సాక్షి, చెన్నై : కడుపు నొప్పి అంటూ ఆస్పత్రిలో చేరిన ఓ బాలిక (13) కడపులో అరకేజీ జుట్టును వైద్యులు గుర్తించారు. ఆస్పత్రి సిబ్బంది షాకింగ్‌కు గురైన ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో సోమవారం చోటుచేసుకుంది. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడోతరగతి చదువుతున్న ఓ బాలిక గత కొంతకాలం నుంచి విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. దీంతో బాలికను తల్లిదండ్రులు సమీపంలో వీజీఎమ్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు కడుపులో బంతి ఆకారంలో ఎదో వస్తువు ఉందని తొలుత గుర్తించారు. దానిని తొలగించాలంటే సర్జరీ చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ వైద్యుడు గోకుల్ కృపాశంకర్ నేతృత్వంలోని వైద్యబృందం సర్జరీ నిర్వహించారు.
ఈ క్రమంలోనే బాలిక కడుపులో అరకేజీ వెంట్రుకలు, ఖాళీ షాంపూ పాకెట్లు, మరికొన్ని ప్లాస్టిట్ వస్తువులు బయటపడ్డాయి. వీటిని చూసిన వైద్యులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు. అంతపెద్ద మొత్తంలో వెంట్రుకలు లభ్యంకావడంతో ఖంగుతిన్నారు. ఈ విషయంపై బాలిక తల్లిదండ్రులతో వైద్యులు మాట్లాడగా... ఆమె మానసిక వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపారు. మొత్తానికి వైద్యుల కృషి ఫలించి బాలిక క్షేమంగా బయటపడింది.
Comments
Please login to add a commentAdd a comment