
కాలుష్యం, చుండ్రు, పొడిబారడం వంటి సమస్యలు శిరోజాల అందాన్ని దెబ్బతీస్తాయి. కురుల నిగనిగలను కాపాడుకోవాలంటే..
♦ రెండు టీ స్పూన్ల బ్రౌన్ షుగర్‌లో టీ స్పూన్ హెయిర్ కండిషనర్ కలిపి మాడుకు పట్టించాలి. పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే చుండ్రు సమస్య తగ్గుతుంది.
♦ టీ స్పూన్ ఉల్లిరసంలో రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. దూది ఉండతో మిశ్రమాన్ని అద్దుకుంటూ మాడుకు పట్టించాలి. అర గంట తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. చుండ్రుతో పాటు. వెంట్రుకలు రాలడం సమస్య కూడా తగ్గుతుంది.
Comments
Please login to add a commentAdd a comment