చంద్రబాబుపై మండిపడ్డ ఎన్ఆర్ఐలు | AUSTIN based nri's held a candle light protest to support Y.S.Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

చంద్రబాబుపై మండిపడ్డ ఎన్ఆర్ఐలు

Published Wed, Feb 1 2017 3:23 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

చంద్రబాబుపై మండిపడ్డ ఎన్ఆర్ఐలు - Sakshi

చంద్రబాబుపై మండిపడ్డ ఎన్ఆర్ఐలు

ఆస్టిన్(యూఎస్) :
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్తో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆస్టిన్లోని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు బాసటగా నిలిచారు. టెక్సాస్లోని ఓయాసిస్లో కొవ్వొత్తులు వెలిగించి వైఎస్ జగన్కు ఎన్ఆర్ఐలు మద్దతు ప్రకటించారు.  ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని సీఎం చంద్రబాబు నాయుడు అప్రజాస్వామ్య మార్గంలో అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
 
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాసటగా ఉంటామని ఆస్టిన్లోని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో.. రవి బల్లాడ, సుబ్బారెడ్డి చింతగుంట, మురళి బండ్లపల్లి, నారాయణ రెడ్డి గండ్ర, కుమార్ అశ్వపతి, రఘు సిద్దపు రెడ్డి, సచి ముట్లూరు, ప్రసాద్ గురిజల, వెంకట్ నామాల, వెంకట్ గొట్టం, స్వదీప్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి చౌటి, వెంకటేశ్ బాగేపల్లి, మోహన్ రెడ్డి, అశోక్ గూడూరు, దేవెందర్ రెడ్డి, హేమంత్ బల్ల, కొండా రెడ్డి దాసుర్ల, శ్రీని, నవీన్ కందుల, శ్యాం, ప్రదీప్ రెడ్డిలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement