కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేనున్నానంటూ భరోసా ఇవ్వడానికి ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోందని ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన వైఎస్ జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారని ఆస్టిన్‌లోని ప్రవాసాంధ్రులు తెలిపారు. జనం కోసం జననేత చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో సోమవారం మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందన్నారు. విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద 3000 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్నారని తెలిపారు. చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయిన ప్రజలంతా ఆవేదన చెందుతున్నారని.. అందుకే పాదయాత్రలో వైఎస్ జగన్‌కు అండగా నిలుస్తున్నారన్నారని తెలిపారు.