సరిగమల సవ్వడి.. సౌండ్ క్రాఫ్ట్ | Classical music Western voices in the combine | Sakshi
Sakshi News home page

సరిగమల సవ్వడి.. సౌండ్ క్రాఫ్ట్

Published Wed, May 13 2015 2:08 AM | Last Updated on Sun, Sep 3 2017 1:54 AM

సరిగమల సవ్వడి..  సౌండ్ క్రాఫ్ట్

సరిగమల సవ్వడి.. సౌండ్ క్రాఫ్ట్

- శాస్త్రీయ సంగీతానికి పాశ్చాత్య స్వరాల మేళవింపు
- సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రయోగం
- పేద పిల్లలకు ప్రత్యేక శిక్షణ

శ్రావ్యమైన సంగీతం చెవిన పడితే అక్కడే ఆగిపోతాడు. చేస్తున్న పని కూడా మరిచిపోయేవాడు. ఆ కుర్రాడు స్వరాలే జీవితం అనుకున్నాడు. సరిగమలతోనే సావాసం చేయాలని తలచాడు. అయితే, పరిస్థితులు అనుకూలించక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యాడు. తొమ్మిదేళ్లు అదే ఉద్యోగంలో అత్యధిక వేతనం తీసుకుంటున్నా సంతృప్తి లేదు. చివరికి చిన్ననాటి సంగీతాన్నే సాధన చేస్తూ కొత్త అవతారం ఎత్తాడు. తనలాగే సరిగమలను ఆస్వాదించేవారికి శిక్షణ ఇచ్చేందుకు ఓ సంస్థను నెలకొల్పాడు. ఆ సంస్థ పేరు ‘సౌండ్ క్రాఫ్ట్’. ఆ సాధకుడు బికాస్థ్.్ర ఇప్పుడు ఎంతో మంది విద్యార్థులను సంగీత గాంధర్వులుగా తీర్చిదిద్దుతున్నాడు.
సాక్షి, సిటీబ్యూరో

ఎయిర్ ఇండియాలో పనిచేసిన తండ్రి రాజు కిసారథ్ ప్రోత్సాహం.. టీచరైన అమ్మ మమతారథ్ చేయూతతో చిన్నప్పటి నుంచి సంగీతంపై ఇష్టం పెంచుకున్నారు భువనేశ్వర్‌కు చెందిన బికాస్థ్.్ర అప్పట్లో సంగీతమే ప్రొఫెషన్‌గా ఎంచుకునేందుకు కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. దీంతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అయ్యారు. ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చిన బికాస్ 2009లో జాబ్‌కు బైబై చెప్పారు. పండిట్ గోవింద్ రాజ్ వద్ద హిందూస్థానీ సంగీతాన్ని సాధన చేసి, భార్య ప్రసీదా నాయిర్ రథ్ తోడ్పాటుతో మాదాపూర్‌లో ‘సౌండ్ క్రాఫ్ట్’ మ్యూజిక్ సంస్థని ప్రారంభించారు.

శాస్త్రీయ-పాశ్చాత్య స్వర మేళవింపు..
శాస్త్రీయ సంగీతంతో పాటు పాశ్చాత్య సంగీత పరిమళాలను సిటీవాసులకు పంచాలనుకున్నారు బికాస్థ్.్ర ఉద్యోగులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు ఇదొక మంచి మార్గమమనుకున్నారు. అఖిల భారతీయ గాంధర్వ మహా విద్యాలయ నుంచి హిందుస్థానీ సంగీతాన్ని నేర్చుకున్నారు. లండన్‌లోని ట్రినిటీ కాలేజీలో వెస్ట్రన్ మ్యూజిక్‌ను వంటబట్టించుకున్నారు. అనంతరం ‘సౌండ్ క్రాఫ్ట్’ మ్యూజిక్ సంస్థను ఏర్పాటు చేసి పలువురిని తీర్చిదిద్దుతున్నారు. గచ్చిబౌలి, కూకట్‌పల్లి, జూబ్లిహిల్స్‌లో ఉన్న ఈ సంస్థ శాఖల్లో పియానో, కీబోర్డ్, గిటార్, డ్రమ్స్, వయోలిన్, వెస్ట్రన్ మ్యూజిక్‌తో పాటు ఫ్లూట్, తబలా, హార్మోనియం, వీణ, హిందూస్థానీ గాత్ర సంగీతంలోనూ శిక్షణ ఇస్తున్నారు. ఈ సంస్థ ఇచ్చే సర్టిఫికెట్ విదేశాల్లో చదువుకునేందుకు అవకాశం ఉండటంతో వెస్ట్రన్ మ్యూజిక్ నేర్చుకునేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.

