న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత కోల్పోయి జైలు శిక్ష అనుభవిస్తున్న నాయకులు.. తమ పార్టీ అభ్యర్థులను ఎలా ఎన్నుకుంటారని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పలు కేసుల్లో దోషులుగా ఉన్న వారు రాజకీయ పార్టీల పదవులు అనుభవించకుండా నిరోధించాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీం ఈ వ్యాఖ్యలు చేసింది. ‘దోషిగా ఉన్నవాళ్లు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజ్యాంగపరంగా అర్హత కోల్పోయిన నేతలు.. వారి పార్టీ అభ్యర్థులను నిర్ణయిస్తారా? అసలు వారు పార్టీ పదవులను అనుభవించటం సరైనదేనా? ప్రజాస్వామ్య పవిత్రతను ఎలా కాపాడగలం. వారంతా కలిసి నిందితులతో ఓ అసోసియేషన్ ఏర్పాటుచేయవచ్చు. కానీ రాజకీయ పార్టీ కాదు’ అని ధర్మాసనం పేర్కొంది. దేశంలో 40 శాతం మంది ప్రజాప్రతినిధులపై కేసులున్నాయి. ఈ నేతలు రాజకీయ పదవుల్లో ఉండేందుకు అనర్హత ప్రకటించే చట్టం ఎలా వస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment