అందంగా కని పించాలనుకునే మహిళలకు నిజంగా ఇది శుభవార్తే. బ్యూటీపార్లర్లకు వెళ్లే తీరుబాటు లేని మహిళలు..
విజయనగరం: అందంగా కని పించాలనుకునే మహిళలకు నిజంగా ఇది శుభవార్తే. బ్యూటీపార్లర్లకు వెళ్లే తీరుబాటు లేని మహిళలు..ఇంట్లోనే ఉంటూ తమను తామే స్వయంగా అందంగా కనిపిం చేలా తయారు చేసుకునేందుకు మహిళలకు మేకప్, హెయి ర్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ అందుబాటులోకి వచ్చేసింది. ఈ నెల 25వ తేదీనుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సాక్షి,మైత్రి మహిళ ఆధ్వర్యంలో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. విజ యనగరంలోని పద్మావతి నగర్, రోడ్‌నంబర్ 3, పివిఆర్ కాలనీ,ఫ్లాట్ నంబర్ 75 గైజోస్ బ్యూటీ క్లినిక్ ట్రైనింగ్ సెంటర్‌లో ఈ శిక్షణ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇస్తారు. ఈ శిక్షణకు హాజరవ్వాలనుకునే మహిళలు రూ.1000 ఫీజు చెల్లించి 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తమ పేర్లు రిజిస్రేషన్ చేయించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నంబర్9666283534, 9290918744లలో సంప్రదించ వచ్చు.