గాంధీజీ ఆదర్శాలు దేశానికి తక్షణావసరం: సీఎం కేసీఆర్‌  | Telangana CM KCR About Mahatma Gandhi | Sakshi
Sakshi News home page

గాంధీజీ ఆదర్శాలు దేశానికి తక్షణావసరం: సీఎం కేసీఆర్‌ 

Published Mon, Jan 30 2023 3:16 AM | Last Updated on Mon, Jan 30 2023 3:16 AM

Telangana CM KCR About Mahatma Gandhi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కుల, మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన మహాత్మాగాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణ అవసరమని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆయన్ను స్మరించుకున్నారు.

జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన జీవితాన్ని అర్పించిన మహాత్మాగాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచిలా నిలుస్తారని పేర్కొన్నారు. నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదుర య్యే ఆటంకాలను లెక్క చేయకుండా ఒక్కొక్కటిగా అధిగమిస్తూ విజయతీరాలకు చేరాలనే స్ఫూర్తిని గాంధీ జీవితం నుంచి ప్రతిఒక్కరూ నేర్చుకోవాల్సి ఉందని సీఎం సూచించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement