బనశంకరి: కాంగ్రెస్ సర్కారు ఐదు హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (శక్తి యోజన)కు సర్కారు ఆమోదం తెలిపింది. నాలుగు రవాణా సంస్థలైన కేఎస్‌ఆర్‌టీసీ, బీఎంటీసీ, వాయువ్య కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ, కళ్యాణ కర్ణాటక రోడ్డు రవాణాసంస్థల బస్సుల్లో (ఏసీ, స్లీపర్ బస్సులు కాకుండా) ప్రయాణానికి సోమవారం అనుమతించింది. విద్యార్థినులు, హిజ్రాలకు కూడా వర్తిస్తుంది. ఈ నెల 11 నుంచి ఉచిత ప్రయాణం అమలులోకి వస్తుంది.
శక్తి యోజన పథకంలో కొన్ని షరతులు
► రాష్ట్రంలో ప్రయాణానికి మాత్రమే శక్తి యోజన పథకం వర్తిస్తుంది
► విలాసవంతమైన లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదు
► అన్ని బస్సుల్లో సగం సీట్లు పురుషులకు కేటాయించారు. అంటే సగం సీట్లలోనే మహిళలు ప్రయాణించాలి. సీట్లు అందుబాటులో లేకపోతే మరో బస్సును వెతుక్కోవాలి
► శక్తి స్మార్ట్స్ కార్డులను మహిళలకు ప్రభుత్వం జారీచేస్తుంది. మహిళలు సేవా సింధు కేంద్రాల్లో దరఖాస్తులు ఇచ్చి కార్డులను పొందవచ్చు. 3 నెలల్లో కార్డుల జారీని పూర్తి చేయాలి. ప్రయాణ సమయంలో ఆ కార్డులను చూపాలి.
Comments
Please login to add a commentAdd a comment