
ఒరిజినల్ లేకుంటే జైలుకే..
సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే మూడు నెలల జైలు శిక్ష విధించనున్నారు.
టీ.నగర్: సెప్టెంబరు ఒకటవ తేదీ నుంచి ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే మూడు నెలల జైలు శిక్ష విధించనున్నారు. దీనిగురించి చెన్నై ట్రాఫిక్ పోలీసు శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఇలా తెలిపింది. మోటారు వాహన చట్టం ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పబ్లిక్‌లో వాహనం నడపరాదని, అలాగే ట్రాఫిక్ పోలీసులు కోరినపుడు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ తప్పక చూపాలని పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్సు లేకుండా వాహనం నడిపితే మూడు నెలల జైలు శిక్ష లేదా రూ.500 జరిమానా లేదా రెండు కలిపి శిక్ష విధించవచ్చని తెలిపారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహన యజమానుల సంఘం ఆవేదన:
ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సుల గురించి తమిళనాడు పర్యాటక వాహన యజమానుల సంఘం నిర్వాహకులు విడుదల చేసిన ఒక ప్రకటనలో తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వ్యాపారం ప్రస్తుతం దీనావస్థలో ఉన్నందున ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్సుల ప్రకటన మరింత ఆవేదన కలిగిస్తున్నట్లు పేర్కొన్నారు.