Special training
-
అమ్మలకు అమ్మలు
‘మాతృత్వం’ వరుసలో నిలిచే మరో గొప్ప మాట... మిడ్వైఫ్. ‘మిడ్వైఫరీ’ అనేది ఉద్యోగం కాదు. పవిత్ర బాధ్యత. అటువంటి పవిత్ర బాధ్యతను తలకెత్తుకున్న సూర్ణపు స్వప్న, నౌషీన్ నాజ్ అంకితభావంతో పనిచేస్తున్న మిడ్వైఫరీ నర్స్‌లలో ఒకరు. జపాన్ లో ప్రత్యేక శిక్షణ కోసం మన దేశం నుంచి ఏడుగురు మిడ్ వైఫరీ నర్సులు ఎంపికయ్యారు. వారిలో కొత్తగూడెం ఆస్పత్రిలో పని చేస్తోన్న సూర్ణపు స్వప్న, వరంగల్ సీకేయం ఆస్పత్రిలో పనిచేస్తున్న నౌషీన్ నాజ్ ఉన్నారు. నవంబరు 12 నుంచి 24 వరకు జపాన్‌లో జరిగే లీడర్షిప్ ట్రైనింగ్ప్రోగ్రామ్లో వీరు పాల్గొంటున్నారు.తెలంగాణా రాష్ట్రంలోని మహబూబాబాద్‌కు చెందిన స్వప్న తండ్రి సోమయ్య కమ్యూనిస్టు. ఆపదలో ఉన్నవారికి సేవ చేయాలని ఎప్పుడూ చెబుతుండేవాడు. ఆయన ప్రభావం వల్లనే బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసింది. తొలి పోస్టింగ్ కోసం ఆదిలాబాద్ జిల్లాలోని రిమ్స్‌ను ఎంచుకుంది. యూనిసెఫ్ సహకారంతో హైదరాబాద్‌లో ప్రముఖ మెటర్నిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏడాదిన్నర పాటు డిప్లొమా ఇన్ మిడ్వైఫరీ శిక్షణ కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 30 మందిని ఎంపిక చేసింది. అందులో స్వప్న ఒకరు.భద్రాచలం ఏజెన్సీలో...డిప్లొమా ఇన్ మిడ్‌వైఫరీలో నేర్చుకున్న నైపుణ్యాలను సార్థకం చేసుకునే అవకాశం స్వప్నకు భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో పని చేసేప్పుడు వచ్చింది. ‘మా బ్యాచ్‌లో మొత్తం ముగ్గురం ఈ ఆస్పత్రికి వచ్చాం. అప్పుడు ఇక్కడ సగటున 70 శాతం వరకు సీ సెక్షన్ పద్ధతిలో ప్రసవాలు జరుగుతుండేవి. శిక్షణలో నేర్చుకున్న విషయాలను ఒక్కొక్కటిగా అమలు చేయడం మొదలుపెట్టాం. ముందుగా క్షేత్రస్థాయిలో ఆశ వర్కర్లకు సాధారణ ప్రసవాల వల్ల కలిగే ప్రయోజనాలు వివరించాం.ఆ తర్వాత కాన్పు సులువుగా అయ్యేందుకు అవసరమైన వ్యాయామాలు ఎలా చేయాలి, మందులు ఎలా తీసుకోవాలి... మొదలైన విషయాల గురించి గర్భిణులకు ఎప్పటికప్పుడు చెబుతూ వారితో ఆత్మీయంగా కలిసిపోయేవాళ్లం. మేము పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఏడాది వ్యవధిలోనే ఈ ఆస్పత్రిలో సీ సెక్షన్లు 70 శాతం నుంచి 30 శాతానికి తగ్గిపోయాయి. వైద్యపరంగా అత్యవసరం అనుకున్న వారికే సీ సెక్షన్లు చేసేవారు. ఈ ఆస్పత్రిలో ఒకే నెలలో 318 సాధారణ ప్రసవాలు చేసి రికార్డు సృష్టించాం’ అంటుంది స్వప్న. భద్రాచలం ఆస్పత్రిలో స్వప్న బృందం తీసుకొచ్చిన మార్పునకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు లభించింది. – తాండ్ర కృష్ణగోవింద్, సాక్షి, భద్రాద్రి కొత్తగూడెంముఖ కవళికలతోనే...భద్రాచలంలో పని చేస్తున్నప్పుడు ఒడిషాకు చెందిన ఆదివాసీ మహిళ కాన్పు కోసం వచ్చింది. మన దగ్గర కాన్పు చేయాలంటే బెడ్ మీద పడుకోబెడతాం. కానీ ఆ ఆదివాసీ మహిళ కింద కూర్చుంటాను అని చెబుతోంది. మా ఇద్దరి మధ్య భాష సమస్య ఉంది. ముఖకవళికలతోనే ఆమెకు ఎలా కంఫర్ట్‌గా ఉంటుందో కనుక్కుని బెడ్ మీదనే కూర్చునే విధంగా ఒప్పించి సాధారణ ప్రసవం చేయించాను. ఒకరోజు ఆస్పత్రికి వచ్చేసరికి ఒక గర్భిణీ స్పృహ కోల్పోయి ఉంది.బీపీ ఎక్కువగా ఉంది. పదేపదే ఫిట్స్ వస్తున్నాయి. హై రిస్క్ కేసు. బయటకు రిఫర్ చేద్దామంటే మరో ఆస్పత్రికి చేరుకునేలోగా తల్లీబిడ్డలప్రాణాలు ప్రమాదంలో పడతాయి. మేము తీసుకున్న శిక్షణ, నేర్చుకున్న నైపుణ్యం, అనుభవంతో భద్రాచలం ఆస్పత్రిలోనే గైనకాలజిస్ట్ సాయంతో నార్మల్ డెలివరీ చేశాం. ఆస్పత్రికి వచ్చేప్పుడు స్పృహలో లేని మహిళ తిరిగి వెళ్లేప్పుడు తన బిడ్డతో నవ్వుతూ వెళ్లడాన్ని చూడటం మాటలకు అందని సంతోషాన్ని ఇచ్చింది. నా వృత్తి జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి.– సూర్ణపు స్వప్నమరచిపోలేని జ్ఞాపకాలుహైదరాబాద్ కింగ్ కోఠి ఆసుపత్రిలో పనిచేస్తున్నప్పుడు ఎస్ఐ పరీక్షలకు సిద్ధమవుతున్న లావణ్య అనే గర్భవతి మమ్మల్ని సంప్రదించింది. సిజేరియన్ అయితే పోలీసు ఉద్యోగం రావడం కష్టమవుతుందనడంతో ఆమె చేత కొన్ని ఎక్సర్సైజులు చేయించాను. ఎదురుకాళ్లు ఉన్న పాప గర్భంలో సరైన స్థితికి వచ్చేలా చూశాను. నొప్పులు రావడం లేదని టెన్షన్ పడితే ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేలా కౌన్సెలింగ్ ఇవ్వడంతోపాటు రకరకాల వ్యాయామాలు చేయించి సాధారణ ప్రసవం అయ్యేలా చేశాను.వరంగల్ జిల్లా నెక్కొండకి చెందిన స్వప్న ఎత్తు తక్కువగా ఉండడంతో చాలా మంది సాధారణ ప్రసవం కాదని అంటుండేవారు. వరంగల్ సీకేఎం ఆసుపత్రిలో చైల్డ్ బర్త్ ఎడ్యుకేషన్ క్లాస్‌లు విన్నాక ఆమెలోని భయాలు తొలగిపోయాయి. సాధారణ ప్రసవం అయ్యింది. దుబాయ్‌లో ఉంటున్న నా చెల్లెలు సైన్తా నాష్ తొలి రెండు కాన్పులు సిజేరియన్ అయ్యాయి. మూడో కాన్పుకు సంబంధించి ఫోన్ ద్వారా నాతో మాట్లాడుతూ నేను చెప్పిన విధంగా వ్యాయామాలు చేసేది. చెల్లికి సాధారణ ప్రసవం కావడం ఎంతో సంతోషాన్నిచ్చింది.– నౌషీన్ నాజ్‘ప్రసవం అనేది తల్లికి పునర్జన్మ’ అంటారు. స్వప్న, నౌషీన్ నాజ్‌లు గతంలో తీసుకున్న శిక్షణ ఎంతోమంది తల్లులకు అండగా నిలవడానికి, ప్రతికూల పరిస్థితుల్లో ఎంతోమందిప్రాణాలు కాపాడడానికి ఉపయోగపడింది. జపాన్‌లోని లీడర్షిప్ప్రోగ్రామ్ ద్వారా వీరు మరెన్నో నైపుణ్యాలను సొంతం చేసుకోనున్నారు. ఆ నైపుణ్యాల ‘పుణ్యం’ ఊరకే పోదు. ఆపదలో ఉన్న ఎంతోమంది తల్లులకుప్రాణవాయువు అవుతుంది.‘వైద్యులకు వైద్యసేవలు అందించే నైపుణ్యమే కాదు ఆత్మస్థైర్యాన్నిచ్చే శక్తి కూడా ఉంటుంది’ అని తాత డాక్టర్ వారీజ్ బేగ్ చెప్పిన మాటలు హనుమకొండకు చెందిన నౌషీన్ నాజ్ మనసులో బలంగా నాటుకు΄ోయాయి. తాత మాటల స్ఫూర్తితో మెడిసిన్ ఎంట్రెన్స్ రాసింది కానీ సీటు రాలేదు. అయినా నిరాశపడకుండా హైదరాబాద్‌లోని ‘మెడిసిటీ స్కూల్ ఆఫ్ నర్సింగ్’లో జీఎన్ఎం కోర్సు చేరింది. ఆ తర్వాత మైనారిటీ కోటాలో ఎంబీబీఎస్ సీటు వచ్చినా కోర్సును కొనసాగించి నర్సింగ్ వృత్తిలో అత్యుత్తమ సేవలందిస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించింది.మాతా శిశు మరణాలను తగ్గించడంలో భాగంగా 1500కు పైగా సాధారణ ప్రసవాలలో సహాయం అందించింది. భయంతో వచ్చే తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో ΄ాటు సాధారణ ప్రసవం కోసం వ్యాయామాలు నేర్పిస్తుంటుంది. వరంగల్‌లో నిర్వహించిన ఆబ్స్టెక్టిక్స్ ఎమర్జెన్సీ(ఎంవోఎస్, మామ్స్) వర్క్‌షాప్‌లో యూకే నుంచి వచ్చిన మిడ్ వైఫరీ నర్సులు సాధారణ ప్రసవాలపై ఇక్కడి వైద్యులకు శిక్షణ ఇచ్చారు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ‘నేషనల్ మిడ్ వైఫరీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్’ గురించి తెలునుకొని అర్హత పరీక్షలు రాసి ఎంపికైంది నౌషీన్. మిడ్వైఫరీ కోర్సులో బెస్ట్ స్టూడెంట్‌గా ఎంపికైంది. హైదరాబాద్‌లోని నీలోఫర్, కింగ్ కోఠి, వనస్థలిపురం మెటర్నిటీ ఆసుపత్రులలో పనిచేసింది. వాటర్ బర్త్, బ్రీచ్ బర్త్ డెలివరీల గురించి తెలుసుకొని వ్యాయామాల ద్వారా సాధారణ ప్రసవాలు చేయించింది. బ్రీచ్బర్త్ డెలివరీలలో చాలామంది తల్లుల గర్భంలో ΄ాపలు ఎదురుకాళ్లతో ఉంటారు. వ్యాయామం ద్వారా తలపైకి, కాళ్లు కిందకు వచ్చేలా చేసి సాధారణ ప్రసవం అయ్యేలా చేసేది. ప్రస్తుతం అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో ఎంఏ సైకాలజీ కోర్సు చదువుతోంది. ‘తల్లుల మానసిక స్థితి తెలుసుకునేందుకు ఈ చదువు ఉపయోగపడుతుంది’ అంటుంది నౌషీన్. – వాంకె శ్రీనివాస్, సాక్షి, వరంగల్ -
'పాలిటెక్నిక్' లో నవోదయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ విద్య సరికొత్త బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులై.. మూడేళ్ల డిప్లొమా కోర్సు పూర్తి చేసేలోగా బహుళజాతి సంస్థల్లో లక్షల రూపాయల జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తోంది. గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలతో వివిధ కంపెనీల్లో దక్కుతున్న ఉద్యోగాలకు సంబంధించిన ప్లేస్మెంట్లు క్రమేణా పెరుగుతున్నాయి. 2023–24 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏకంగా 12 వేల మందికి ఉద్యోగాలు దక్కడం విశేషం.గతేడాది అత్యధిక వార్షిక వేతనం రూ.6.25 లక్షలుగా ఉంటే.. ఈ ఏడాది రూ.8.60 లక్షలకు పెరిగింది. ప్రతి వి ద్యార్థి సగటున రూ.3 లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఒకప్పుడు 2019కి ముందు 400 కూడా దాటని ఉద్యోగ అవకాశాలు.. ఇప్పడు వేల మందికి చేరు వ అవుతున్నాయి.2019–20లో 575 ఉద్యోగాలు, 2020–21లో 652 పోస్టులు, 2021–22లో 780 కొలువులు మాత్రమే వచ్చాయి. 2022–23లో 6వేల మంది క్యాంపస్ రిక్రూట్మెంట్లో ఎంపికైతే.. ఈ ఏడాది రెట్టింపైంది. ఇంటర్మీడియెట్, ఇంజనీరింగ్ కోర్సులను ఆరేళ్లు చదివి పూర్తి చేసిన తర్వాత అందుకునే వేతనాలను మూడేళ్ల డిప్లొమాతో 18 ఏళ్ల వయసులోనే దక్కించుకోవడం మార్కెట్లో పాలిటెక్నిక్ విద్య డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఒకవైపు ఉద్యోగం.. మరోవైపు ఉన్నత చదువులు రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రభుత్వ, 179 ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలల్లో 35,533 మంది డిప్లొమా ఫైనలియర్ చదువుతుంటే.. వీరిలో 12వేల మందికి ఉద్యోగాలు దక్కాయి. ఇందులో 50 శాతం ప్రభుత్వ కళాశాలల విద్యార్థులు ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పాలిటెక్నిక్ విద్యా చరిత్రలో తొలిసారిగా బహుళజాతి సంస్థ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో విద్యార్థులను ఉద్యోగాలకు ఎంపిక చేసింది. ఈ సంస్థ సాధారణంగా జాతీయ స్థాయిలో పేరొందిన ఐఐటీలు, ఎన్ఐటీలు నుంచి బీటెక్ గ్రాడ్యుయేట్లను మాత్రమే తమ సంస్థలో ఉద్యోగాలకు ఎంపిక చేసేది. కానీ.. ఏపీలో నైపుణ్యాలతో కూడిన విద్యను అభ్యసిస్తున్న పాలిటెక్నిక్ విద్యార్థులకు అరుదైన అవకాశం కల్పించింది.ఇక్కడ అత్యధిక ప్యాకేజీలతో రూ.8.60 వార్షిక వేతనానికి 9 మంది ఎల్రక్టానిక్స్ విద్యార్థులకు టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ ల్యాబ్ ఇంటర్న్‌లుగా, రూ.8 లక్షల వార్షిక వేతనంతో థాట్వర్క్ల కోసం సాఫ్ట్వేర్ డెవలపర్లుగా 35 మంది కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించాయి. ఈ రెండు సంస్థలతో పాటు మెగా ఇంజనీరింగ్, జీఈ ఏరోస్పేస్, మోస్ చిప్, సుజ్లాన్, అమరరాజా, ఆర్సెలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీ ల్, ఎఫ్ట్రానిక్స్, మేధా సర్వో, డాక్టర్ రెడ్డీస్ లే»ొరేటరీస్, షాపూర్జీ పల్లోంజీ, ఆల్ఫా లావాల్, మారుతీ సుజుకి రాయ ల్ ఎన్ఫీల్డ్, వీల్స్ ఇండియా, స్మార్ట్‌డివి టెక్నాలజీస్, నాగార్జున ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, హెచ్ఎల్ మాండో ఆనంద్ ఇండియా వంటి ప్రధాన సంస్థల్లో డిప్లొమా విద్యార్థులు కొలువుదీరారు.డిప్లొమా స్థాయిలో ఉద్యోగాలు పొందిన విద్యార్థులను సైతం ఉన్నత చదువుల వైపు ప్రోత్సహించేలా సాంకేతిక విద్యాశాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఆయా సంస్థలు రెండేళ్లు అనుభవం గడించిన తర్వాత ఉద్యోగులందరికీ బీటెక్ విద్యను అభ్యసించేలా తోడ్పాటును అందించనున్నాయి. ఇక్కడ ఉన్నత చదువులకయ్యే మొత్తం ఫీజును కూడా కంపెనీలే భరించనున్నాయి. ప్రత్యేక క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణసాంకేతిక విద్యాశాఖ విద్యార్థులను మార్కెట్లోకి రెడీ టు వర్క్‌గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కరిక్యులమ్ అమలు చేస్తోంది. అకడమిక్ లెర్నింగ్, ఇండస్ట్రీ అవసరాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి వర్క్‌షాపులను నిర్వహిస్తోంది. పారిశ్రామికవేత్తలు, ఐటీ తదితర కంపెనీల ప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలతో పరిశ్రమ ఆధారిత కోర్సులను ప్రారంభించింది. అన్ని పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రభుత్వం వర్చువల్ డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ఏర్పాటు చేసినందున విద్యార్థులకు లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా థియరీ, ప్రాక్టికల్ సబ్జెక్టుల బోధన పకడ్బందీగా అందుబాటులోకి వచ్చింది.పారిశ్రామిక రంగంలో వస్తున్న మార్పులకనుగుణంగా సిలబస్‌ను మార్పు చేయడంతో పాటు వాటి బోధనకు వీలుగా సిబ్బంది కోసం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లను అమలు చేయిస్తున్నారు. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల కోసం విద్యాసంస్థలను పరిశ్రమలతో అనుసంధానిస్తున్నారు. వీటితో పాటు క్యాంపస్ రిక్రూట్మెంట్ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడంతో పాటు ఇంటర్వ్యూల్లో చక్కగా రాణించేలా సంసిద్ధం చేసింది. కళాశాల స్థాయి, క్లస్టర్ల వారీగా, కమిషనరేట్ స్థాయి వరకు మల్టీ లెవల్ ప్లేస్మెంట్ డ్రైవ్‌లు చేపట్టింది. తద్వారా మహిళా పాలిటెక్నిక్‌లు, మోడల్ రెసిడెన్షియల్ పాలిటెక్నిక్,మైనారిటీ పాలిటెక్నిక్‌ల విద్యార్థులు గణనీయంగా ఉద్యోగాలు పొందారు. పాడేరు, చీపురుపల్లి, శ్రీకాకుళం, అద్దంకి, శ్రీశైలం, చోడవరం వంటి మారుమూల ప్రాంతాల్లో చదువుతున్న విద్యార్థులు ప్రఖ్యాత కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో విజయం సాధించింది. రూ.8.60 లక్షల వేతనంతో.. మాది అనంతపురం జిల్లా పామిడి గ్రామం. నాన్న డ్రైవర్. అమ్మ గృహిణి. వాళ్లిద్దరూ కష్టపడి చదివించడంతో నేను డిప్లొమాలో ఎలక్ట్రికల్ అండ్ ఎల్రక్టానిక్స్ (ఈఈఈ) పూర్తి చేశాను. చివరి ఏడాది చదువుతుండగానే బెంగళూరులోని టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీలో రూ.8.60 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం వచ్చింది. ఇది మల్టీ నేషనల్ కంపెనీ. నాకు రాయల్ ఎన్ఫీల్డ్లోనూ ఉద్యోగం వచ్చినప్పటికీ చిన్న ప్యాకేజీ కావడంతో చేరలేదు. మా కాలేజీలో చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ముందుగానే నేరి్పంచారు. ల్యాబ్స్, కరిక్యులమ్, క్యాంపస్ ఇంటర్వ్యూల్లో రాణించేలా ఇచ్చిన ప్రత్యేక శిక్షణ మాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు కొనసాగించాలని ఉంది. – ఎన్.గౌతమి, ప్రభుత్వ పాలిటెక్నిక్, అనంతపురం‘రెడీ టూ వర్క్’ లక్ష్యంతో.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పాలిటెక్నిక్ విద్యను అందించడంలో ఏపీ విజయం సాధించింది. ఏటా పెరుగుతున్న క్యాంపస్ ఎంపికలే ఇందుకు నిదర్శనం. టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, థాట్వర్స్, మేధా సర్వో, జీఈ ఏరో స్పేస్ వంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులు సాంకేతిక విద్యలోని విప్లవాత్మక మార్పులను చూసి ఎంతో ప్రశంసించారు. దేశవ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యలో ఇంతటి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కలి్పస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ ఒకటే.మారుతున్న సాంకేతిక, అవసరాలకు తగ్గట్టు బోధన ఉండేలా లెక్చరర్లకు పరిశ్రమల్లో నైపు ణ్య శిక్షణ ఇస్తున్నాం. విద్యార్థులను రెడీటూ వర్క్‌గా తీర్చిదిద్దుతున్నాం. అందుకే రాష్ట్రానికి అంతర్జాతీయ, జాతీయ బహుళజాతి కంపెనీలు వస్తున్నాయి. డిప్లొమాతో ఉద్యోగం పొందిన విద్యార్థులకు ఆయా సంస్థలే ఉన్నత చదువులకు ప్రోత్సహించేలా కంపెనీలు సైతం అంగీకరించాయి. చివరి సంవత్సరంలో ఉండగానే క్యాంపస్ రిక్రూట్మెంట్పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకున్నాం. అందుకే ప్లేస్మెంట్లు రెట్టింపయ్యాయి. – చదలవాడ నాగరాణి, కమిషనర్, సాంకేతిక విద్యాశాఖ -
రాముడి కోసం శిక్షణ
భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా హిందీలో ‘రామాయణ’ అనే సినిమా రూపొందనున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. మూడు భాగాలుగా రానున్న ఈ చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్, సీత పాత్రలో సాయిపల్లవి, హనుమంతుడి పాత్రలో సన్నీ డియోల్, రావణుడి పాత్రలో యశ్ నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది వేసవిలో ప్రారంభించాలనుకుంటున్నారట. ఈ సినిమాలో తాను పోషించనున్న రాముడి పాత్ర ఆహార్యం కోసం రణ్‌బీర్ కపూర్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకోనున్నారని బాలీవుడ్ సమాచారం. డైలాగ్స్ స్పష్టంగా పలికేందుకు కూడా డైలాగ్ డిక్షన్లో రణ్‌బీర్ ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నారట. ఇక ఈ సినిమాను నమిత్ మల్హోత్రా, మధు మంతెన, అల్లు అరవింద్‌లు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తారనే ప్రచారం సాగుతోంది. మరోవైపు హిందీలో ‘లవ్ అండ్ వార్’, ‘బ్రహ్మాస్త్రం’, ‘యానిమల్’ ఫ్రాంచైజీలు కమిటయ్యారు రణ్‌బీర్ కపూర్. -
తూకాల్లో మోసాలకు అడ్డుకట్ట
సాక్షి, అమరావతి: వ్యాపార దుకాణాలు, సూపర్ మార్కెట్లు, బంగారు ఆభరణాల విక్రయాల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. తూనికలు, కొలతల చట్టాన్ని గ్రామస్థాయి నుంచి పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది. వినియోగదారుల హక్కులను సంపూర్ణంగా పరిరక్షించడంలో గ్రామ, వార్డు సచివాలయ (జీఎస్‌డబ్ల్యూఎస్) సిబ్బందిని భాగస్వాములను చేయనుంది. దుకాణాల్లో సంప్రదాయ, ఎలక్ట్రానిక్ కాటా యంత్రాలను నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం ధ్రువీకరించడం, స్టాంపింగ్ ప్రక్రియలను పర్యవేక్షించేలా బాధ్యతలను వికేంద్రీకరించింది. ఇప్పటికే జీఎస్డబ్ల్యూఎస్లో సాంకేతిక అర్హత కలిగిన ఇంజినీరింగ్ సహాయక సిబ్బందిని గుర్తించింది. వీరికి వచ్చే వారంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ ప్రారంభించనున్నారు. సిబ్బంది కొరతను అధిగవిుంచేలా.. వాస్తవానికి తూనికలు, కొలతల శాఖలో సిబ్బంది కొరత వేధిస్తోంది. తూకంలో మోసాలతో పాటు ప్యాకింగ్ ఉత్పత్తులపై ముద్రిత ధర కంటే ఎక్కువకు విక్రయించడం, ఎమ్మార్పీలు ముద్రించకపోవడం వంటి లోపాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పరిపాలన వికేంద్రీకరణలో కీలక భూమిక పోషిస్తున్న సచివాలయ వ్యవస్థను సమర్థంగా వినియోగించుకునేలా ప్రభుత్వం దృష్టి సారించింది. ఇందులో భాగంగానే భౌతికశాస్త్రం చదివిన బీఈ, బీటెక్, బీఎస్సీ విద్యార్హత కలిగిన ఇంజినీరింగ్ సహాయకులను ఎంపిక చేసింది. తూనికలు, కొలతల శాఖ అధికారుల పర్యవేక్షణలో సచివాలయ ఇంజినీరింగ్ సహాయక సిబ్బంది స్థానికంగా వ్యాపార దుకాణాల్లో తనిఖీలు చేసి లోపాలు గుర్తించాలి. తూకాల్లో తేడా, ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయించడం, గ్యాస్, పెట్రోల్ బంకుల్లో మోసాలు వంటి అంశాలపై ఫిర్యాదులు అందిన వెంటనే వాటిని సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు చేపట్టేలా విధులను కేటాయిస్తూ పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ హెచ్.అరుణ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. వీటితోపాటు గ్రామ, మండల స్థాయిలో ఎప్పటికప్పుడు వినియోగదారులకు అవగాహన కల్పించడంతోపాటు 1967 టోల్‌ఫ్రీ నంబరుపై చైతన్యం తీసుకొచ్చేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
ఫైర్ వస్తే ఫైటర్ రెడీ!
సాక్షి, హైదరాబాద్: ఏదైనా బహుళ అంతస్తుల భవనంలో మంటలు చెలరేగుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? వెంటనే అత్యవసర నంబర్ ‘101’కు ఫోన్ చేసి ఫలానా చోట అగ్ని ప్రమాదం సంభవించిందని చెబుతారు. కానీ ఘటనాస్థలికి ఫైరింజన్లు చేరుకొనేలోగా భవనంలో చిక్కుకున్న వారికి ప్రాణాపాయం క్షణక్షణానికీ పెరుగుతుంటుంది. ఆస్తినష్టమూ అంతకంతకూ ఎక్కువ అవుతూ ఉంటుంది. అయితే ఒకవేళ ప్రమాదం జరిగిన మరుక్షణమే భవనానికి కాపాలాగా ఉండే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందే ఫైర్‌ఫైటర్ల అవతారం ఎత్తగలిగితే ప్రాణ, ఆస్తినష్టాన్ని వీలైనంత మేర తగ్గించేందుకు అవకాశం ఉంటుంది. సరిగ్గా ఈ ఆలోచనతోనే అగ్ని మాపకశాఖ వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఫస్ట్ రెస్పాండర్స్ కోసం ప్రత్యేకంగా.. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఎంత త్వరగా స్పందిస్తే అంత నష్ట తీవ్రత తగ్గుతుంది. అగ్ని ప్రమాద స్థలంలో ఉన్న వారి అప్రమత్తత సైతం ప్రాణాలు కాపాడటంలో, మంటల వ్యాప్తిని నియంత్రించడంలో కీలకం. అలాంటి ఫస్ట్ రెస్పాండర్స్ అయిన వారిని గుర్తించి అగ్నిప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర అగ్ని మాపకశాఖ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేక జీఓను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం ప్రైవేటు వ్యక్తులకు 30 రోజులపాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఇప్పటికే మొదటి బ్యాచ్‌లో 29 మందికి శిక్షణ మార్చి 29న ప్రారంభించినట్లు అగ్నిమాపకశాఖ డీజీ వై. నాగిరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో ఉండే ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది, పరిశ్రమలు, నివాస సముదాయాల్లో అందుబాటులో ఉండే వారికి అగ్ని ప్రమాదాల నియంత్రణ, ప్రమాద సమయంలో ప్రాణ, ఆస్తినష్టం నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి నేర్పడమే ఈ శిక్షణ ప్రధాన ఉద్దేశమని నాగిరెడ్డి వివరించారు. ఫీజు రూ.5,000 గతంలో అగ్ని మాపక శాఖ నుంచి ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ఇచ్చేవారు. కానీ అది మూడు రోజులు మాత్రమే ఉండేది. దీనివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో అగ్ని మాపకశాఖ ఉన్నతాధికారులు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా 30 రోజుల శిక్షణకు అనుమతి తీసుకున్నారు. దాని ప్రకారం వట్టినాగులపల్లిలోని తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్విసెస్ సివిల్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ప్రైవేటు వ్యక్తులకు శిక్షణ ప్రారంభించారు. 30 రోజులపాటు ఇచ్చే ఈ శిక్షణలో అన్ని రకాల అగ్నిప్రమాదాలు, ప్రమాదాల నియంత్రణలో అనుసరించాల్సిన విధానాలు, నివాసాలు, వ్యాపార సముదాయాల్లో ఫైర్ సేఫ్టీ పరికరాల నిర్వహణ, అగ్ని ప్రమాదాల నియంత్రణపై అవగాహన తదితర అంశాలను వారికి నేర్పుతున్నారు. బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు చేపట్టే బిల్డర్లు, ప్రైవేటు ఆస్పత్రులు, పరిశ్రమలు, ఇతర రెసిడెన్షియల్ సొసైటీలలో ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందికి ఈ శిక్షణ అందిస్తున్నారు. తమ సిబ్బందికి శిక్షణ ఇప్పించాలనుకొనే ప్రైవేటు సంస్థలు అగ్ని మాపకశాఖ వెబ్సైట్లో ముందుగా దరఖాస్తు చేసుకుంటే బ్యాచ్‌లవారీగా శిక్షణ అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ కోసం ఒక్కో వ్యక్తి నుంచి ఫీజు కింద రూ. 5 వేలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇలా స్పాన్సర్స్ నుంచి తీసుకున్న మొత్తాన్ని శిక్షణ కోసం ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. -
ఏపీ: ఖేలో ఇండియాకు ప్రత్యేక శిక్షణ
సాక్షి, అమరావతి: ఖేలో ఇండియా–2022 జాతీయ పోటీలకు ఏపీ క్రీడాకారుల బృందం సమాయత్తం అవుతోంది. ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు అండర్–19 బాలబాలికల విభాగంలో దేశ వ్యాప్తంగా క్రీడాకారులు పోటీపడనున్నారు. ఇందులో 13 క్రీడాంశాల్లో ఏపీ బృందం అర్హత సాధించగా 87 మంది క్రీడాకారులు రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు. చరిత్రలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఖేలో ఇండియాకు వెళ్తోన్న క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేసింది. రెండు వారాల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లోని స్పెషల్ కోచ్‌లతో క్రీడాకారులకు శిక్షణ అందించనుంది. ఇక్కడే ప్రత్యేక శిక్షణ ఖేలో ఇండియా పోటీల్లో క్రీడాకారులు పతకాలు సాధించేలా శాప్ ప్రోత్సహిస్తోంది. 53 మంది బాలురు, 32 బాలికల క్రీడాకారులతో ప్రత్యేక శిక్షణ క్యాంప్‌నకు శ్రీకారం చుట్టింది. అథ్లెటిక్స్ (ఏఎన్‌యూ), షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్ (కాకినాడ డీఎస్ఏ), స్విమ్మింగ్ (ఈడుపుగల్లు), జూడో (అనకాపల్లి డీఎస్ఏ), బాక్సింగ్ (విజయనగరం డీఎస్ఏ), బ్యాడ్మింటన్, కానోయింగ్ అండ్ కయాకింగ్, ఆర్చరీ (విజయవాడ), ఖోఖో, జిమ్నాస్టిక్స్ (బీఆర్ స్టేడియం గుంటూరు), మల్లఖంబ (భీమవరం), గటక్ (రేణిగుంట)లో ఈ నెల 17 నుంచి కోచింగ్ క్యాంప్‌ను ప్రారంభించనుంది. క్రీడాకారులకు డీఏ ఖేలో ఇండియా–2022 జాతీయ పోటీలు మధ్యప్రదేశ్‌లోని భోపాల్, ఇండోర్, గ్వాలియర్, ఉజ్జయిని, జబల్పూర్, మండల, బాలాఘాట్, ఖర్గోన్ వేదికగా జరగనున్నాయి. భారత క్రీడా ప్రాధికార సంస్థ క్రీడాకారులకు ప్రయాణ సౌకర్యాన్ని కలి్పస్తుండగా ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్క క్రీడాకారుడికి నేరుగా డీఏను అందించనుంది. ఖేలో ఇండియాకు అత్యధికంగా బాక్సింగ్‌లో 10 మంది, మల్లఖంబలో 12 మంది, వెయిట్ లిఫ్టింగ్‌లో 19 మంది క్రీడాకారులు ఏపీ నుంచి అర్హత సాధించడం విశేషం. పతకాలు నెగ్గేలా తర్ఫీదు రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. జాతీయ స్థాయిలో జరిగే ప్రతి మీట్లో పతకాలు సాధించేలా తరీ్ఫదును అందిస్తున్నాం. ఈ సారి ఖేలో ఇండియా పోటీల్లో అర్హత సాధించిన క్రీడాంశాలతో పాటు వయిల్కార్డ్ ద్వారా పాల్గొన్న క్రీడాకారులు కూడా కచి్చతంగా పతకం నెగ్గేలా ప్రణాళిక రూపొందించాం. అందుకే రాష్ట్రంలోని నిపుణులైన కోచ్‌లతో ప్రత్యేక శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశాం. – ఆర్కే రోజా, పర్యాటక, క్రీడా శాఖ మంత్రి. -
నీట్, జేఈఈకి ప్రత్యేక శిక్షణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులు నీట్, జేఈఈ పరీక్షల్లో మంచి ర్యాంకులు పొందేలా పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ‘ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ సమ్మర్ కోచింగ్’ పేరిట వేసవిలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు కార్పొరేట్ కాలేజీలకు దీటుగా పైసా ఖర్చు లేకుండా శిక్షణ ఇవ్వాలన్నది బోర్డు లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనవరి మొదటి వారంలో ఇంటర్ సిలబస్ పూర్తి చేసి, మరో వారం రివిజన్ చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత జనవరి రెండో వారం నుంచి ప్రతి కాలేజీలోనూ జేఈఈ, నీట్‌కు సంసిద్ధుల్ని చేసే ప్రక్రియను మొదలు పెడతారు. మార్చి నెలాఖరుకు ఇంటర్ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత ఏప్రిల్ నుంచి ప్రతి జిల్లా కేంద్రంలో ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ మొదలు పెడతారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కోచింగ్ వల్ల జాతీయ స్థాయి పరీక్షల్లోనే కాకుండా, తెలంగాణ ఎంసెట్‌లోనూ మంచి ర్యాంకులు పొందే వీలుందని అధికారులు వివరిస్తున్నారు. సీనియర్ లెక్చరర్లతో శిక్షణ శిక్షణలో భాగంగా నీట్, జేఈఈకి సంబంధించిన మాదిరి ప్రశ్నాపత్రాలను ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులందరికీ అందించనున్నారు. వీటి ఆధారంగా జిల్లా స్థాయిలో అంతర్గత పరీక్షలు నిర్వహిస్తారు. వీరిలో మంచి మార్కులు పొందిన వంద మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఇందులో బాలురు 50 మంది ఉంటే, బాలికలు 50 మంది ఉండాలని బోర్డు మార్గదర్శకాల్లో పేర్కొంది. వార్షిక పరీక్షల అనంతరం ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అన్ని వసతులు ఉన్న చోట వీటిని నెలకొల్పుతారు. ఉచిత వసతి, భోజనం, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు స్టడీ మెటీరియల్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న సీనియర్ సబ్జెక్టు లెక్చరర్లతో శిక్షణ ఇప్పించాలని భావిస్తున్నారు. అయితే ప్రత్యేక కోచింగ్ విషయంలో ప్రభుత్వ అ«ద్యాç³కులు విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. జేఈఈ మొదటి దశ పరీక్షలు జనవరిలో, రెండో దశ ఏప్రిల్‌లో జరుగుతాయి. ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 1తో ముగుస్తాయి. ఇలాంటప్పుడు ప్రత్యేక శిక్షణకు సమయం ఎక్కడ ఉంటుందనే సందేహాలు వారు వ్యక్తం చేస్తున్నారు. ర్యాంకులు రాకపోతే ఆ వైఫల్యాలను తమ పైకి నెట్టే వీలుందని కూడా అంటున్నట్టు తెలిసింది. -
‘భవిత’తో భరోసా
పెందుర్తి(విశాఖపట్నం): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా..ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘ప్రత్యేకావస రాల’ పిల్లల భవిష్యత్‌కు భరోసా కలుగుతోంది. భవిత కేంద్రాల్లో ఆయా పిల్లలకు ప్రత్యేక శిక్షణ, చికిత్స ద్వారా వారి సహజసిద్ధమైన నైపుణ్యాలను మెరుగుపరుస్తున్నారు. వారి పనులు వారే చేసుకునేలా తీర్చిదిద్దుతున్నారు. అయితే లోపాలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం..భవిత కేంద్రాలు ఉన్నట్లు తగిన ప్రచారం చేయకపోవడం వలన పిల్లలను తీర్చిదిద్దే అవకాశాలు చేజారుతున్నాయి. ఒక్క పెందుర్తిలోనే దాదాపు 200 మందికి పైగా లోపాలు కలిగిన పిల్లలు ఉండగా నియోజకవర్గంలో ఆ సంఖ్య వెయ్యికి పైమాటే..కానీ భవిత కేంద్రాల్లో ప్రస్తుతం ఉన్న పిల్లల సంఖ్య కేవలం 70 మంది మాత్రమే. ప్రత్యేకావసరాల పిల్లలను భవిత కేంద్రాల్లో చేర్పించేందుకు తల్లిదండ్రులు ప్రస్తుతం ఆయా కేంద్రాల్లో సంప్రదించవచ్చు. లోపాలు ఇవీ..శిక్షణ ఇలా.. ముందుగా కేంద్రంలో చేరిన చిన్నారులను కొద్దిరోజుల పాటు నిపుణులు ప్రత్యేక పర్యవేక్షణ ద్వారా పరిశీలించి వారి లోపాలను గుర్తిస్తారు. దృష్టిలోపం ఉన్నవారికి దృష్టి ప్రేరణ, బ్రెయిలీ లిపిపై అవగాహన కలిగిస్తారు. వినికిడి సమస్య ఉన్నవారికి నాలుక అంగుడికి మధ్య ప్రేరణ కలిగేలా తర్ఫీదు ఇస్తారు. కొవ్వొత్తులు ఊదించడం..బెలూన్లు ఊదడం..ఐస్ క్రీం తినిపించడం వంటివి ఇందులో భాగం. దీంతోపాటు ప్రత్యేక పరికరం ద్వారా వారి వినికిడి సమస్యను పరిష్కరించేందుకు చికిత్స అందిస్తారు. మానసిక సమస్యలు ఉన్న పిల్లలను ఏదైనా ఓ పని మీద ఆసక్తి కలిగేలా చేస్తారు. ఈ పిల్లల్లో త్వరగా మరిచిపోయే లక్షణం ఉంటుంది కనుక ఆ పని మీద ఆసక్తిని కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. తరచూ ఆటలను మారుస్తూ మానసిక స్థితిని కేంద్రీకృతం చేసేందుకు ప్రయత్నం చేస్తారు. లోపాలు గుర్తించి పిల్లలకు కేంద్రంలోనే శిక్షణ కాకుండా ఇంటి దగ్గర కూడా సాధన చేసే విదంగా భోదన చేస్తారు. తల్లిదండ్రులకు కూడా మెళకువలు నేర్పిస్తారు. పిల్లల లోపాలను బట్టి భవిత కేంద్రంలో కనీసం మూడు నెలలు గరిష్టంగా రెండేళ్లపాటు శిక్షణ, చికిత్స అందిస్తారు. పరిస్థితి మెరుగైనట్టు ఉంటే పిల్లలకు అందుబాటులో ఉండే పాఠశాలలో చేర్పించి సహిత విద్య అందించే ప్రయత్నం చేస్తారు. ‘భవిత’లో ఇలా చేర్పించండి సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ పరిధిలో పెందుర్తి, సబ్బవరం, పరవాడల్లో భవిత కేంద్రాలు నడుస్తున్నాయి. ఒక్కో కేంద్రంలో 20 మంది చొప్పున ప్రవేశాలు కల్పిస్తారు. నెలల చిన్నారి నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు అర్హులు. మిత వైకల్యం, అతి తక్కువ ఉన్న పిల్లలకు కేంద్రంలో ప్రతీరోజు శిక్షణ అందిస్తారు. తీవ్ర, అతి తీవ్ర వైకల్యం ఉన్నవారికి ఇంటి దగ్గరే తర్ఫీదు ఇస్తారు. లోపాలు ఉన్న పిల్లలతో పాటు తల్లిదండ్రులకు కూడా కౌన్సెలింగ్, గైడెన్స్ ఇస్తారు. తద్వారా ఇంటి నిపుణులు లేని సమయంలో కూడా పిల్లలకు తల్లిదండ్రులు శిక్షణ ఇచ్చుకునే అవకాశం ఉంటుందని నిర్వాహకుల భావన. అడ్మిషన్లు ఇస్తున్నాం భవిత కేంద్రాల్లో పిల్లల పరిస్థితికి అనుగుణంగా శిక్షణ, చికిత్స అందిస్తున్నాం. పిల్లలందరూ చక్కాగా స్పందిస్తున్నారు. కనీసం వారి పనులు వారు చేసుకునేలా తీర్చిదిద్దడమే మా కర్తవ్యం. అయితే చాలామంది తల్లిదండ్రులు ఇక్కడి కేంద్రంపై అవగాహన లేక బయట ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చేరే పిల్లలకు నిబంధనల ప్రకారం స్కాలర్షిప్/పింఛన్‌తో పాటు గార్డియన్‌కు బస్‌పాస్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాం. తమ పిల్లలను చేర్పించాలనుకునే వారు ఫోన్: 99122 39821 నంబర్లో సంప్రదించినా..కేంద్రానికి వచ్చినా అడ్మిషన్ ఇస్తాం. –ఎస్.శారద, భవిత కేంద్రం నిర్వాహకురాలు -
పోకిరీల లెక్కతీయండి..
