జడతో కారు లాగుతున్న బిందు
మార్కాపురం: రెండు జడలతో కారును లాగి అందర్నీ అబ్బురపరిచిందో చిన్నారి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణానికి చెందిన క్రీడా కోచ్ చిట్టిబాబు కుమార్తె టి.బిందు (సౌజన్య) స్థానిక జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. (చదవండి: వెంట్రుకలను ఎందుకలా కత్తిరిస్తున్నారని అడిగా..)
బుధవారం పీఎస్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో సాహసం చేసి అందరితో శభాష్ అనిపించుకుంది. పట్టుమని 12 ఏళ్లు నిండని చిన్నారి.. తన జడతో మారుతీకారును 50 మీటర్లు లాగింది. ఈ సాహసాన్ని చూసిన ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి బిందును అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment