వైఎస్ జగన్ విడుదలతో ఆస్టిన్ లో సంబరాలు!
వైఎస్ జగన్ విడుదలతో ఆస్టిన్ లో సంబరాలు!
Published Wed, Oct 2 2013 10:49 PM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై విడుదల కావడంతో అమెరికాలోని ఆస్టిన్ నగరంలో వైఎస్సార్ అభిమానులు హోటల్ దావత్ లో సంబరాల్ని జరుపుకున్నారు. వైఎస్ జగన్ రాకతో రాష్ట్ర రాజకీయాలు కొత్త రూపం సంతరించుకుంటాయని పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులు, అభిమానులు, కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం ఆస్టిన్ లో పండగ వాతావారణాన్ని తలపించింది.
మహానేత దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకు చేరాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని.. ఆయన నాయకత్వం కోసం తెలుగు ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జగన్ నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, ఆయన సీఎం అవుతారని ఆస్టిన్ వైఎస్సార్ అభిమానులు విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈకార్యక్రమంలో అట్లాంటా నుండి గురవారెడ్డి, హౌస్టన్ నుండి రమణ రెడ్డి బొమ్మరెడ్డి, డల్లాస్ నుండి కృష్ణారెడ్డి కోడూరు, శ్రీనివాస రెడ్డి ఒబిలిరెడ్డి పాల్గొనగా, ఆస్టిన్ లోని ప్రవాసాంధ్రులు నారాయణరెడ్డి గండ్ర, సుబ్బారెడ్డి చింతగుంట, మురళి బండపల్లి, రవి బల్లాడ , ప్రవర్థాన్ చిమ్ముల, రఘుసిద్దపు రెడ్డి , అగ్గిరామయ్య దేవరపల్లి, వెంకట్ నామాల, ప్రదీప్ రెడ్డి చౌటి, వెంకట్ యీరగుడి , రామహనుమంత రెడ్డి, కొండా రెడ్డి ద్వారసాల , శ్రీని చింత, కరుణ్ రెడ్డి, వెంకట్ గోతం, సాచి ముట్టూరు, సుధాకర రెడ్డి చౌటి, చంద్రా రెడ్డి అనుమరెడ్డి, అశోక్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, కిశోర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, నాగమణి , లీలవతమ్మ, సరిత, సంపూర్ణ , శైలజ, ,బిందు, జ్యోతి, శ్వేత ఇతరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్‌సీపీకి చెందిన నాయకులు, అభిమానులు, కార్యకర్తలు 100 మందికి పైగా హాజరయ్యారు.
Advertisement
Advertisement