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లో జులాయిగా తిరిగే పోకిరీల డేటా పోలీసుల వద్దకు చేరనుంది. అమ్మాయిలను వేధించే ఆకతాయిల జాబితా ఇకపై ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ‘దిశ’ఘటన దరిమిలా మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోకిరీల డేటా సేకరించనున్నారు. పట్టణాలతో పా టు గ్రామాల్లో పనీపాటా లేకుండా తిరిగేవారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. మహిళలపై వేధింపులకు సంబం ధించిన కేసుల్లో అధిక శాతం నిందితులు పనీపాటా లేనివారే కావడం గమనార్హం. ఎస్‌హెచ్‌జీలకు శిక్షణ... మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు.. సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళకు చట్టాలు, సైబర్ క్రైమ్, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, పోలీసులను ఎలా సంప్రదించాలి.. తదితర సమస్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు పాఠశాలలు, కాలేజీల్లో మహిళా రక్షణపై విద్యార్థులను చైతన్యం చేయనున్నారు. వీరికి షీటీమ్స్, పోలీసు కళాబృందాలు తోడవనున్నాయి. విద్యాసంస్థలే కాదు, కార్యాలయాలు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించనున్నారు. పాఠ్యాంశాల్లోనూ మార్పులు.. మహిళా భద్రత కోసం సమాజం ఆలోచ నల్లో మరింత మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాలికలపై వివక్షను రూపుమాపడం, లింగ సమా నత్వం సాధించడానికి స్కూలు పాఠ్యాంశాల్లో కొత్త అంశాలు చేర్చాలని నిర్ణయించారు. అమ్మాయిలను వేధిస్తే తలెత్తే పరిణామాలు, చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయో వివరించేలా పాఠ్యాంశాలు రూపొందించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ మేరకు మార్పులు చేయాలని భావిస్తోంది. -
మార్చ్..మార్చ్..మార్చ్..
గుర్తు తెలియని వాహనంతో కొందరు ఆయధాలతో అనుమానాస్పదంగా సంచరిస్తున్నారనే సమాచారాన్ని ఉన్నతాధికారుల నుంచి అందుకున్నారు మహిళా కమేండోలు. వెంటనే రంగంలోకి దిగి ఆ వాహనాన్ని గుర్తించారు... వారిపై మెరుపు దాడి చేసి వాహనంలో ప్రయాణిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్నారు... ఇవే కాకుండా ఆయుధం లేకుండా శత్రువును మట్టి కరిపించడం... సాయుధులైన శత్రువులను కూడా ఉట్టి చేతులతో అదుపులోకి తీసుకోవడం లాంటి కఠినమైన శిక్షణను పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే మొదటి మహిళ కమేండో బృందంగా గుర్తింపు పొందారు. కరీంనగర్ సీపీ కమలాసన్‌రెడ్డి అలోచన మేరకు 39 మంది సుక్షితులైన మహిళ కమేండోలు అందుబాటులోకి వచ్చారు... క్రావ్‌మగా యుద్ధతంత్ర కళ గతంలో సూర్యాపేట జిల్లాలో బస్టాండ్‌లో పోలీసులు తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారిగా ఆయుధాలతో ఇద్దరు పోలీసు అధికారులను కాల్చి చంపారు... ఇటీవల మొయినాబాద్‌లో కత్తితో పోలీసును గాయపర్చిన సంఘటన... బెంగుళూరులో కత్తిపోట్లు తదితర సంఘటనల దృష్ట్యా పోలీసుల వద్ద ఆయుధం లేని సమయంలో శత్రువు దాడి చేసినప్పుడు ఎలా ఎదుర్కోవాలో నేర్పే శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందనుకున్నారు కమలాసన్ రెడ్డి. నిరాయుధులుగా ఉన్న వారిపై శత్రువు అకస్మాత్తుగా సాయుధ దాడి చేస్తే ఆత్మరక్షణ చేసుకుంటూనే శత్రువును లొంగదీసుకునేందుకు ఇజ్రాయిల్దేశం క్రావ్‌మగా అనే యుద్ధతంత్ర కళలను అమలు చేస్తోంది. ఈ కళను వినియోగించి శత్రువును సులభంగా లొంగదీసుకోవడం సులువవుతుంది. 2017 జూన్‌లో పురుష పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఆ తర్వాత మహిళ బృందాన్ని ఎంపిక చేసి వారికి కఠోర శిక్షణ ఇప్పించి వారిని కమెండోలుగా రూపుదిద్దారు. శిక్షణ ఇలా... కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న 97 మంది మహిళ సిబ్బంది నుంచి చురుకుగా ఉన్న 39 మంది మహిళ పోలీసులను ఎంపికచేశారు. వారికి కఠోరమైన క్రావ్‌మగా శిక్షణ ఇచ్చారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ శిక్షణలో మొదటి గంట వరకూ ఫిజికల్ ఫిట్నెస్, పీటీ సర్క్యూట్, అజిలిటి డ్రిల్ (అప్రమత్తతో కూడిన) శిక్షణ ఇస్తారు... ఉదయం 9.30 గంటల నుంచి 12.30 గంటల వరకూ, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ పోరాట పద్ధతులు, వాటిని ఎదుర్కొనే తీరుపై 32 రోజులు పాటు నిర్విరామంగా శిక్షణ ఇచ్చారు. సిద్ధమైన కమెండో బృందం రాష్ట్రంలోనే మొట్టమొదటి మహిళ పోలీసు కమెండోల బృందం ఈ నెల 1వ తేదీన ఆవిర్భవించింది. నెల రోజుల పాటు కఠోర శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కమెండోలు వారి నైపుణ్యాలను, విన్యాసాలను ఈనెల 1న కరీంనగర్ రేంజ్ డీఐజీ ప్రమోద్ కుమార్, సీపీ కమలాసన్‌రెడ్డి, పలువురు అధికారుల ముందు ప్రదర్శించి అందరినీ అశ్చర్యపరిచారు. ఇజ్రాయిల్ దేశపు యుద్ధతంత్ర కళలో శిక్షణ పొందిన మహిళ కమెండోలు ఎలాంటి ఆయుధాలు లేకుండా అసాంఘిక శక్తులను అడ్డుకోవడం, జనసమూహన్ని చెదరకొట్టడం, అనుమానాస్పద వ్యక్తులు ఎదురు పడిన సందర్భాల్లో అదుపులోకి తీసుకోవడం. ఆయుధాలు ధరించి సంచరించే వారిని గుర్తించడంలో మెళకువలు, శత్రువు ఆయుధం ఎక్కుపెట్టిన సందర్భాల్లో వారిని ఎదిరించి లొంగదీసుకోవడం, వాహనాల్లో పారిపోతున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకోవడంతోబాటు అధునాతన ఆయుధాలతో యుద్ధతంత్ర కళల్లోని పలు విన్యాసాలను చేసి ఆహూతులను అబ్బురపరిచారు. పూర్తిస్థాయి కమేండోలుగా మారిన ఈ బృందాన్ని అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా క్యూఆర్టీ(క్విక్ యాక్షన్ టీం)గా ప్రత్యేక బాధ్యతలు అప్పగించనున్నారు. వీరికి పెట్రోలింగ్ విధులనూ కేటాయించారు. ఎలాంటి సమస్య వచ్చినా రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారీ కమేండోలు. – పుల్లమళ్ల యాదగిరి, సాక్షి, కరీంనగర్ ఎలాంటి పరిస్థితులనైనా సరే.. మహిళా పోలీస్‌గా పలు ప్రాంతాలు ఒంటరిగా తిరిగే సమయంలో బెరుకుగా, ఇబ్బందిగా ఉండేది. కమేండో శిక్షణ పూర్తయిన తర్వాత ఒంటరిగా ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. – జ్యోతి, కానిస్టేబుల్ కొండంత ధైర్యం వచ్చింది! గతంలో షీ టీమ్ బృందంలో పని చేసినప్పుడు.. కొంతమంది పోకిరీలను అదుపులోకి తీసుకునే సమయంలో కొంత ఇబ్బందిగా ఉండేది. మాకు కమేండోగా మారే అవకాశం వచ్చింది. దీనిని సద్వినియోగం చేసుకున్నాం. ఇప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. శత్రువు చేతిలో ఆయుధం ఉన్నా ఎదుర్కోగలం. – గౌతమి, కానిస్టేబుల్ -
గౌరీలంకేశ్ హత్యకు ప్రత్యేక శిక్షణ అక్కడే!
బనశంకరి: గౌరీలంకేశ్ హంతకులు కర్ణాటకలో ఫైరింగ్ శిక్షణ తీసుకున్నట్లు ఎస్ఐటీ విచారణలో తేలింది. ఈ హత్య కేసులో 12వ ముద్దాయిగా ఉన్న భరత్ కుర్నే బెళగావి జిల్లా అటవీ ప్రాంతంలోని జామ్బోటి గ్రామంలోని తన సొంత పొలంలో ప్రత్యేకంగా ఫైరింగ్ రేంజి ఏర్పాటు చేసుకొని ముఖం, తలను గురిపెట్టి కాల్పులు జరపడం, నడుస్తున్న వాహనంపై కాల్పులు జరపడం, బుల్లెట్లు లోడ్ చేసిన పిస్తోల్‌ను ఎలా పట్టుకోవాలనే అంశాల్లో శిక్షణ తీసుకున్నాడు. పుణెలో సామాజికవేత్త నరేంద్ర దాబోల్కర్ను హత్య చేయడానికి నెలక్రితం ముందే ఫైరింగ్ శిక్షణ ప్రారంభించినట్లు విచారణలో వెలుగుచూసింది. -
ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ
పాపన్నపేట(మెదక్) : పదో తరగతి పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. బుధవారం కలెక్టరెట్లో అధి కారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో పెండింగ్‌లో ఉన్న నిర్మాణాలను ఈ వేసవి సెలవుల్లో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఇంజినీరింగ్, విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నిర్మాణాలు పూర్తిచేసి వాటిని అందుబాటులోకి తీసుకురావాలన్నారు. మండలాల వారీగా జరుగుతున్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నా రు. ప్రతి పాఠశాలలో మరుగుదొడ్ల సౌకర్యం కల్పిం చాలన్నారు. పాఠశాలల పునఃప్రారంభం తరువాత పనులు కొనసాగకూడదన్నారు. సమావేశంలో డీఈఓ విజయలక్ష్మితో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బాలికలకు భరోసా
కరీంనగర్‌ఎడ్యుకేషన్: కస్తూరిబాగాంధీ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు నైపుణ్యాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. అభ్యాసనాభివృద్ధి(ఎల్ఈపీ)పేరుతో శుక్రవారం నుంచి వచ్చేనెల 12వరకు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని కేజీబీవీలు, ప్రభుత్వ, ఆదర్శ పాఠశాలల్లో చదువుల్లోని సామర్థ్యాలు, గణిత చతుర్విది ప్రక్రియల్లో వెనుకంజలో ఉన్న బాలికల కోసం గతేడాది నుంచి ఎంపిక చేసిన కేజీబీవీల్లో రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరకు ఎల్ఈపీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వెనకబడిన విద్యార్థినులకు.. చదువులో వెనకబడిన విద్యార్థినులకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడనుంది. జిల్లాలోని కరీంనగర్ కేజీబీవీ పాఠశాలను ఈ కార్యక్రమానికి వేదికగా నిర్ణయించారు. 11 కేజీబీవీలకు చెందిన 240 మంది విద్యార్థులను ఎంపిక చేసి వందేమాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. కేజీబీవీతో పాటు సమీపంలో ఉన్న ఆదర్శ పాఠశాలల నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లోని 7,8,9 తరగతుల్లో చదువులో వెనుకబడిన బాలికలను ఎంపిక చేసి భోజనంతో పాటు ఇతర వసతులు ఏర్పాటు చేశారు. వీరితో పాటు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 150మంది బాలికలు సైతం శిక్షణలో చేర్చుకోవాలని విద్యాశాఖ సూచించింది. 242 మందికి శిక్షణ... జిల్లాలోని 12 కస్తూరిబా పాఠశాలల్లో అభ్యాసనాభివృద్ధి కార్యక్రమం అమలవుతోంది. కొత్తగా ఏర్పడిన ఇల్లందకుంట మండలం మినహా 11 కేజీబీవీలకు చెందిన 242 మంది విద్యార్థులను నైపుణ్య శిక్షణాశిబిరానికి ఎంపిక చేశారు. వీరు ఇంటి నుంచి దుప్పట్లు , ఇతర సామగ్రి తెచ్చుకోవాల్సి ఉంటుంది. శిక్షణకాలంలో ఇక్కడే ఉచిత భోజనం, వసతిసౌకర్యం కల్పిస్తారు. ఈ విషయమై ఇప్పటికే ఉపాధ్యాయినులకు శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చే అంశాలివే... బాలికలు తెలుగు, ఆంగ్ల విషయాలపై పట్టు సాధించేలా వ్యాకారణాంశాలు వివరిస్తారు. చదవడం, రాయడంతో పాటు గణితంలో చతుర్విద ప్రక్రియలు వచ్చేలా చేస్తారు. స్వతహాగా వ్యాసం రాసే సామర్థ్యం, సైన్స్ సబ్జెక్టుల్లో శాస్త్ర సాంకేతిక, పరిజ్ఞానాన్ని పెంపొందింపజేసేలా అవగాహన కల్పిస్తున్నారు. ఆత్మరక్షణకు దోహదపడే మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. గణితంలో ప్రాథమిక అంశాలు, సూత్రాలు బోధిస్తున్నారు. గ్రంథాలయాల్లో పుస్తక పఠనంతో పాటు కంప్యూటర్ ప్రాథమిక అంశాలపై శిక్షణ ఉంటుంది. భవిష్యత్‌లో స్వయం ఉపాధికి దోహదపడే లా కుట్లు, అల్లికలు నేర్పిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలపై తర్ఫీదు ఇస్తున్నారు. క్రీడలు, యోగా, ధ్యానం, చిత్రలేఖనం, క్రాఫ్ట్‌లలో శిక్షణ ఇస్తున్నారు. సామాజిక అంశాలపై విద్యార్థినులతో బృంద చర్చలు నిర్వహిస్తున్నారు. ఎంపిక చేసిన డాక్యూమెంటరీలతో దృశ్యం రూపంలో ఆంగ్లం బోధిస్తున్నారు. ప్రతీరోజు విద్యార్థినులకు పరీక్ష నిర్వహించి, జవాబు పత్రాలను దిద్ది వారిలోని లోపాలు గమనిస్తున్నారు. ప్రతీ బాలికపై వ్యక్తిగత శ్రద్ధ వహించి వారిలోని లోపాలను అధిగమించేలా కృషి చేస్తున్నారు. శిక్షణ కార్యక్రమం ముగింపు రోజు బాలికలను ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. -
కౌమార దశలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ
జేసీ–2 రజనీకాంతరావు శ్రీకాకుళం పాతబస్టాండ్: కౌమార దశలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల మానసికంగా ఒత్తిడికి దూరంగా ఉంటారని జాయింట్ కలెక్టరు–2 పీ రజనీకాంతరావు తెలిపారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ఎస్ఎస్ఏ, వైద్య ఆరోగ్యశాఖ, కళాశాల విద్యాశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో 10 నుంచి 19 ఏళ్ల మధ్య ఆడపిల్లలను మానసిక ఒత్తిళ్లు, లింగవివక్షత, బాల్య వివా హాలు, పోషకాహారంలేమి, వేధింపులు వంటివి లేకుండా స్వేచ్ఛగా, మానసిక ఒత్తిడికి దూరంగా ఉండేవిధంగా సిద్ధం చేయాలని సూచించారు. దీనికిగాను జిల్లా స్థాయిలో రిసోర్సు పర్సన్లకు ఈ నెలలో శిక్షణ ఇవ్వనున్నామని తెలిపారు. ఆనక కళాశాల విద్యార్థినులు ఐదుగురిని ఒక గ్రూపుగా చేసి, రెండ్రోజుల పాటు శిక్షణ ఇవ్వాల్సింటుందని పేర్కొన్నారు. వీరు తమ కళాశాలల్లో మిగిలివారికి అవగాహన కల్పిస్తారన్నారు. ప్రధానంగా వ్యక్తిగత పరిశుభ్రత, ఉపాధి అవకాశాలు, మానసిక సంసిద్ధత, ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు, వంటివి తెలియజేయనున్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లు ఈ బృందాల వివరాలు అందజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజీవ్ విద్యామిషన్ పీవో త్రినాథరావు, ఐసీడీఎస్ పీడీ లీలావతి, వైద్యాధికారులు బీ జగన్నాథం, ఎం ప్రవీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
చిన్నారుల కోసం సానియా మరో అకాడమీ
3 నుంచి 8 ఏళ్ల వారికి ప్రత్యేక శిక్షణ సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరో అకాడమీని ప్రారంభించింది. సోమవారం ప్రారంభమైన ఈ అకాడమీని పూర్తిగా చిన్నారుల కోసమే తీర్చిదిద్దారు. ఇందులో మూడు నుంచి ఎనిమిదేళ్ల చిన్నారులకు శిక్షణ ఇస్తారు. 2013లో తన పేరు మీద మొయినాబాద్‌లో సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ (ఎస్‌ఎమ్‌టీఏ)ని నెలకొల్పింది. ఇందులో ఏడాది పొడవునా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. చిరుప్రాయంలోనే ఆట నేర్చుకునే వారికోసం ఇప్పుడు ప్రత్యేకంగా ఎస్‌ఎమ్‌టీఏ గ్రాస్‌రూట్ లెవల్ అకాడమీని ఫిల్మ్ నగర్‌లోని తన ఇంటికి సమీపంలో అందుబాటులోకి తెచ్చింది. ‘ఇప్పుడు ప్రొఫెషనల్స్‌గా కీర్తించబడుతున్న ఆటగాళ్లందరూ నాలుగైదేళ్లప్పుడే రాకెట్ పట్టారు. భారత్‌లోనూ తదుపరి సానియా, భూపతి, పేస్లు తయారవ్వాలంటే ఇలాంటి అకాడమీ ఒకటుండాలని మా కుటుంబం భావించింది. చాలామంది బాలబాలికలకు ఈ అకాడమీ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటుచేశాం. ముందుగా ఇక్కడ సులువుగా ఆట వొంటబట్టించేందుకు సాఫ్ట్‌బాల్‌తో ప్రాక్టీస్ చేయిస్తాం’ అని సానియా వివరించింది. -
‘ఇంగ్లిష్’ టీచర్లకు శిక్షణ