సాధారణంగా ఏదైనా వాద్య సంగీతం నేర్చుకోవాలనుకుంటే ఇన్‌స్ట్రుమెంట్‌ను ఎవరికివారే తీసుకెళ్లాలి. విలువైన ఆ పరికరాలను కొనుగోలు చేయడం అందరికీ సాధ్యం కాదు. అలాంటివారికి సౌండ్ క్రాఫ్ట్ అకాడమీనే ఇన్‌స్ట్రుమెంట్స్‌ను అందిస్తుంది. ఐదేళ్లు పైబడిన వయసు వారు ఎవరైనా ఇక్కడ సంగీతం నేర్చుకోవచ్చు. సౌండ్ క్రాఫ్ట్‌లో సంగీతం నేర్చుకున్నవారు మ్యూజిక్ టీచర్లుగా సెటిల్ అయినవారున్నారు. కొంత మంది విద్యార్థులు గ్రూప్‌గా మ్యూజిక్ బ్యాండ్స్ ఏర్పాటు చేసి ప్రదర్శనలిస్తున్నారు. సంగీతమే జీవితం అనుకునే పేద విద్యార్థులకు తన అకాడమీలోనే ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు బికాస్థ్.

కొత్తగా రేడియో జాకింగ్, డిస్క్ జాకింగ్, వీడియో జాకింగ్, ఫొటోగ్రఫీలోనూ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ కోర్సులు ప్రవేశపెట్టారు. ‘సౌండ్ క్రాఫ్ట్ ప్రారంభించిన తొలినాళ్లలో సంస్థలో భాగస్వామిగా ఉన్న ఓ మ్యుజీషియన్ నమ్మించి ఆర్థిక నష్టాల్లోకి నెట్టారు. దీంతో మాదాపూర్‌లోని సౌండ్ క్రాఫ్ట్ కొన్నాళ్లు మూతబడింది. నా భార్య మెడలో ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంక్‌లో కుదువ పెట్టి మళ్లీ సంస్థ ప్రారంభించేందుకు సహకరించింది’ అని వివరిచారు బికాస్థ్.

పిల్లలతో స్వర సంగమం..
సంపాదన కోసం సౌండ్ క్రాఫ్ట్‌ను ఏర్పాటు చేయలేదని, మురికివాడల్లోని పిల్లల్లో ఉన్న సంగీత ప్రతిభను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వడమే తమ ధ్యేయమని చెబుతున్నారు బికాస్. తన కెరీర్‌లో సంపాదించిన దానికంటే.. ఆ పిల్లలతో గడిపిన సమయమే తనకు ఎక్కువ సంతృప్తినిచ్చిందంటారు. వాళ్లలో కొందరినైనా ఫ్రొఫెషనల్ మ్యుజిషియన్స్ చేయాలన్నది తన లక్ష్యమంటాడు బికాస్థ్.్ర తన వద్ద శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు అల్బమ్స్ కూడా రూపొందించారని సంతోషం వెలుబుచ్చారు.

నేపాల్ భూకంప బాధితుల కోసం ఇటీవల హైటెక్‌సిటీలో ఓ ఈవెంట్ నిర్వహించి వచ్చిన మొత్తాన్ని నేపాల్ బాధితులు అందజేసి మానవతవాదాన్ని చాటుకున్నారు బికాస్. ‘సంగీతమంటే సరదాగా నేర్చుకొని వదిలేయడం కాదు. ఈ రోజుల్లో మ్యూజిక్‌నే జీవితంగా ఎంచుకునేవారు ఉన్నారు. ఇలాంటివారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు కృషి చేస్తున్నాం’ అంటున్నారు బికాస్థ్ ్రభార్య ప్రసీదా నాయర్ రథ్. ఎంత ఒత్తిడిలో ఉన్న సంగీతం వింటుంటే కలిగే ఆనందమే వేరని చెబుతున్నారు.
 
స్పెషల్ సమ్మర్ శిక్షణ
నాలుగు నుంచి 16 ఏళ్లలోపు పిల్లలకు ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ సెషన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్, వెస్ట్రన్ డాన్స్, యోగా క్లాసులు నేర్పిస్తోంది సౌండ్ క్రాఫ్ట్. చేరాలనుకునేవారు 8885093930 నంబర్‌లో సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement