ఎవరు ఉద్యమించినా మద్దతిస్తాం | Candle Light Protest Over AP Special Status At RK Beach, Vizag Gudivada Amarnath | Sakshi
Sakshi News home page

ఎవరు ఉద్యమించినా మద్దతిస్తాం

Published Tue, Jan 24 2017 1:57 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

ఎవరు ఉద్యమించినా మద్దతిస్తాం - Sakshi

ఎవరు ఉద్యమించినా మద్దతిస్తాం

ప్రత్యేక హోదాపై విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టీకరణ
26న విశాఖ బీచ్‌లో జరిగే ఆందోళనలో పాల్గొంటామని వెల్లడి
ప్రత్యేక హోదా కోసం మూడేళ్లుగా పోరాడుతోంది ఒక్క జగనేనని స్పష్టీకరణ


సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఎవరు ఉద్య మించినా మద్దతిస్తామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా సమిష్టి పోరాటాలకు వైఎస్సార్‌సీపీ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. ఈ నెల 26వ తేదీన విశాఖ బీచ్‌లో యువత చేపట్టే మౌన ప్రదర్శన, ఆందోళనలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రదర్శనలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్దఎత్తున పాల్గొం టాయని వెల్లడించారు. హోదా సాధన కోసం 26వ తేదీ రాత్రి విశాఖ బీచ్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కొవ్వొత్తుల ప్రదర్శన యథాతథంగా ఉం టుందని ఆయన స్పష్టం చేశారు.

విశాఖలో సోమవారం అమర్‌నాథ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రెండున్నరేళ్లుగా అవిశ్రాంత పోరాటం చేస్తోంది ఒక్క వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. నిరసనలు, ధర్నాలు, దీక్షలు, సదస్సులు, బహిరంగ సభలు.. ఇలా వివిధ రూపాల్లో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నడిపిస్తున్నారని వివరించారు. ప్రస్తుతం తమిళనాడు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమానికి యువత ముందుకు రావడం హర్షణీయ మన్నారు. పార్టీలు, రాజకీయాలకు అతీతం గా హోదా సాధన కోసం అందరూ ముందు కు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే ఇక్కడ కూడా కొంత మంది వ్యక్తులు స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్న పరిస్థితి కనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement