Candle Light Protest
-
ప్రత్యేక హోదా కోసం ప్రవాసాంధ్రుల కొవ్వొత్తుల ర్యాలీ
సెయింట్ లూయిస్ : ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ అమెరికాలోని ప్రవాసాంధ్రులు నినదించారు. అమెరికా వైఎస్సార్సీపీ రీజినల్ కమిటీ ఇంచార్జీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సెయింట్ లూయిస్‌లోని మహాత్మా గాంధీ సెంటర్లో అనేక మంది తెలుగువారు, పార్టీ అభిమానులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సెయింట్ లూయిస్ వైఎస్సార్సీపీ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గుడవల్లి, గోపాల్ రెడ్డి, రంగా చక్కలతోపాటూ పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. -
అమెరికాలో దాడులపై కొవ్వొత్తుల నిరసన
హైదరాబాద్: అమెరికా భారతీయులపై జరుగుతున్న దాడులకు నిరసనగా నగరంలో గురువారం కొవ్వొత్తుల నిరసన జరిగింది. జాత్యహంకార దాడిలో నగరానికి చెందిన ఇంజనీర్ శ్రీనివాస్ కూచిబొట్ల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా అమెరికాలో భారతీయులపై వరుసగా జాత్యహంకార దాడులు జరుగుతున్నాయి. దాడులకు నిరసనగా కేబీఆర్ పార్కు వద్ద ఏర్పాటుచేసిన సభలో అరచేతుల్లో కొవ్వొత్తులను వెలిగించి ప్రజలు నిరసన తెలిపారు. -
చంద్రబాబుపై మండిపడ్డ ఎన్ఆర్ఐలు
ఆస్టిన్(యూఎస్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటానికి ఆస్టిన్లోని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు బాసటగా నిలిచారు. టెక్సాస్‌లోని ఓయాసిస్లో కొవ్వొత్తులు వెలిగించి వైఎస్ జగన్‌కు ఎన్ఆర్ఐలు మద్దతు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వారిని సీఎం చంద్రబాబు నాయుడు అప్రజాస్వామ్య మార్గంలో అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించే వరకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బాసటగా ఉంటామని ఆస్టిన్లోని వైఎస్ఆర్సీపీ మద్దతుదారులందరూ కలిసి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో.. రవి బల్లాడ, సుబ్బారెడ్డి చింతగుంట, మురళి బండ్లపల్లి, నారాయణ రెడ్డి గండ్ర, కుమార్ అశ్వపతి, రఘు సిద్దపు రెడ్డి, సచి ముట్లూరు, ప్రసాద్ గురిజల, వెంకట్ నామాల, వెంకట్ గొట్టం, స్వదీప్ రెడ్డి, ప్రదీప్ రెడ్డి చౌటి, వెంకటేశ్ బాగేపల్లి, మోహన్ రెడ్డి, అశోక్ గూడూరు, దేవెందర్ రెడ్డి, హేమంత్ బల్ల, కొండా రెడ్డి దాసుర్ల, శ్రీని, నవీన్ కందుల, శ్యాం, ప్రదీప్ రెడ్డిలు పాల్గొన్నారు. -
ఎవరు ఉద్యమించినా మద్దతిస్తాం
♦ ప్రత్యేక హోదాపై విశాఖ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టీకరణ ♦ 26న విశాఖ బీచ్‌లో జరిగే ఆందోళనలో పాల్గొంటామని వెల్లడి ♦ ప్రత్యేక హోదా కోసం మూడేళ్లుగా పోరాడుతోంది ఒక్క జగనేనని స్పష్టీకరణ సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరు ఉద్య మించినా మద్దతిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సమిష్టి పోరాటాలకు వైఎస్సార్సీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన విశాఖ బీచ్‌లో యువత చేపట్టే మౌన ప్రదర్శన, ఆందోళనలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రదర్శనలో వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొం టాయని వెల్లడించారు. హోదా సాధన కోసం 26వ తేదీ రాత్రి విశాఖ బీచ్‌లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ప్రదర్శన యథాతథంగా ఉం టుందని ఆయన స్పష్టం చేశారు. విశాఖలో సోమవారం అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తోంది ఒక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. నిరసనలు, ధర్నాలు, దీక్షలు, సదస్సులు, బహిరంగ సభలు.. ఇలా వివిధ రూపాల్లో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం తమిళనాడు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమానికి యువత ముందుకు రావడం హర్షణీయ మన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతం గా హోదా సాధన కోసం అందరూ ముందు కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ కూడా కొంత మంది వ్యక్తులు స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.