జిల్లాలో 654 పాఠశాలల్లో ఇంగ్లిషు మాధ్యమంలో బోధన ఈనెల 12 నుంచి.. మూడు విడతలుగా కార్యక్రమం పాపన్నపేట: ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించే విషయమై ఓ అడుగు ముందుకు పడింది. ఇంతకాలం ప్రారంభోత్సవాలకే పరిమితమైన విద్యాశాఖ ఇంగ్లీష్ భాషపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లాలోని 654 పాఠశాలల నుంచి ఇద్దరేసి ఉపాధ్యాయుల చొప్పున శిక్షణ ఇచ్చేందుకు ఈ నెల 12 నుంచి 19 వరకు షెడ్యూల్ రూపొందించింది. ఇందుకనుగుణంగా ఇంగ్లీష్ బోధన నైపుణ్యాన్ని పొందుపరుస్తు తయారు చేసిన మాడ్యూల్స్ గురువారం మండల వనరుల కేంద్రాలకు చేరాయి. నాలుగైదు మండలాల ఉపాధ్యాయులను ఒక చోట చేర్చి శిక్షణ ఇవ్వనున్నారు. కాగా ఒకటో, రెండో తరగతులకు సంబంధించి సిలబస్ రూపొందించి పుస్తకాలు రూపొందించాల్సి ఉంది. ప్రభుత్వ బడులను బతికించకునేందుకు ఈ యేడు ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను ప్రారంభించింది.మెదక్ జిల్లాలో మొత్తం 2940 పాఠశాలలుండగా 654 పాఠశాలల్లో ఈ యేడు ఇంగ్లీష్ మీడియంను ప్రారంభించారు.అయితే పాఠశాలలను ప్రారంభించినప్పటికీ పుస్తకాలు..కరిక్యులం లేక చాలా చోట్ల చిన్నారులు బడికి రావడం..పోవడం వరకే పరిమితమయ్యారన్న విమర్శలున్నాయి. దీనికి తోడు తెలుగు మీడియం బోధిస్తున్న టీచర్లకు ఇంగ్లీషు భాష బోధన మెలకువలు..నైపుణ్యం లేక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.అయినప్పటికీ చాలా చోట్ల టీచర్లు తమ సొంత డబ్బులతో ఇంగ్లిషు మీడియం పుస్తకాలు కొనుగోలు చేసి ఉన్న పరిజ్ఞానం మేరకు బోధించారు. మూడు విడతల శిక్షణ ఈనెల 12 నుంచి 30 వరకు మూడు విడతలుగా శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ నిర్ణయించింది.ఈ మేరకు మాడ్యూల్స్ గురువారం ఎమ్మార్సీలను చేరాయి. ఇందుకు అవసరమైన రిసోర్స్ పర్పన్లను నియమించి బోధన మెలకువలు, కమ్యునికేషన్ స్కిల్స్ నేర్పనున్నారు. ఈనెల 12 నుంచి 17 వరకు మొదటి విడత, 19 నుంచి 23 వరకు రెండో విడత, 26 నుంచి 30 వరకు మూడోవిడత శిక్షణ కార్యక్రమాలు 5 రోజుల చొప్పున కొనసాగనున్నాయి.నాలుగేసి మండలాలను ఒక చోట కలిపి శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన బడ్జెట్‌ను కూడా విడుదల చేశారు. -
పుష్కర వలంటీర్లకు ప్రత్యేకశిక్షణ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: కృష్ణా పుష్కరాల్లో స్వచ్ఛంద సేవలు అందించేందుకు వలంటీర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ టీకే శ్రీదేవి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా పుష్కరాలపై అధికారులతో ఆమె సమీక్షించారు. ఉద్యోగులు, యువజన సంఘాలు, రెడ్‌క్రాస్ సొసైటీ, కార్మిక సంస్థలు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, స్కౌట్స్ వివరాలు తీసుకోవడమే కాకుండా ఆయా ఘాట్ల వారీగా వారిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని సూచించారు. బీఎస్ఎన్ఎల్ ద్వారా 9 ఘాట్ల వద్ద టవర్లు ఏర్పాటు చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన సౌకర్యాలు కల్పించాలని బీఎస్ఎన్ఎల్ అధికారి వేణుగోపాల్ కలెక్టర్‌ను కోరారు. డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా సీనియర్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇస్తామని తెలిపారు. అన్ని ముఖ్యమైన ఘాట్ల వద్ద 104, 108 సేవలు అందుబాటులో ఉంచాలని కోరారు. భక్తులు నీటిలో పాలిథిన్ కవర్లు వేయకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సబ్బులు, శాంపులు వేయకుండా చర్యలు తీసుకోవాలని, బట్టలు ఉతకకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో జేసీ రాంకిషన్, ఏజేసీ రంజిత్ ప్రసాద్, డీఆర్వో భాస్కర్, జెడ్పీ సీఈఓ లక్ష్మీనారాయణ, ఆర్డీఓలు శ్రీనివాసులు, దేవేందర్‌రెడ్డి, రాంచందర్, అబ్దుల్ హమీద్, డీఎఫ్ఓలు రామ్మూర్తి, గంగారెడ్డి పాల్గొన్నారు. -
మహిళలకు ప్రత్యేక శిక్షణ
విజయనగరం: అందంగా కని పించాలనుకునే మహిళలకు నిజంగా ఇది శుభవార్తే. బ్యూటీపార్లర్లకు వెళ్లే తీరుబాటు లేని మహిళలు..ఇంట్లోనే ఉంటూ తమను తామే స్వయంగా అందంగా కనిపిం చేలా తయారు చేసుకునేందుకు మహిళలకు మేకప్, హెయి ర్ కేర్‌లో ప్రత్యేక శిక్షణ అందుబాటులోకి వచ్చేసింది. ఈ నెల 25వ తేదీనుంచి 29వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు సాక్షి,మైత్రి మహిళ ఆధ్వర్యంలో నిపుణులతో ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేశారు. విజ యనగరంలోని పద్మావతి నగర్, రోడ్‌నంబర్ 3, పివిఆర్ కాలనీ,ఫ్లాట్ నంబర్ 75 గైజోస్ బ్యూటీ క్లినిక్ ట్రైనింగ్ సెంటర్లో ఈ శిక్షణ ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ఇస్తారు. ఈ శిక్షణకు హాజరవ్వాలనుకునే మహిళలు రూ.1000 ఫీజు చెల్లించి 19వ తేదీ నుంచి 24వ తేదీ వరకు తమ పేర్లు రిజిస్రేషన్ చేయించుకోవచ్చు. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నంబర్9666283534, 9290918744లలో సంప్రదించ వచ్చు. -
చైన్స్నాచర్లను పట్టుకునేందుకు శిక్షణ
-
సరిగమల సవ్వడి.. సౌండ్ క్రాఫ్ట్
- శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య స్వరాల మేళవింపు - సాఫ్ట్వేర్ ఇంజినీర్ ప్రయోగం - పేద పిల్లలకు ప్రత్యేక శిక్షణ శ్రావ్యమైన సంగీతం చెవిన పడితే అక్కడే ఆగిపోతాడు. చేస్తున్న పని కూడా మరిచిపోయేవాడు. ఆ కుర్రాడు స్వరాలే జీవితం అనుకున్నాడు. సరిగమలతోనే సావాసం చేయాలని తలచాడు. అయితే, పరిస్థితులు అనుకూలించక సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యాడు. తొమ్మిదేళ్లు అదే ఉద్యోగంలో అత్యధిక వేతనం తీసుకుంటున్నా సంతృప్తి లేదు. చివరికి చిన్ననాటి సంగీతాన్నే సాధన చేస్తూ కొత్త అవతారం ఎత్తాడు. తనలాగే సరిగమలను ఆస్వాదించేవారికి శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను నెలకొల్పాడు. ఆ సంస్థ పేరు ‘సౌండ్ క్రాఫ్ట్’. ఆ సాధకుడు బికాస్థ్.్ర ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులను సంగీత గాంధర్వులుగా తీర్చిదిద్దుతున్నాడు. సాక్షి, సిటీబ్యూరో ఎయిర్ ఇండియాలో పనిచేసిన తండ్రి రాజు కిసారథ్ ప్రోత్సాహం.. టీచరైన అమ్మ మమతారథ్ చేయూతతో చిన్నప్పటి నుంచి సంగీతంపై ఇష్టం పెంచుకున్నారు భువనేశ్వర్‌కు చెందిన బికాస్థ్.్ర అప్పట్లో సంగీతమే ప్రొఫెషన్‌గా ఎంచుకునేందుకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయ్యారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చిన బికాస్ 2009లో జాబ్‌కు బైబై చెప్పారు. పండిట్ గోవింద్ రాజ్ వద్ద హిందూస్థానీ సంగీతాన్ని సాధన చేసి, భార్య ప్రసీదా నాయిర్ రథ్ తోడ్పాటుతో మాదాపూర్‌లో ‘సౌండ్ క్రాఫ్ట్’ మ్యూజిక్ సంస్థని ప్రారంభించారు. శాస్త్రీయ-పాశ్చాత్య స్వర మేళవింపు.. శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీత పరిమళాలను సిటీవాసులకు పంచాలనుకున్నారు బికాస్థ్.్ర ఉద్యోగులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు ఇదొక మంచి మార్గమమనుకున్నారు. అఖిల భారతీయ గాంధర్వ మహా విద్యాలయ నుంచి హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో వెస్ట్రన్ మ్యూజిక్‌ను వంటబట్టించుకున్నారు. అనంతరం ‘సౌండ్ క్రాఫ్ట్’ మ్యూజిక్ సంస్థను ఏర్పాటు చేసి పలువురిని తీర్చిదిద్దుతున్నారు. గచ్చిబౌలి, కూకట్పల్లి, జూబ్లిహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ శాఖల్లో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, వయోలిన్, వెస్ట్రన్ మ్యూజిక్‌తో పాటు ఫ్లూట్, తబలా, హార్మోనియం, వీణ, హిందూస్థానీ గాత్ర సంగీతంలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్ విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం ఉండటంతో వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా ఏదైనా వాద్య సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఇన్స్ట్రుమెంట్ను ఎవరికివారే తీసుకెళ్లాలి. విలువైన ఆ పరికరాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారికి సౌండ్ క్రాఫ్ట్ అకాడమీనే ఇన్స్ట్రుమెంట్స్ను అందిస్తుంది. ఐదేళ్లు పైబడిన వయసు వారు ఎవరైనా ఇక్కడ సంగీతం నేర్చుకోవచ్చు. సౌండ్ క్రాఫ్ట్‌లో సంగీతం నేర్చుకున్నవారు మ్యూజిక్ టీచర్లుగా సెటిల్ అయినవారున్నారు. కొంత మంది విద్యార్థులు గ్రూప్‌గా మ్యూజిక్ బ్యాండ్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలిస్తున్నారు. సంగీతమే జీవితం అనుకునే పేద విద్యార్థులకు తన అకాడమీలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు బికాస్థ్. కొత్తగా రేడియో జాకింగ్, డిస్క్ జాకింగ్, వీడియో జాకింగ్, ఫొటోగ్రఫీలోనూ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టారు. ‘సౌండ్ క్రాఫ్ట్ ప్రారంభించిన తొలినాళ్లలో సంస్థలో భాగస్వామిగా ఉన్న ఓ మ్యుజీషియన్ నమ్మించి ఆర్థిక నష్టాల్లోకి నెట్టారు. దీంతో మాదాపూర్‌లోని సౌండ్ క్రాఫ్ట్ కొన్నాళ్లు మూతబడింది. నా భార్య మెడలో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంక్‌లో కుదువ పెట్టి మళ్లీ సంస్థ ప్రారంభించేందుకు సహకరించింది’ అని వివరిచారు బికాస్థ్. పిల్లలతో స్వర సంగమం.. సంపాదన కోసం సౌండ్ క్రాఫ్ట్‌ను ఏర్పాటు చేయలేదని, మురికివాడల్లోని పిల్లల్లో ఉన్న సంగీత ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని చెబుతున్నారు బికాస్. తన కెరీర్లో సంపాదించిన దానికంటే.. ఆ పిల్లలతో గడిపిన సమయమే తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిందంటారు. వాళ్లలో కొందరినైనా ఫ్రొఫెషనల్ మ్యుజిషియన్స్ చేయాలన్నది తన లక్ష్యమంటాడు బికాస్థ్.్ర తన వద్ద శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు అల్బమ్స్ కూడా రూపొందించారని సంతోషం వెలుబుచ్చారు. నేపాల్ భూకంప బాధితుల కోసం ఇటీవల హైటెక్‌సిటీలో ఓ ఈవెంట్ నిర్వహించి వచ్చిన మొత్తాన్ని నేపాల్ బాధితులు అందజేసి మానవతవాదాన్ని చాటుకున్నారు బికాస్. ‘సంగీతమంటే సరదాగా నేర్చుకొని వదిలేయడం కాదు. ఈ రోజుల్లో మ్యూజిక్‌నే జీవితంగా ఎంచుకునేవారు ఉన్నారు. ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషి చేస్తున్నాం’ అంటున్నారు బికాస్థ్ ్రభార్య ప్రసీదా నాయర్ రథ్. ఎంత ఒత్తిడిలో ఉన్న సంగీతం వింటుంటే కలిగే ఆనందమే వేరని చెబుతున్నారు. స్పెషల్ సమ్మర్ శిక్షణ నాలుగు నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ సెషన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వెస్ట్రన్ డాన్స్, యోగా క్లాసులు నేర్పిస్తోంది సౌండ్ క్రాఫ్ట్. చేరాలనుకునేవారు 8885093930 నంబర్లో సంప్రదించవచ్చు. -
మొహల్లా సభలపై శిక్షణ
ఆప్ ప్రకటన ఎమ్మెల్యేల కోసమే... ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద కేటాయించే రూ.నాలుగు కోట్లను ఖర్చు చేయడం, స్థానికంగా ముఖ్యమైన పనులను గుర్తించడానికి మొహల్లా సభలు నిర్వహిస్తున్నామని ఆప్ ప్రకటించింది. ఈ విషయమై తమ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తున్నామని ప్రకటించింది. న్యూఢిల్లీ: స్థానిక ప్రజలతో వ్యవహరించడం, మొహల్లా సభల నిర్వహణపై తమ ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రకటించింది. ఎలాంటి రాజకీయ నేపథ్యమూ లేని 27 మంది ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎమ్మెల్యేలుగా మారిన సంగతి తెలిసిందే. ఈ 27 నియోజకవర్గాల్లోనూ మొహల్లా సభలు నిర్వహిస్తామని, ఇందుకోసం తమ ఎమ్మెల్యేలందరికీ ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని ఆప్ వెల్లడించింది. ప్రతి ఎమ్మెల్యేకు తన నియోజకవర్గ అభివృద్ధి నిధి కింద కేటాయించే రూ.నాలుగు కోట్లను ఎలా ఖర్చు చేయాలనే విషయమై ఈ సభల్లో చర్చిస్తారు. కొందరు ఎమ్మెల్యేలు ఆదివారం నుంచే సభలు నిర్వహిస్తుండగా, మిగతా వాళ్లు వారం రోజుల్లోపే ప్రారంభిస్తారని పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు. ఒక్కో నియోజకవర్గంలోనూ ఏయే ప్రాజెక్టులు చేపట్టాలనే విషయమై వచ్చే వారానికల్లా స్పష్టత వస్తుందని ఆయన అన్నారు. ఇక మొహల్లా సభల నిర్వహణపై ఆప్ అధిపతి అరవింద్ కేజ్రీవాల్ ఎమ్మెల్యేలతో బుధవారం భేటీ నిర్వహించారు. ఇవి కొనసాగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మరికొన్ని నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల నిబంధనావళి అమల్లోకి రాకముందే అన్ని నియోజకవర్గాల్లోని ప్రాజెక్టులకూ అనుమతి రావాలని ఆప్ కోరుకుంటోంది. అయితే ఎన్నికల నిర్వహణపై ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. పనులు మొదలుపెట్టేందుకు ఎమ్మెల్యేలకు 2-3 నెలల గడువు ఉంటుందని భావిస్తున్నారు. ‘ఎమ్మెల్యేలందరికీ ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నాం. ప్రాజెక్టులను గుర్తించి అంచనాలను తయారు చేస్తాం. అధికారులను సంప్రదించి పనులు కేటాయిస్తాం. అయితే మొహల్లా సభల సందర్భంగా ఎమ్మెల్యే ఎలా స్పందిస్తాడనేది ముఖ్యం. తన అధికార పరిధిలో ఏయే అంశాలు ఉంటాయనేదానిపై అతనికి స్పష్టమైన అవగాహన ఉండాలి. అనుచిత డిమాండ్లు లేవనెత్తితే వాటిని సమర్థంగా తిరస్కరించే నేర్పు ఉండడమూ అవసరమే. ఎమ్మెల్యే ‘ల్యాడ్’ నిధుల కింద ఏయే ప్రాజెక్టులు చేపట్టవచ్చనేదానిపై వారికి అవగాహన కల్పిస్తున్నాం’ అని ఆప్ సీనియర్ నాయకుడు మనీశ్ సిసోడియా అన్నారు. తన నియోజకవర్గం పత్పర్గంజ్లో వచ్చే వారం నుంచి మొహల్లా సభలు మొదలుపెడతామని ఈ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంత మేర నిధులు ఖర్చు చేస్తామనేదానికన్నా అభివృద్ధి ప్రక్రియలో ప్రజలు ఏ మేర భాగస్వాములు అవుతున్నారు అనేదే ముఖ్యమని వ్యాఖ్యానించారు. స్థానికులు ఆమోదం తెలిపితేనే తమ ఎమ్మెల్యేలు సంబంధిత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తారని స్పష్టం చేశారు. తదనంతరం మరో మొహల్లా సభ నిర్వహించి కొత్త ప్రాజెక్టు మొదలుపెడతామని సిసోడియా విశదీకరించారు. షాకుర్బస్తీ నుంచి గెలిచిన ఆప్ ఎమ్మెల్యే సత్యేంద్ర జైన్ బుధవారం నుంచి సభల నిర్వహణ ప్రారంభించారు. రాబోయే ఏడు రోజుల్లో 40 దాకా సభలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ‘ప్రతి ప్రాంతం నుంచి ప్రజల భాగస్వామ్యం కనిపించాలి. ముఖ్యమైన ప్రాజెక్టులకు ప్రాధాన్యం దక్కాలి’ అని ఆయన అభిప్రాయపడ్డారు. కేజ్రీవాల్ కూడా తన నియోజకవర్గం న్యూఢిల్లీలో వచ్చే వారం నుంచి మొహల్లా సభలు నిర్వహిస్తారని ఆప్ వర్గాలు తెలిపాయి. -
పోలీసులకు ప్రత్యేక శిక్షణ
న్యూఢిల్లీ: మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు సంబంధించిన కేసులను సమర్థవంతంగా పరిష్కరించేందుకు త్వరలో ఢిల్లీ పోలీసులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు. దీని ప్రకారం ఢిల్లీ పోలీస్ శాఖలోని సీనియర్ అధికారులతో సహా ప్రతి ఒక్కరూ ఏడాదికి కనీసం వారం రోజులపాటు ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఢిల్లీపోలీస్ శిక్షణ శాఖలోని ఒక సీనియర్ అధికారి మీడియాతో మాట్లాడుతూ ‘ బయట విధుల్లో ఉన్న పోలీసులందరినీ శిక్షణ తరగతులకు రప్పించడం కష్టం కాబట్టి శిక్షణాధికారులే సిబ్బంది దగ్గరకు వెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం. దీని ప్రకారం శిక్షణ ఇచ్చే అధికారులను ఆరు బృందాలుగా విభజించాం. ఒక్కో బృందంలో ఇద్దరు అధికారులుంటారు. ఈ బృందాలు ప్రతిరోజూ ఆరు పోలీస్స్టేషన్లను సందర్శిస్తాయి. మధ్యాహ్నం రెండుగంటల నుంచి ఐదు గంటల వరకు ఆయా స్టేషన్ల సిబ్బందికి నేర శిక్షాస్మృతి, భారతీయ శిక్షాస్మృతిపై శిక్షణ ఇస్తాయి’ అని తెలిపారు. ఏ రోజు ఏఏ పోలీస్స్టేషన్లకు శిక్షణా బృందాలు వెళతాయనేది ముందే సమాచారం ఇస్తాం కాబట్టి ఆయా రోజుల్లో సదరు పోలీస్స్టేషన్ల సిబ్బంది తప్పనిసరిగా శిక్షణ తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంద’ని ఆయన స్పష్టం చేశారు. 160 పోలీస్స్టేషన్లలో ఉన్న సిబ్బంది అందరికీశిక్షణ ఇవ్వగలమనే నమ్మకముందని పేర్కొన్నారు. శిక్షణ సమయంలో శిక్షకులు ఆడియా, వీడియో వనరులను వినియోగించుకుంటారన్నారు. ‘మహిళలపై అత్యాచారాలకు సంబంధించి చట్టాల్లో వస్తున్న సవరణలు ముఖ్యంగా ‘పోక్సో’పై నగర పోలీస్ సిబ్బందికి తగిన అవగాహన లేకపోవడంతో ఆయా కేసులను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోతున్నారని పోలీస్ శాఖ భావిస్తోంది. దీనిని అధిగమించేందుకు సిబ్బందికి చట్టాల సవరణలపై తగిన అవగాహన కల్పించేందుకు శిక్షణ తరగతులకు రూపకల్పన చేసినట్లు ఆ అధికారి తెలిపారు. ‘ఢిల్లీ పోలీస్ శాఖ నాలుగేళ్ల సర్వీసు పూర్తయిన కానిస్టేబుళ్లకు ఇప్పటికే మూడు వారాల రిఫ్రెషర్ కోర్సును ప్రారంభించింది. కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుళ్లకు కేసుల విచారణ, దర్యాప్తు సమయంలో కొత్తకొత్త సవాళ్లు ఎదురయ్యే అవకాశముంటుంది. అందువల్ల నాలుగేళ్ల సర్వీసు తర్వాత వారు ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొని తమ అనుమానాలను నివృత్తి చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం’ అని సీనియర్ అధికారి తెలిపారు.‘కానిస్టేబుళ్ల ఈ శిక్షణ తరగతులు గత 8 నెలలుగా కొనసాగుతున్నాయన్నాయి. ప్రస్తుతం ఒక్కో బ్యాచ్‌లో 250 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 400 చేయాలని యోచిస్తున్నాం..’ అని ఆయన వివరించారు. సబ్ ఇన్స్పెక్టర్లకు సైతం.. ఇదిలా ఉండగా, కానిస్టేబుళ్లకు అందిస్తున్న శిక్షణ వంటిదే సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఇచ్చేందుకు పోలీస్ శాఖ నిర్ణయించింది. తర్వాత ఈ శిక్షణ కార్యక్రమాలను ఏసీపీ స్థాయి వరకు విస్తరించాలని యోచిస్తోంది. కాగా బాధితుల ఫోన్లకు స్పందిం చడం, నేరస్తులను పట్టుకోవడం, దర్యాప్తు తదితర విషయాలపై ప్రస్తుతం శిక్షణ ఇస్తున్నారు. అలాగే విధి నిర్వహణలో ఒత్తిడిని తట్టుకోవడం ఎలా.. అనే దానిపై కూడా శిక్షణ ఇవ్వనున్నారు. కాగా, ఢిల్లీలో ఉగ్రవాదుల దాడులు, బాంబుల బెదిరింపులు, వీవీఐపీ రహదారుల్లో భద్రత హై అలర్ట్ సమయంలో అనుసరించాల్సిన పద్ధతులు వంటి వాటిని ఈ కోర్సులో కొత్తగా చేర్చనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది ఢిల్లీ పోలీస్ శాఖలోని సీనియర్ అధికారుల సహా ప్రతి ఒక్కరూ ఏడు రోజుల శిక్షణ తరగతులకు తప్పకుండా హాజరవుతార’ని స్పష్టం చేశారు.