏలూరు నుంచి 5 వేల లీటర్ల పాలను, 25 వేల బిస్కెట్ ప్యాకెట్లు, లక్ష మంచినీటి ప్యాకెట్లతోపాటు పులిహోర, పలావ్ ప్యాకెట్లను విశాఖపట్నానికి పంపినట్టు ఏలూరు ఎమ్మెల్యే బడేటి కోటరామారావు (బుజ్జి) చెప్పారు. విరాళాలు ఇవ్వాలనుకుంటే... తుపాను బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు అందించాలనుకునేవారు ఆన్లైన్ ద్వారా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతా నంబర్ 33913634404 (ఐఎఫ్ఎస్ కోడ్ నంబర్ : ఎస్బీఐఎన్ 0002724)కు సొమ్మును జమ చేయవచ్చని కలెక్టర్ కె.భాస్కర్ పేర్కొన్నారు. చెక్కులు, డీడీల రూపంలో విరాళం ఇవ్వాలనుకునేవారు డెప్యూటీ సెక్రటరీ, రెవెన్యూ శాఖ, 4వ ప్లోర్, ఎల్-బ్లాక్, సెక్రటేరియట్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలని సూచించారు. ఇదిలావుండగా, తుపాను బాధితుల సహాయూర్థం 17వ డివిజన్ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావు, ఆర్ఎన్నార్ అధినేత నాగేశ్వరరావు రూ.3 లక్షల విరాళాన్ని ఎమ్మెల్యే బడేటి బుజ్జికి అందించారు. నగర మేయర్ షేక్ నూర్జహాన్ రూ.2 లక్షలు, ఎమ్మెల్యే బడేటి బుజ్జి రూ.2 లక్షల విరాళం అందించేందుకు ముందుకు వచ్చారు.