ఈ ప్రకృతిలో జీవుల మధ్య మనుగడ పోరాటం చాలా వైవిధ్యంగా సాగుతుంటుంది. సాధారణంగా పక్షుల్లో చాలా రకాలు గూడు కట్టుకోవడం కోసం చాలా కష్టపడుతుంటాయి. గడ్డి పోచలు, ఆకులతో పాటు చిన్న కట్టెపుల్లలను ఉపయోగించుకుంటాయి. అలాగే ఇంకొన్ని పక్షులు జంతువుల నుంచి జుట్టును తస్కరిస్తుంటాయి. ఈ క్రమంలో వాటి చేతిలో గాయపడడమో లేదంటే చనిపోవడమో జరుగుతుంది కూడా.
సైంటిఫిక్‌గా ఈ చర్యకు ఇన్నాళ్లూ ఓ పేరంటూ లేదు. తాజాగా పక్షులు చేసే ఈ సాహసోపేతమైన చర్యకు ఓ పదం, అర్థం ఇచ్చారు సైంటిస్టులు. అసాధారణమైన ఈ ప్రవర్తనకు ‘క్లెప్టోట్రిచి’ అని పేరు పెట్టారు. ఇది ఒక గ్రీకు పదం.. దానికి దొంగిలించడం లేదా జుట్టు అనే రెండు అర్థాలూ వస్తాయి. అందుకే పక్షుల చర్యకు సరిపోతుందనే ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు. జులై 27న ఎకాలజీ(జీవావరణ శాస్త్రం)లో ఈ పదం చేర్చినట్లు ఇల్లినాయిస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఆగష్టు 11న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
భయపెడతాయి..
నిజానికి చలి ప్రాంతాల్లో పక్షులు ఎక్కువగా ఇలా జంతువుల వెంట్రుకలతో గూడులను నిర్మించుకుంటాయి. అంతేకాదు తెలివిని ప్రదర్శించి.. తమ శత్రువులను ఈ గూడుల ద్వారా భయపెడతాయి కూడా. ఎలాగంటే.. వేటాడే వాటికి ఈ గూడును ఏదో భయంకరమైన ప్రాణిగా కనిపించే రీతిలో తీర్చిదిద్దుతాయి ఆ పక్షులు. కుక్కలు, పిల్లులు, నక్కలు, రకూన్‌లు, ఆఖరికి మనుషుల నుంచి కూడా కొన్ని పక్షులు వెంట్రుకల్ని సేకరిస్తుంటాయి. పడుకున్నప్పుడో లేదంటే తింటున్నప్పుడో.. అదనుచూసి వెంట్రుకల్ని లాగేస్తాయి పక్షులు.
ఇది చదవండి: కిడ్నీ మార్పిడిలో పాతవి ఎందుకు తీసేయరంటే..
క్లెప్టోట్రిచిలో భాగంగా.. దక్షిణ అమెరికాలో పామ్ స్విఫ్ట్ పక్షులైతే పావురాలు, చిలుకల నుంచి రెక్కలు దొంగిలించడం విశేషం. ఆస్రే‍్టలియాలో హనీఈటర్ బర్డ్.. కోవాలాల నుంచి వెంట్రుకలు దొంగతనం చేస్తాయి. ఇలాంటి ప్రవర్తనకు కారణం.. పక్షులు ఈ సేకరణను సులువైన మార్గంగా భావించడమేనని, కానీ, ప్రమాదాలను అంచనా వేయకుండా ఒక్కోసారి అవి ప్రాణాలను పొగొట్టుకుంటాయని యానిమల్ బిహేవియరిస్ట్ మార్క్ హౌబర్ చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment