ఎయిర్ ఇండియా విమానం ఇంజన్లో ఇరుక్కొని..
ముంబై: ముంబై విమానాశ్రయంలో ఎయిర్ ఇండియాకు చెందిన టెక్నీషియన్ విమానం ఇంజన్లో ఇరుక్కొని బుధవారం మృతి చెందాడు. ముంబై నుంచి హైదరాబాద్కు రావల్సిన ఎయిర్ ఇండియాకు చెందిన AI619 విమానానం అప్పటికే గంటకు పైగా ఆలస్యం అయింది. అదే సమయంలో పార్కింగ్ లో ఉన్న విమానంలో టెక్నిషియన్ ఇంజన్ తనిఖీ చేస్తున్నాడు.
టెక్నిషియన్ బయటకు రాకముందే విమానాన్ని స్టార్ట్ చేయండంతో అందులోనే ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన పై విచారణకు ఆదేశించినట్టు ఎయిర్ ఇండియా అధికారులు వెల్లడించారు.