ఆగమన సన్నాహాల్లో ‘1948 - అఖండ భారత్’ | 1948-Akhand Bharat Movie Poster And Lyrical Video Song Out | Sakshi
Sakshi News home page

ఆగమన సన్నాహాల్లో ‘1948 - అఖండ భారత్’

Published Sun, Aug 15 2021 6:05 PM | Last Updated on Sun, Aug 15 2021 6:05 PM

1948-Akhand Bharat Movie Poster And Lyrical Video Song Out - Sakshi

మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి గల కారణం ఏంటి? హత్య తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ‘1948 - అఖండ భారత్’. ఎమ్.వై.ఎమ్ క్రియేషన్స్ పతాకంపై ఈశ్వర్ బాబు.డి దర్శకత్వంలో ఎంవై మహర్షి నిర్మిస్తున్న ఈ చిత్రంలో  ఆలేఖ్య శెట్టి, రఘనందన్, ఆర్యవర్ధన్ రాజ్, ఇంతియాజ్  తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 

పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌, లిరికల్‌ వీడియో సాంగ్‌ని  స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ హత్యకు గురి కావడానికి 45 రోజుల ముందు నుంచి... హత్య తదనంతర పరిణామాల నేపధ్యంలో ఈ చిత్రం తెరకెక్కిందని, వివాదాలకు తావులేని రీతిలో- మరుగున పడిపోయిన వాస్తవాలు వెలికి తీయడమే లక్ష్యంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ చిత్రానికి ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే -మాటలు - రీసెర్చ్: డాక్టర్ ఆర్యవర్ధన్ రాజ్, సంగీతం:  శశిప్రీతమ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement