
ఆస్టిన్ : వైఎస్ వివేకానందరెడ్డి మృతిపట్ల వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు తీవ్ర ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. సాల్ట్ ఎన్ పెప్పర్లో జరిగిన ఈ కార్యక్రమములో శివ ఎర్రగుడి , నారాయణ రెడ్డి గండ్ర , కొండా రెడ్డి ద్వారసల , వసంత్ ఉయ్యురు, గురు రెడ్డి, మురళి బండ్లపల్లి, శ్రీ కొత్తపల్లి, వెంకట్ ఉప్పాల, అనంత్ , సుబ్బారెడ్డి ఎర్రగుడి, చెన్నకేశవ రెడ్డి మల్లికార్జున రెడ్డి ఆవుల పాల్గొన్నారు. వైఎస్ వివేకానందరెడ్డితో ఆస్టిన్కు వున్న సంబంధాన్ని గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. దేశ రాజకీయాల్లో అజాతశత్రువు, మృదు స్వభావిగా పేరున్న వైఎస్ వివేకానందరెడ్డి గారి మృతి పట్ల అభిమానులందరూ సంతాపం తెలిపారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్న ఆయన కలను నిజం చేయాలనీ ప్రతిజ్ఞ పూనారు.
Comments
Please login to add a commentAdd a comment