నల్లని కురులను ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేయడంలో కేశాలది ముఖ్య పాత్ర. మరి అలాంటి కురులు తెల్లబడితే.. కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. అలాంటి వారు నల్లటి జుట్టు కోసం ఈ టిప్స్ పాటిస్తే సరి.
►ఒకటిన్నర గ్లాసు నీటిని తీసుకుని వేడిచేసి... ఈ నీటిలో ఐదు టీస్పూన్ల టీ ఆకులు, రెండు టీస్పూన్ల నల్లజీలకర్ర వేసి పదిహేను నిమిషాల పాటు సన్నని మంట మీద మరిగించాలి.
►నీళ్లు మరిగాక వడగట్టి నీటిని గిన్నెలో తీసుకుని దానిలో నాలుగు టీ స్పూన్ల కాఫీ పొడి, మూడు టీస్పూన్ల అలోవిరా జెల్ వేసి కలపాలి.
►వీటిలో వడగట్టిన టీ ఆకులు కూడా వేసి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి.
►తలస్నానం చేసిన తరువాత తడి తలమీదే ఈ పేస్టుని మాడు నుంచి చివర్ల వరకు అప్లై చేసి నాలుగు గంటల తరువాత కడిగేయాలి.
►వారానికి మూడు సార్లు ఇలా చేయడం వల్ల తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది.
చదవండి: బుట్టెడు పోషకాల పుట్టగొడుగు!
Health Tips In Telugu: ఆ సమయంలో ‘అలోవెరా’ అస్సలు వద్దు!
Comments
Please login to add a commentAdd a comment