డేట్‌కి తీసుకెళ్తే ఇలా చేస్తుందా? | Interesting date story | Sakshi
Sakshi News home page

డేట్‌కి తీసుకెళ్తే ఇలా చేస్తుందా?

Published Sun, May 21 2017 1:59 AM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM

డేట్‌కి తీసుకెళ్తే ఇలా చేస్తుందా?

డేట్‌కి తీసుకెళ్తే ఇలా చేస్తుందా?

ఆన్‌లైన్‌లో పరిచయం అయిన అమ్మాయిని అతను డేట్‌కు పిలిచాడు. సరేనన్న ఆమెను.. సరదాగా ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ’  సినిమాకు తీసుకెళ్లాడు. అయితే, సినిమా పూర్తయిన వెంటనే అనూహ్యంగా లాయర్‌ను కలసి.. ఆ అమ్మాయిపై దావా వేశాడు. ఇంతకీ థియేటర్లో ఏం జరిగి ఉంటుందో ఊహించగలరా? అమెరికాలోని టెక్సాస్‌ రాజధాని అస్టిన్‌లో చోటుచేసుకున్న ఈ వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. ‘ఆమెపై కేసు మాత్రమే వేస్తే సరిపోదు.. జైలుకు పంపాల్సిందే..’ అని నెటిజన్లు వత్తాసు పలుకుతున్నారు. విషయంలోకి వెళితే.. అస్టిన్‌కు చెందిన బ్రెండన్‌ వెజ్మర్‌ అనే యువకుడికి.. ఆన్‌లైన్‌లో ఓ అమ్మాయి పరిచయం అయింది.

ఇద్దరూ కలసి మే 6న డేట్‌కు వెళ్లారు. అది.. అతని మొట్టమొదటి డేట్‌ అట! వాళ్లిద్దరూ ‘గార్డియన్స్‌ ఆఫ్‌ గెలాక్సీ’  సినిమా చూస్తుండగా.. ఆమె ఫోన్‌కు మెసేజ్‌ వచ్చింది. సినిమా చూస్తూనే ఆమె దానికి రిప్లై కూడా ఇచ్చింది. అలా ఓ 20 వెసేజ్‌లు రావడం, వాటన్నింటికీ ఆమె రిప్లై ఇవ్వడం జరిగింది. పక్కనే కూర్చున్న బ్రెండన్‌కు ఈ మెసేజ్‌ల వ్యవహారంతో చిర్రెత్తుకొచ్చింది. ‘నా డబ్బులతో సినిమాకొచ్చి, నా పక్కనే కూర్చొన్న ఆమె.. వరుసగా మెసేజ్‌లు పంపించి, సినిమా చూడాలన్న నా హక్కును కాలరాసింది. హాలులో మొబైల్‌ వాడటం థియేటర్‌ పాలసీకి వ్యతిరేకం కూడా’ అని బ్రెండన్‌ కోర్టుకెక్కాడు. డేట్‌ కోసం ఖర్చుచేసిన 17.31 డాలర్లను నష్టపరిహారంగా చెల్లించాలని లాయర్‌ ద్వారా అమ్మాయిని డిమాండ్‌ చేశాడు. ఆ విధంగా అమ్మాయిని డేట్‌కు తీసుకెళ్లడమేకాక, ఆమెపై దావా వేసిన బ్రెండన్‌ చర్యను వెర్రితనమని ఇంకొందరు అంటున్నారు. మరి మీరేమంటారు?

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement