సియోల్: అవినీతి కేసులో దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హైకి 24 ఏళ్ల జైలు శిక్ష పడింది. దేశ తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్రకెక్కిన గుయెన్ అతి తక్కువ కాలంలోనే ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. లంచం, అధికార దుర్వినియోగం వంటి పలు కేసుల విచారణలో పార్క్ దోషిగా తేలారు.
‘ప్రముఖ వ్యాపారవేత్త చోయి సూన్ సిల్‌తో కలసి దాదాపు రూ.140 కోట్లకు పైగా డబ్బును పార్క్ లంచంగా డిమాండ్ చేశారు’అని న్యాయమూర్తి కిమ్ సే యూన్ పేర్కొన్నారు. ‘పార్క్‌కు 24 ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తున్నాను. అలాగే దాదాపు రూ.11 లక్షలు జరిమానా విధిస్తున్నాను’అని తీర్పు వెలువరించారు. దక్షిణ కొరియా నియంత పార్క్ చుంగ్ హీ కుమార్తె అయిన గ్వెన్ 2013లో అధికారంలోకి వచ్చారు. నాలుగేళ్ల లోపే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆందోళనల మధ్య ఆమె గద్దె దిగారు.
Comments
Please login to add a commentAdd a comment